Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.2 (1921).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంవత్సరపు దీర్ఘాసి వనపర్తి శాసనములోని సీసపద్యమునుదాహరించుచున్నాను.


సీ౹౹⁠

 శ్రీశకునేణు (స్థులు) భూసతి పైశైల
సంఖ్య (౯౯౭+౭౮
= ౧౦౭౫) నొన్దవేగి
దేశంబు గిమిడియు గోసలగిడ్రిసింగి
దేశంబుమరి యెడ్ల దేశ మనంగం
జనినభూపాలుడిన నినోచ్చె చలమత్తి౯
గణ్ణగణ్ణ నెగడిన మణ్ణలికుణ్డు
భూసురవంశుణ్ణు వాసవభభోగి
బణపతి సౌజన్య గుణయుతుణ్డు
దీర్ఘాసి భగవతిదేవి దేవాలయ
మున ముందటంగడు ఘనతరముగ
మణప మెత్తించె భణ్ణన విజయుణ్డు
గణ్ణ గోపాలుణ్ణఖణ్ణ వర్తి
దీనియ వెట్టెనద్దేవికినవ్వెలం
దన మనోవల్లభి వనజనేత్ర
దీవియ నెట్టెం బద్మావతియును (న్రా క్షోణీ
నశీశులు గల యంతకునుముదమున?

⁠


ఆ॥నె॥⁠

 గగనభూమి చంద్ర ఖరకరోదకశిఖి
మారుతాత్మమూర్తి= మహిషమధన
యిష్ట (పూత్త౯) ఫలములెల్ల కాలంబును
మెచ్చుతోడందమకు నిచ్చుచు[ణ్ణ]

⁠


ఎఫిగ్రాఫియా ఇండికా ౪ వాల్యము౼౪౫ నెంబరు

ఈశాసనపద్యమునందుఁ బూర్ణ బిందువూఁది పలుకవలసిన యదోరేఖా౦కిత స్థలములందును భేదమే మాత్రమును లేక యొకే విధమునఁ బూర్గబిందురేఖగాని దానికి మాఱుగ నప్పటి సంప్రదాయము చొప్పున పరస వర్ణవర్గపంచమముగాని వ్రాయఁబడుచు వచ్చెను గదా? ఈశాసనపులిపినిబట్టియు, యుద్ధమల్లుని బెజవాడ శాసనపులిపినిబట్టియుఁ బరిశీలించునపుడా కాలమున సంస్కృత భాషాప్రసిద్దమగు పరసవర్ణవర్గపంచమములు బిందుస్థానమున నిల్చు పద్ధతి టతవర్గపరక బిందువు విషయమున మాత్ర మాంధ్రమున సైతము వాడఁబడెడిదనియుఁ దక్కిన కచపవర్గాక్షర చతుష్టయ పరకబిందుస్థానమున నట్టి యుచ్చారణము వ్యవహారమున లేమింజేసి కావలయునట్లు తత్తద్వర్గపంచమాక్షరము లాచ్చికబిందుస్థానముననే గాక తత్సమరూపసంస్కృత బిందుస్థానమున సైతము నిలుపఁబడలేదనియు స్ఫురింపకమానదు. అయినను 'టత' వర్గవణ౯ చతుష్టయ పరకబిందువును సైతము తద్వర్గపంచమరూపమున నుచ్చరించు వాడుక యంతరించుటచేఁగాఁబోలు నటి నియమమును వైయాకరణులఁగీకరిం పకుండుటంజేసి యట్టి చోటులందుసైతము బిందుస్థానమున వర్గపంచమములను వ్రాయునాచారము నానాఁటికి నశించినదని గ్రహింపవలయును.

పయిచీతిని బిందువునూఁదిపలుకునపుడును దేల్చిపలుకునపుడును నొకేరీతిని వ్రాయుట సరికాదను తలంపునఁ గావలయు నూఁది పలుకవలసిన బిందువునకుఁ దర్వాతిహల్లునకూరకయె ద్విత్వము వ్రాయు సంప్రదాయము క్రమక్రమముగాఁ బయలు వెడలినది. ఇట్టి సంప్రదాయము కూడఁ గొంతవఱుకుచ్చారణములోని సహజస్థితి ననుసరించి కల్పింపఁబడినదేయని చెప్పవచ్చును. అనునాసిక్యము పలుకనివారి యుచ్చారణమునందును జలుబుచేసి ముక్కు దిమ్ముపట్టినవారి యుచ్చారణము నందును బిందువుపలుకుఁబడకుండుటయు నట్టి బిందువువలనఁ బూర్వాక్షరమునకుఁ గలుగవలసిన యూనిక (లేక) గౌరవము చెడకుండఁ బరవర్ణము ద్విత్వయుక్తముగాఁ బులుకబడుటయు సుప్రసిద్దమేగదా.

పదప్రకృతిలో సహజముగా లేని ద్విత్వమును వ్రాయుట యసంగతమని తలఁచికావలయు వైయాకరణులట్టి ద్విత్వలేఖనపద్దతి నంగీకరింపక యూఁదిపలుక వలసిన బిందువు నెప్పటియట్లు మండలాకారముగను, దేల్చి పలుకవలసిన బిందువు నర్ణ చంద్రాకారముగను వ్రాయవలయుననుచు "పూర్ణేందు సదృశః" పూర్ణ స్వర్థస్వరేఁదు సన్నిభః" అని యిట్లు సూత్రించి వానిక వరుసగాఁ బూర్లబిందువనియు నర్థబిందువనియు సార్లక నామములను గల్పించిరి.