నీవంశము కామినేని వంశమని వ్యవహరించుట గలదు. ఈ విషయమంతయు మల్లారెడ్డి జీవితము వ్రాయుచుఁ ఇర్చించి యున్నారము. భద్రాయురభ్యుదయములో
| కం. | ఆపాక నాటివఁశో | |
| తే౹౹గీ౹౹ | అతఁడు బిక్కనవోలుపురాధిరాజ | |
కామి (రెడ్డి) నేడు బిక్కనవోలు పాలించినట్లు గుతుపశాహచే గౌరవింపఁబడినటులఁ జెప్పఁబడినది ప్రమాదము. శివధర్మోత్తర ఖండములో మల్లారెడ్డి, కామినేనివంశములోఁ జనించిన కాచారెడ్డియే గృష్ణదాఁటి మెదకుదుర్గము క్రిందనున్న బిక్కనవోలుకు వచ్చి నటులఁ జెప్పబడి యున్నదిగాన కామినేడు, బిక్కనవోలులో రాజ్యము స్థాపించినది యథార్థముకాదు. ఈ విషయము
మలారెడ్డి జీవితమును విస్తరించితిమి. రాజన్న దేశాయి గామరెడ్డి పేటలోఁగొలువుదీర్చి రాపాక లక్ష్మీపతి కవిని సగౌరవములతోఁదిలకించి రాజేశ్వరార్పణముగ భద్రాయురభ్యుదయము రచింపుకుని చెప్పియున్నాఁడు. కవి యియ్యకొని రాజేశ్వరుని యాలయమునకేగి యాదేవుని దర్శించి దక్షిణాశా విశాలమందిరముననున్న సీతారాముని సేవించి గ్రంధరచనమున కుపక్రమించెను.
రాజన్న దేశాయి కాలమును తెలిసికొంటిమేని భద్రాయురభ్యుదయ రచనకాలము సువ్యక్తము కాఁగలదు. రాజన్న దేశాయి పోతారెడ్డి కుమారుఁడు. ఇతఁడు కామినేనివారి వంశమునఁ బండ్రెండవ పురుషుఁడు. రాజన్న దేశాయినిగూర్చి యొక చిత్రకథ యుమాపత్యభ్యుదయమున వ్రాయఁబడియున్నది. తన పూర్వుల వలెనే రాజన్న దేశాయియు గోల్కోండ నవాబుయొద్ద కొన్ని గ్రామములు గుత్తకుఁ దీసికొని సామంతుఁడై కప్పమును జెల్లించుచు నైశ్వర్యవంతుఁడైయుండఁ జూపోపని కొందఱు గోలకొండకేగి నవాబుతో రాజన్న దేశాయిపై ద్వేషముఁ గల్పించిరి. నవాబు తత్ క్షణమే కొంత యవనసేనను రాజన్నదేశాయిని బట్టి తేఁబంపెను. ఆసేన వచ్చి చుట్టుముట్టవడకు రాజన్న దేశాయి సమాధిలో నుండెననియుఁ బ్రక్కనున్న విభూతికణికలు రెండు బెబ్బులులై యనసేనను బాలంద్రో యని తెలియును మాసత్యభ్యుదయములో నిట్లు జెప్పబడియున్నది.
| ఉ౹ | నిండుసమాధినున్న యవనీతలనాథుని రెండు వైపులం | |
ఈ రాజన్న దేశాయితో ద్వేషించిన నవాబు నామముమాపత్యభ్యుదయమునఁ జెప్పఁబడకపోవుటచే గాల నిరూపణమునకు వీలుకలిగినది కాదు. రాజన్న దేశాయి కుమారుఁడు రాజేశ్వరరావు హిజరీ ౧౨౦౨ లోఁ జైన్నూరు పాలకునితో యుద్ధముఁ గావించెను. కుమారుని పరిపాలనమునకుఁ దండ్రి పరిపాలనమునకు ముప్పది సంవత్సరములు వ్యత్యాసముంట సహజము
గావున భద్రాయురభ్యుదయ కృతి పేరకుఁడగు గాజన్న దేశాయి హిజరీ ౧౧౭౮బా లో ననఁగా క్రీ. శ.౧౭౬౨ లో నుండెననుట
నిశ్చయము. దీనివలన రాపాక లక్ష్మీపతి కవి యిప్పటికి రమారమి ౧౯౦ సంవత్సరముల క్రిందనుండి యుండును.
భద్రాయురభ్యుదయమున రాజన్న దేశాయి పరాక్రమశాలియని తెలుపు పద్యము లీక్రిందివిధముగ గలవు గాని యాతని విజయములు మాత్రము కానరావు.
| సీ౹౹ | ఖడ్గంబుఁబూనెనా? కఠినారి శిరములు | |
| తే॥గీ॥ | ఔర సాహస విక్రమార్కావతారుఁ | |
భద్రాయు. ప్రధ. 202.
ఈ రాజన్న దేశాయి కాలములోఁ బూర్వార్జితమగు రాజ్యము బిక్కనవోలు నుండి రామరెడ్డిపేటకు మార్పఁబడెను. రాజన్న దేశాయి పుత్రుఁడగు రాజేశ్వరరావు రామరెడ్డి పేట నుండి రాజ్యమును దోమకొండకు మార్చి యున్నాఁడు. కృతిపతి వంశీయులు నాఁడు మొదలు నేఁటివఱకు దోమకొండయే ముఖ్యస్థానముఁ జెసికొని రాజ్యము పాలించుచున్నారు.