Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.1 (1921).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ కవి తన గ్రంథము యొక్క సూచిక యందిట్లు వ్రాసి కొని యున్నాఁడు.

“ఇక్కావ్యము, సంస్కృతాంధ్ర భారతములలో నుండు సర్వకథలును, ద్రావిడ, జైమినీ భారతాదులలో నుండి వివిద కథలును కలిగియున్నది. పాండవులతో సంబంధపడిన ముఖ్య కథలు విరివిగను, సందర్భసరణిచే వచ్చు నితరకథలను సంగ్రహముగను రచించి కావ్య సంపద బొంపిరిబోనిలాగునను, గీర్వాణాంధ్ర ద్రవిడ చ్ఛందోవృత్త జాతులెల్లయు వెళ్లివిరియులాగునను, ఆందందు పొందు పరుపబడి యున్నయది. కావున నిది పండిత మండలీచుండనమై యుండునని నమ్మఁబడినది.”

తరువాత వివరమును ఇట్లు వ్రాసియున్నాఁడు. భారతమునం ఆదిపర్వములో గావిస్వములలో చంద్రవంశ్యులగు రాజుల వంశానుక్రమణి నిక్కావ్యమునందు చెప్పంబూనుట వృథా విరివియగుట గాక పరిష్కారముగా తేటపడదుగాన సుపధమగులాగున చంద్రవంశ క్రమమును, వృక్షరూపముగా చిత్రగతి నేర్పరచిన పటంబీ గ్రంధాంతమునం జేర్పబడి యుండును. దానిచే వలయు వారు తదంశముల నెరుంగఁగలరు. భీష్మపర్వమునందలి భూగోళ వివరణంబును నీలాగే చిత్రింపఁబడి యుండెడి.”

పై నుబాహరించిన చిత్రపటముల కొఱకు నేను ప్రయత్నించితిని. ఇంకరు లభించలేదు.

ఈ కవి తన భారతమును, ప్రక్రమపర్వము, ప్రద్వేషపర్వము, ప్రధనపర్వము, ప్రశమనపర్వమను నాల్గుపర్వములుగా విభజించి యున్నాఁడు. ప్రక్రమపర్వము నందు ఆదిపర్వ సభాపర్వార్ధములు గలవు. ప్రద్వేషపర్వమునందు సభాపర్వార్థ అరణ్య విరాట పర్వములును, ఉద్యోగపర్వభాగమును గలవు. ప్రధనపర్వమునందు ఉద్యోగపర్వభాగము, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వంబులును, ప్రశమనపర్వమునందు స్త్రీ శాండ్యను, శాసనీ కాశ్వమేధాది పర్వములును, కలవని కవి తన గ్రంధముయొక్క ప్రారంభమున వ్రాసియున్నాఁడు. కాని కడపటి రెండు పర్వములు నాకు లభింపలేదు. ఆకవి రచించనే లేదని తెలియుచున్నది. ఈకవి 1879 సం| జూన్ 3వ తేది పరలోకగతుడయ్యెను.

ఈ భారతముయొక్క సభాపర్వమునుండి కొన్ని పర్వములు వరుసగా నీక్రింద వ్రాయఁబడియె.

సీ। దుర్యోధానభిఖ్య దుర్యోధనాకాంక్షి సర్వంసహాభర్త సవనకర్త
   గాంధారవర్వ రాగాంధారవుఁడు పాప వర్తకుండు క్రతుప్రవర్తకుండు
   కర్ణ దుశ్శాసన కర్ణ దుశ్చక్షత్వభాజనంబులు తత్సభాజనములు
   ధర్మరాజాభిఖ్య ధర్మరాద్భాగ్య విక్రమంబు ఘనాహుతిక్రమంబు


గీ ౹ ఈర్ష హుతవహుఁడును రాగ హర్ష మొప్ప ౹ రాజసూయంబునకు ధార్తరాష్ట్రు లెదురు
    జన్న మొనరింపబూని ప్రచ్ఛన్నవృత్తి । మంత్రకూటమొనర్చి యామనుజవిభుఁడు|


ఉ౹ కుండకులైన పాండవులు గూడి సుఖంబొనరించిపల్చినన్
   బండుగుఁగూడ నండఱును బంధువులై చనియుండ విభ్రమం
   బంతన నన్నుగాంచి హృదయంబున గౌరవమింతలేక యా
   మిండలమారి నవ్వ తనమింపనియఁడను కండగండునన్ |
|


సీ| సరసరమాస్ఫూర్తి జాఱఁగా ముఖకఁజ సుఖవఁజనలు నాఁడె చూఱలయ్యేఱలయె
   ప్రతిభానుభావంబు బడవలఁగా మతిచక్రగతిచక్రములు నాఁడె గతుకుఁగాంచె
   నిబిడతేజన్స్ఫూర్తినీలఁగా ఘనపర్వ దినగర్వములునాఁడె కినుకఁబాఱె
   నిర్నిద్రవిభవంబు నీరసంబుగ రాజ్య ఖగపూజ్యగతి నాఁడె యగడుఁజెండే


గీ౹ మామ యాలేను యుత్సాహధామ చంద । మామనభిమోమలర నిభరామలీల
  సాంద్రతర హాసనిస్వద్ర చంద్రికా ప్ర । సార మక్కట నామెపైఁగూరినంత |