Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.2 (1921).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్పులు గన్పించును. ఉత్తరధృవము వద్దనున్న యెనిమిది నెలల పగలును కొంచెము మార్పు జెంది కొన్నిచోట్ల 7 నెలలును కొన్ని చోట్ల 10 నెలలును, కొన్నిచోట్ల 9 నెలలును కూడ పగలుగనే యుండును. కాన, ఈ విధముగ జూచినయెడల చీకటి కాలము బహుదినములుఁడునేయని మనము భయమందనక్కరలేదు. ఈ విషయములన్నియు కేవలము ఊహవలన చెప్పినవి కావు. కావలెననిన మన మచ్చటికి వెళ్ళి ప్రత్యక్షముగ నీ యంశములనన్నింటిని కండ్లార చూడవచ్చును. పూర్వము మన యార్యులు ఉత్తరధృవము వద్దనుఁడిరనగ, కేశేవల మాధృవము మీదనే కూర్చున్నారని యర్థము కాదు. ఏలననగ, ధృవమనునది యొక కొద్ది యణుమాత్రప్రదేశమేగాని, అలవిస్తారమైన దేశముకాదు. కనుక మన పూర్వులు ఉత్తరధృవమును చుట్టియున్న దేశములలో ధృవసమీపమున నుండిరని మావాదము. ఈ పైని చెప్పిన విచిత్రములైన రాత్రింబవళ్ళును నక్షత్రాదుల చిత్రవిచిత్ర భ్రమణములును ఈ మొదలెగు ఉత్తరధృవ ప్రాంతదేశ లక్షణములు వేదముల యందు మనకు కనఁబడిన యెడల మనయార్యులచ్చట మొదట నివసించియుఁడిరని సిద్దాంతము చేయవచ్చును. ఇక ముంధ్యాయములలో యీ వేదవిషయముల నన్నిటిని విచారించెదము.




మల్లిక. నెవ్వడొసంగెనో నీకు వాఁ డయో పోయక పోయె నేమియొకొ పూర్ణతమంబగునట్టి యాయువా; హా! యెఱుఁగంగనయ్యె భవ దల్పతమప్రణయంబె లోకము బాయఁగ దాని నెవ్వగల పాల్పఱుచుం జిర మేల? మల్లికా! ఉ॥ ఏ లతకూన నిన్నుఁ గన నెంతటి పావనవృత్తిఁ బూనెనో పోలిచిచూడ మంజుగుణ పుంజము మెచ్చుగ నీక కల్గె; వే యే చలింపఁ జేసెదు మ ఈ మొదలగు హిం బ్రజఁ గేవలమార్దవంబున లాలితసౌమనస్యమున లాభము లిట్టివికావె? మల్లికా! ఉ॥ అంటిఁ గండిపోయెద వ టంచును నుల్లము తల్లడిల్లు; ని న్నంటనిచో నవజ్ఞయగు నంచును జంకు జనించుఁ; గాననీ రెంటికిఁ దప్పుకొంటకు ని దీక్షణ భృంగకులంబు చేత ని న్నంటియు నంటకుంటి నిట

చంచలపువల పు. దీపమారిన కాంతుల దీప్తి మాయు మురళి పగిలిన గానంపు మురువు చెడును మబ్బు వెడల మయూరము జబ్బువడును వలపుడెలిపిన మక్కువ చులకనగును వేణు దీపంబులను బాసి గాన కాంతు నల్గకుమీ నవకుందమాలికా! -వడ్డాది సుబ్బరాయ కవి. లల్లనల్లన రూపఱు నట్టులవని మానవుల మానసము భావహీనమేని వలపు భావంబులకు ప్రతిధ్వనులు రావు ధ్వనులురా; వొక వేళను వచ్చునేని 5 పాడువడిన గృహంబున వాయురవము 10