ననియు హ్రస్వమునకుఁ దర్వాత నట్లుగాక పాక్షికముగా సంతరించునుగాన నచటఁ బూర్ణార్థములు రెండును బర్యాయముగ నుండుననియుఁ దెలుపఁదగిన యీ సామాన్యవిధి వెనుక నుదాహరించిన యనుస్వారచరిత్రమున కనుకూలముగనె యున్నదన వచ్చును. కాఁగా హ్రస్వమునకుఁ దర్వాత నిండుసున్న యెచ్చటెచ్చట నుచ్చారణస్థమగుచున్నదో యయ్యయి పదములిపుడు నిర్బిందుకములుగాఁ బలుకుఁబడిలో నున్న యెడల నట్టి బిందుస్థానము నర్థబిందువును నిల్పవలయునని గ్రహించుట కవకాశము లభించుచున్నది. ఈ పక్షమున 'నిద్దంపు, నాల్గింటి' మున్నగువాని రూపాంతరములగు 'నిద్దపు, నాల్గిటి' అను నిర్బిందుకు రూపములలో బూర్ల బిందు స్థానమున ఖండమును నిల్పవలసివచ్చునని శంకింపఁబనిలేదు. అట్టివెల్ల సాధ్యబిందు విషయిక ములగుటం జేసి యపవాదములగు వ్యాకరణ విధానములనుబట్టి తెలిసి కొనఁదగినవే యగును. కావున ' హ్రస్వాత్ పూర్ణోపి భవేత్' అను చింతామణి నియమము సిద్ధఖండాను స్వారస్థితి నిరూపణ విషయమున మాత్రమె యుపచరించుననియు నదియె ముఖ్యముగాఁ గావలసియున్నదనియు గ్రహింపవలయును. ఇంక నారింజ, చేమంతి మున్నగు వానిలోని సిద్ధపూర్ణానుస్వారములు హ్రస్వపూర్వకములగుటంజేసి వాని చోటులం దర్థబిందులు సైతము పర్యాయమున నుండవలసి వచ్చునను మఱోక విప్రతిపత్తి కూడఁ దోఁపవచ్చును గాని యదియు నంత బాధకము కానేరదు. పూర్ణబిందుచ్చారణము గల పదము నిర్బిందుకమయికూడ వాడుకలో నున్నపుడు మాత్రమె యా నిర్బిందుకు పదములోఁ బూర్ణబిందుస్థలమున నర్ధబిందువును నిల్పదగునని తెలుపుట మాత్రమె పయి హ్రస్వాత్ పూర్ణోపిభవేత్' అను సూత్రమునకుఁ బ్రయోజనమని గదా యంగీకరించియుంటిమి. అట్టి స్థితిలో పూర్ణ బిందువు కొన్నియెడలఁ దేలిపోకుండుటంజేసి యా పదమునకు నిర్బిందురూపమే వాడుకలో లేనపుడిఁక నచట నర్థబిందువు గలదా లేదా యను వికల్పము సైతము పొడమఁజాలదుగదా.
"దీర్ఘాచ్చేత్ ఖండమ్ వసజ్ఞేయః” అను సూత్రమన్ననో పైదానివలెఁగాక దీర్ఘపూర్వక సిద్ధపూర్ణమంతరించునెడఁ "గేవలముగ నఁతరించునను సిద్ధానుస్వారస్థితిని దెలుపుటలో నుపచరించుట మాత్రమెగాక సాధ్యవిషయమున గూడ విశేషవిధులు లేనపుడు —అనిర్దిష్టముగఁ బూర్ణార్థ సాధారణముగ బిందువిధానము చేయఁబడునపుడు దీర్ఘమునకు దర్వాత నట్టి విధానము చొప్పునఁ బూర్ణబిందువు రానేరదని తెలుపుటకుఁ గూడ నుపయోగించును. “నాతో + చెప్పెను" అను మొదలగు చోట్ల “తద్రుతంచ బిందుస్స్యాత్” అను సూత్రము చొప్పున “నాతోఁ జెప్పెను" అని సార్థబిందురూపము సిద్ధింపనేరదుగదా. పయి "దీర్గాచ్చేత్ ఖండఏవ సజ్ఞేయః" అను సూత్రము సామాన్యశాస్త్రమగుటం జేసి "కాంచు, వేండ్ర, తీండ్రించు, వేంచేయు ” మున్నగు స్థలములందలి పూర్ణబిందువులు బాధితములు కానేరవు.
పైరీతినే “నఖండః ప్రధమార్ద్రస్వాద్వైకృతేత్ర కదాపిచ” అనునధర్వణకృత సామాన్య నియమముకూడ 'ఉండు, పండు' మున్నగుచోట్లఁ బదము మొదటి హ్రస్వాచ్చునకు దర్వాతి నిండుసున్న సామాన్యముగా సంతరింపదను సిద్ధపూర్ణస్వభావ విశేషమును దెలుపుటయేగాక పైరీతేనె సాధ్యవిషయమున సైత మనిర్దిష్టముగఁ బూర్దార్ల సాధారణముగ విధింపఁబడిన బిందు విధానము చొప్పునఁ బదము మొదటి యచ్చునకుఁ దర్వాత నర్థబిందువు రానేరదని తెల్పుటకు గూడ (వెన్ను + తోవ = చెందొవ) నుపయోగించును.
ఈ సందర్భమునందు గొన్ని కారణములచేఁ బయిరీతి నంగీకరింపక యహోబల పండితుడు పె చింతామణి కారికకు మఱోకరీతిని వ్యాఖ్యానము చేసియున్నాఁడు. చింతామణిలో 'రాముఁడు, రాముండు' మున్నగుచోట్ల బిందువిధానము వేఱుగ లేకుండుటం జేసియు గ్రంథకర్త “మహతస్యోర్ధుజనితో భవేత్ పుంసి" అని యిట్లు బిందువిధానయోగ్య స్థలములందెల్లఁ బ్రత్యయములకు జకారము నిద్వర్ణముగా 'ఘటించుచు వచ్చుచుండుటం జేసియుఁ దన్మూలమున నట్టిచోట్ల బిందువును సంపాదింపఁదగునని తలంచి 'అనుక్తమన్య శబ్దానుశాసనవత్' అను న్యాయము ననుసరించి ప్రాకృత వ్యాకరణస్థమగు 'సానునాసికోచ్చారంజీత్' అను నియమము చోప్పున జిత్వమునకు ఫలము సానునాసికత్వమువంటి సార్ధబిందుకత్వమెయని సిద్ధాంతముచేసి 'డుజ్' మొదలగునవి బకారేత్త్వ మహిమచే నర్థబిందు పూర్వకములగునని యొక దారి త్రొక్కియున్నాఁడు. కావున నట్టియెడలఁ బూర్ణబిందురూపము సిద్ధించుటకయి హ్రస్వముమీఁది యరసున్న నిండుసున్న వికల్పము గానగునను నియమమాతనికిఁ గావలసివచ్చెను. ఆకారణమున నర్థానుస్వారము