Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.2 (1921).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దానిచుట్టుకుండు భూభాగముయొక్క లక్షణము లేవియో వీనికిని తక్కినవానికి నుండు భేదమేమియో కొంచెము దివ్మౌత్రముగ నీయధ్యాయములో సూచించెదము.

ఈ భూమి గుండ్రని మట్టి ముద్దవలె నున్నది. ఈ మట్టిముద్ద మధ్యగ నొకపుల్లను గ్రుచ్చినట్లైన నది రెండువైపులకును వచ్చును గద. ఈపుల్లయే యిరుసు. ఈ యిరుసు ఉత్తర దక్షిణములుగా నున్నది. ఈ యిరుసు నాధారముగ జేసికొని ఈభూగోళము పడమట నుండి తూర్పునకు ౨౪ గంటలకొక చుట్టు చొప్పున సంవత్సరమునకు ౩౬౦ చుట్లు తిరుగుచున్నది. ఈ యిరుసు భూమి యొక్క పైభాగమునకు పొడచుకొనివచ్చు రెండు చోటులకు ధృవములని పేరు. ఉత్తరపు వైపుననున్నది ఉత్తరధృవము. దక్షిణమున నున్నది దక్షిణధృవము. ప్రస్తుతము మనము ఉత్తర దృవ లక్షణములను గూర్చియే విచారింపవలసియున్నది. ఈ యుత్తర ధృవమును కొంతవరకు చుట్టుకొని యున్న భూభాగములకు "ఉత్తరధృవ ప్రాంతభూమి” యని పేరిడ వచ్చును. ఈ భూగోళ మెప్పుడును ఒక యిరుసు మీదనే తిరుగుచున్నది. గాని యీ యిరుసు మారిపోలేదని యిదివరకే చెప్పియుంటిమి. మన చిన్న భూగోళము అనంతమైన యీ బ్రహ్మాండఈ గోళములో కొన్ని కొన్ని నియమముల ననుసరించి తిరుగుచున్నది. ఈ భూభ్రమణము వలన బ్రహ్మాండ గోళములోని సూర్యుడు చంద్రుఁడు నక్షత్రములు మొదలగునవన్నియు తూర్పునుండి పడమటికి నడుచుచున్నట్లు మన కండ్లకు కనుపించు చున్నవి. కాని, యీయిరుసునకు సూటిగ నుత్తర దిశనున్న నొకా నొక నక్షత్రము మాత్రము కదలక ఒకేచోట నిలిచి యున్నట్లు కనుపించును. దీనికే ధృవనక్షత్రమని పేరు. ఈ ధృవ నక్షత్రము నాధారము చేసికొని తక్కిన నక్షత్రాదులన్నియు దానిచుట్టును తిరుగుచున్నట్లు కనుపించును. మన మెవరమైనను భూమిపై నున్న ఉత్తర ధృవము వద్దకు పోయి అచ్చట నిలువబడి చూచినట్లేన మన కేమికాన్పించును? ధృవనక్షత్రము సూటిగా మన నెత్తిమీద కాన్పించును. తక్కిన నక్షత్రాదులన్నియు, - యీ దేశములోవలె తూర్పున నుదయింపక ఆధృవ నక్షత్రము చుట్టును అడ్డముగ కుమ్మరి సారెవలె గిరగిర తిరుగు చుండును. అచ్చట సూర్యుడు దినదినమున నుదయింపడు. ఒక సారి యుదయించిన పిమ్మట సుమారు ఆరునెలల వరకును తిరిగి అస్తమింపడు. ఆ స్తమించినపిమ్మట తిరిగి సుమారు ఆరునెలల వరకును ఉదయింపడు. అనగ ఆరునెలలేడతెగని పగలును, దాని వెంట ఆరునెలలేడతెగని రాత్రియు నుండును. సూర్యోదయమునకు పూర్వము ఉషఃకాలముండును గద. అనగ, వెలుతురు కొద్ది కొద్దిగ వచ్చుటకు ప్రారంభించినది మొదలుకొని పూర్తిగ సూర్య బింబము పైకి వచ్చవరకును గల కాలము ఉషః కాలమనబడును. ఈ యుష్యఃకాలము సుమారు ముప్పది దినములేడతెగక యుండును. మొదట నీ వెలుతురు భూమియు ఆకాశమును కలిసినట్లు కనబడు చోటకాన్పించి, ఆ యంచుచుట్టును దినమునకొక సారి గీరున తిరుగుచుండును. ఈ వెలుతురిట్లు దినమునకొకసారి యొక చుట్టుచొప్పున తిరుగుచు, దినక్రమమున పైకివచ్చు చుండును. ఇట్లు క్రమక్రమముగ (ఉషస్సులు) పైకివచ్చు ఛుండగ 30 దినములైన పిమ్మట సూర్యబింబము పైకి గాన్పించును. ఈ సూర్య బింబము కూడ నిదేవిధమున అంచుచుట్టును తిరుగుచు, క్రమముగ దినముల వరుసను పైకి వచ్చుచుండును. ఇట్లు క్రమముగ కొంతవరకు పైకిపోయి, తిరిగి క్రమముగ క్రిందికిదిగి, ఆరు నెలలైన పిమ్మట బింబము కుంకును. బింబము కుంకినను “యీ రెండ” యుండును గద. ఉదయ కాలమున నుండు ఉషఃకాలమువలెనే ఈ "యీ రెండ” కూడ సుమారు ముప్పది దినములుండును. సూర్యుని వెలుతురు ఆరు నెలలును, ఉషఃకాలమును ఈ రెండయు కలిసి రెండు నెలలును ౼ మొత్తము యెనిమిది నెలలు వెలుతురును, తక్కిన నాలుగు నెలలును చీకటియు నుండును. వెరిశి ౧౨ నెలలును కలిసి సంవత్సరమగు చున్నది. దీనినిచూచి కొందరు "ఆమ్మో! నాలుగు నెలలు చీకటియే? మనుష్యులెట్లు బ్రతుకగలరు? మన పూర్వులచ్చట నెట్లు నివసింపగలిగిరి ” అని భయపడవచ్చును. కాని యీ నాలుగు నెలల రాత్రిలో సైతము సగము కాలము చంద్రకాంతి యుండును. సదా నక్షత్రకాంతి యుండును. అదికాక యుత్తర ధృవము వద్ద "అరోరా బోరియాలిస్ (Aurora Borealis)" అను పేరు గల గొప్ప వెలుతురొకటి (జ్యోతి) ఆకాశములో 'ధృవ నక్షత్రమునకు దగ్గరగా సదా వెలుగు చుండును. ఇవన్నియు కలిసి నాలుగు నెలల దీర్ఘ నిశాసమయమును కొంతవరకు కష్టముగ తోపనీయవు; కేవలము ఉత్తర ధృవము వద్దనున్న స్థితిగతులివి. కాని ఉత్తరధృవమును వదలి కొంచెము దక్షిణమునకు వచ్చినట్లయిన కొంచెముగ