బిందురూపమును దానికి రూపాంతరముగ నరబిందురూపమునుగూడ నుండుటయు మాత్రము సామాన్యముగా నుండఁబోదని చెప్పవచ్చును. హ్రస్వమునకుఁ దర్వాతి నిండుసున్న వికల్పముగా సంతరించుట తఱచుగా నగపడుచున్నను “ చేమంతి, నారింజ, పాపంచ, చెల్లెండ్రు” మున్నగుచోట్ల నఁతరింపకుండుటయు నియతమై యుండకపోలేదు. అట్లే పదముమొదటి హ్రస్వమునకుఁ దర్వాతి నిండుసున్న లోపింపకుండుటయే సహజమైనను “ఇఁక, అఁట" మొదలగు కొన్ని యలంతి స్థలములందును వికల్పముగ సంతరించుటకూడ రూఢియైయున్నది. ఆట్లయినను మొత్తముమీఁద నిండుసున్న దీర్ఘమునకుఁ దర్వాత నియతముగను హ్రస్వమునకుఁ దర్వాత వికల్పముగను దఱుచుగా నంతరించుట సహజమని మాత్రము చెప్పవచ్చును.
వ్యవహారమునందలి మార్పు లొక్కమాఱుగ జరుగుట, యసంభావ్యమగుటంజేసి పూర్ణబిందుచ్చారణ మంతరించుటలో సైత మది యొక్క మాఱుగ నశింపక మొదట మొదటఁ దత్సంబంధమగు నానునాసిక్యము తత్పూర్వాచ్చునం దావహించుచు వచ్చెడిదనియు నా నాఁటికట్టి సానునాసికోచ్చారణముకూడ నశించినదనియు గ్రహింపవలయును. కావుననే ప్రాచీనతమ మహాకవుల గ్రంథములలోఁ బూర్ణబిందు వంతరించిన పదభాగమున కట్టిదానినే ప్రాసస్థలములలో నిలిపెడి ప్రయత్నము చూపట్టుచున్నది.
| ఉ॥ | వాఁడిమయూఖముల్ గలుగు | |
- (భార|| ఆది 3 అ|)
అయినను నన్నయ కాలమునకె సానునాసికోచ్చారణముకూడ నరుదుగా నశించుచుండుటచేఁ గాఁబోలు నన్నయ భారత భాగమునందు సైతము పై నియమము సరిగా బాటింపఁబడి యుండలేదు.
| కం॥ | ఆ పన్నగ ముఖ్యులఁ దన | |
- (భార॥ ఆది |౩ఆశ్వా")
పైరీతిని నన్నయ కాలమునకే పూర్ణానుస్వార మంతరించుటయేగాక యచటి సానునాసిక పాఠముకూడ నశించుచుండెనని గ్రహింపదగి యున్నను నన్నయకుఁ దరువాతివారయ్యుఁ గొందఱు మహాకవులట్టి పదముల ప్రాచీనస్థితిని స్మరించి కాఁబోలు వానిని బూర్ణబిందు యుతపదభాగములకుఁ బ్రాసములుగా నచ్చటచ్చట నిలుపుచు వచ్చిరి.
| కం॥ | పోండిగన గజ తపశ్శిఖి | |
- (నన్నెచోడుని కుమారసంభవము ౬. ఆ. ౮౧౪
ప్రాచీనమహాకవుల యిట్టి ప్రయోగములనుబట్టి పరిశీలించునపుడు, నిండుసున్న యంతరించుటయు నచటి సానునాసికోచ్చారణ మంతరించుటయు నప్పటి కచిరకాలములోనే వ్యవహారమున సంభవించియుండెననియు, నక్కారణముననే ప్రాచీనులట్టి యనుస్వారములను గోవలము విడువక పయిరీతిని వానిఁబాటింప యత్నించుచు వచ్చిరనియుఁ దోఁపకపోదు. అట్లచిరకాలము నుఁడియె పూర్ణబిందు సంతిరించుట వ్యవహారమున సంభవించి యుండుటచేతనేకావలయు నట్లంతరించిన పూర్ణానుస్వార స్థలములోని సానునాసికోచ్చారణమున కనుమాపకమగు రేఖా విశేషమేదియు నావరకుండు లిపులలోఁ జూపట్టకున్నది. అనుస్వారము నూఁది పలుకవలసిన స్థలములందును దేల్చి పలుకవలసిన సాను నాసికోచ్చారణ స్థలములందును నవిశేషముగ నెప్పటియట్లు పూర్ణబిందు రేఖయే ప్రాచీనలేఖనమున నగిపడుచున్నది. అట్టిలేఖనములను బట్టి యావరకుచ్చారణభ్రష్టమయ్య నిండు సున్న లేఖ్యభ్రష్టము కాలేదని తోచుచున్నది. అట్టిలేఖన పద్ధతి చదువరులకు విశదపరచుటకై యిట క్రీస్తుశకము 1075