పడవ మునుగంగ రోదనపాటబోలు మనము లద్వైతభావ సంపదలబొదల వలపువారిలో నొక్కరి తొలుత బాయు గతసుఖంబుల నన్నింటి మతిదలంచి అబలులగువారు తలదాల్తుర ధిక చింత వస్తువుల చంచలత గూర్చి వగచు నీవు వలపుసతి! నీదుతూగుటుయ్యెలయు నిల్లు; చంచలతమంబు గాగనిర్మించి తేల? గాలివానలు పక్షుల గలచుకరణి వానిగుణములునీకు విభ్రాంతిగొలుపు శిశిరఋతువున సూర్యుని చెలువుదాల్చి ప్రధితధీశక్తి నిన్నిల పరిహసించు 15 ఆకురాలంగ చలిగాలి వీకసోక నీమ హెూన్నత సౌధము నేలగూల నీకు గాలూని నిలువంగ నెలవు లేదు. —యస్, రాఘవ అయ్యం గారు.
అర్థానుస్వారము
“ముఖనాసికా వచనోనునాసికః”
అను పాణినిసూత్రముచొప్పున ముఖ సహిత నాసికతో నుచ్చరింపఁబడున దగుట చేత ననునాసికయగు హల్లు నుచ్చారణము కొంత శ్రమాపాదకమనవచ్చును. అందును బూర్ణానుస్వార మూఁదిపలుకవలసిన దగుటచే మఱింతశ్రమము నొదవించుననుటకు సందేహము లేదు. వ్యవహారముత్తగోత్తరముగ సుఖముఖోచ్చారణము నపేక్షించుచుఁడును. కావుననె యాంధ్రభాషలో నట్టి పూర్జానుస్వారము వ్యవహారవశమున ననేక స్థలములయందంతరించుచు వచ్చినదని తోఁచుచున్నది.
అట్లు పూర్ణానుస్వారోచ్చారణ మంతరించుటలో మొదట మొదట మిక్కిలిగా శ్రమమును గలిగించు "తోంచు" మున్నగు దీర్ఘపూర్వక స్థలంబుల యందుండు పూర్ణానుస్వారము లంతరించెననియుఁ గ్రమక్రమముగా 'తలంచు' మున్నగు హ్రస్వపూర్వక స్ధలములలోని పూర్ణములు సైత మంతరింప నారంభించి పెక్కుచోట్ల మొదట మొదట వైకల్పికముగను దుదికి వ్యవహారమునఁ గేవలముగను సంతరించెననియు గ్రహింప వలసియున్నది. పదముయొక్క మొదటివర్ణ మెట్లయిననూఁద్రియే పలుకఁబడును
గాననట్టి యూనికకు (Accent) భంగమురాకుఁడ 'ఉండు, నిఁడు' మున్నగు పదాగిహ్రస్వములకుఁ దర్వాతి పూర్ణబిందువు మాత్ర మంతరింపనేరదయ్యె. అట్టియూనిక యుండకుండుటంజేసి పదము యొక్క తక్కిన వర్ణములు యుచ్చారణమునందు వక్తకంతగా
మెలఁకువ యుండదు గాన నట్టియెడ మాత్రమె యిట్టి లోపాదులు తటస్థించుట సహజమని గ్రహింపవలయును. ఇక నట్టి పదాదివర్ణము దీర్ఘమగునపుడా దీర్ఘముచేతనే యచటి యూనికయు (Accent) నిర్వహింపఁబడు చుండుటచే నచట లోప ప్రతిబంధము లేమిం జేసియు దీర్ఘమువిూఁది పూర్ణ బిందుచ్చారణ మధికశ్రమాపాదక మగుటం జేసియు నట్టి 'తోంచు' మున్నగుచోట్లఁ బదాది వర్ణమును జెందినదయ్యుఁ బూర్ణ బిందు నంతరించుటయె సహజమయ్యెను.
అయినను బయి నుదాహరించిన విషయము సార్వత్రికముగ వెలసి యుండలేదు. వక్తలు నియమముల ననుసరించి వ్యవహరించువారు కామింజేసి వ్యవహారమనుగమములకు సాకల్యముగా లొంగియుండనేరదు. కావున వ్యవహారస్థభాషకుఁ
జేయు నియమములు ప్రాయోవిషయికములయి యుండునుగాని సార్వత్రికములయి యుండనేరవు. అక్కారణముననే
“కాంచు తీండ్రించు, వేంచేయు, వేండ్రము, వాండ్రు, పూంచు” మున్నగుచోట్ల దీర్ఘపూర్వకమె యయ్యుఁ బూర్ణాను
స్వారబూర్ణమంతరింపక నియతముగా నిలిచియుండుటయు నగపడుచున్నవి. అట్లయినను దీర్ఘమునకుఁదర్వాతి నిండు
సున్న యంతరించుట గాని యంతరింపకుండుట గాని నియతమై యుండునేగాని హ్రస్వపూర్వక పూర్ణమువలె వికల్పముగా సంతరించుటయు నక్కారణమునఁ బూర్ణ