Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.1 (1921).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

ఉ॥ బీరము లీరసఁబుఁగన ప్రేలెడి కర్ణుఁడు బంట పోలె మున్
    వారలు మీరు నాద్రుపదుఁ బట్టఁగఁబోయిన వాడుఁద్రౌపదిన్
    వారలు బొండనోర్వమిని వారి నెదిర్చిన నాఁడు జూఁపఁగా
    నేరఁడె ధర్మకాశలము నిక్కపు సాహసశరుైలుండినన్ |

ఉ॥ ధర్మముతోడ బ్రీతిమెయి ధర్మముఖుల్ పీతలౌట వారి బల్
    ధర్మములందునిల్చి సతతంబు జయంబులనిన చావకన్
    మర్మములూడదూలక సమర్త్యపురంబును జేరక౯ ద్విష
    ధర్మముఁ జూపువారు వసుధాస్థలిలేమి నిజంబు భూవరా!

గీ॥ దండి గాండీవ చండకోదండ మొలుకు ౹ కాండములుశూలచక్రోరుదండములును
   నిలుపఁజాలు సె వైచునే నిలువుటడ్డ | సారెలేగాక నిజముగా సార్వభౌమ |

సీ॥ వైశ్వానరాననప్రభ వైరిమతిఁగాల్చు నజుమోములన నాకుఁ బ్రతిభలిచ్చు
    హరివక్తములునాఁగ నిరిధర్మగతినొందు గుహముఖగతి నాకుఁ గూర్చుశక్తి
    రావణాస్యములునా రహి దాయసొమ్మందు నిధులనెల్లను నాకు నిత్యమొసఁగు
    దిగ్దంతులనఁగ నెదిరి హృదబ్దములార్చు దిననాథులన నాకుఁదేజమిచ్చు

గీ॥ వారినిధులనఁ బరభాగ్య వాహినులకు ౹ లాగి కొనుగీరులన నన్ను లావు మెఱయ
    విజయమున సుస్థిరునిజేయుఁ బెక్కు మూర్తు లలర నా చేతిసారెలో యలుకు రాగ

చ॥ అనవిని దుస్ససేనుండను నన్న దురంబు బలారి నాశనం
    బొనరఁగఁజేయు విగ్రహమయోగ్యము సామముఖంబులోప్పుచు
    పనుపడ మామపల్కినటు పాండవులం గెలువంగఁ గూడుగా
    కననికి దారసించుటలు గాదు సుసాధ్యమె? యుద్ధమిత్తఱి౯|

గీ॥ అనుఁడు దుర్యోధనుండు సాధ్యమగు కార్య | మిదియె యనినిశ్చయించి తా రెల్లవారు
    తండ్రికెఱిఁగించువారలై తఱచి యంతి ౹ పురమునందావిభుని గాంచి మ్రొక్కునపుడు]

చ॥ శకుని మహీశ! నీసుకుని సామజ సామ్య తనూవిలాస మం
   తక భవు యష్టిచూచిన దినంబుననుండి కృశించియుండుట౯
   సుకరములన్ స్పృశించి యిటు జూడుమన౯ ధృతరాష్ట్రుఁ డాత్మజాం
   గకములఁ బట్టిచూచి యనుకంపఁ గలంగుచుఁ బట్టితో నను౯|

ఉ॥నందనరత్నమా ! యిటుమనంబుకలంగి కృశాంగుఁడౌచు వి
   న్నందనమూననేల నరనాథులలో నిరుబోలి ప్రాభవా
   నంద నయార్థ భోగ కలన౯ గలవారలు లేమిగాక నా
   నందన కల్పకాడ్యుఁడయిన౯ సరిగాఁడు కరంబుఁదెల్పుమా!

చ॥ అనుడు సుయోధనుండు వినయంబున నిట్లను నయ్య! తృప్తుఁడౌ
   జనపతి నష్టుఁడౌననుచుఁ జాఁటఁడె దేవగురుఁడు ధారుణీ
   శున కిల దాయ పెంపుపడఁజూచుట మేనునఁగఁడఁజెండులా
   గనుట వెఱుఁగవే యినభవాత్మజు పెంపు సహింపఁ జెల్లునే!