Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.6 (1920).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మోయని కొందఱు గ్రంథాలయ సోదరులనుమానించు తున్నారు. ఆ యనుమానమును చర్చించుటకే మీరిక్క డికాహ్వానింప బడితిరి. మా యాహ్వానమును స్వీకరించి దూరప్రయాణమును శ్రమకోర్చి యింత దూరము విచ్చేసినం దుకు మీకెల్లర్లకును కృతజ్ఞడను. వసతులు తక్కువగల కుగ్రామవాసులమైన మాలోప భూయిష్టములను స్వీక రించి చర్చనీయాంశమును చర్చించి సభను జయప్రదముగ నిర్వహించుటకు నాహ్వాన సంఘపక్షమున మీకు వందన ముల నర్పించుచున్నాను. నిస్సారమైన నాయుపన్యాస మం వలన మిమ్ముల కష్ట పెట్టుటకు నాకు ఇష్టము లేదు. సభాధ్యక్షుని మహోపదేశమును వినుటకు మీరందరు వ్విళ్లూరు చుందురని నేనింతటితో విరమించుచున్నాను.

ఓం శాంతిః

అధ్యక్షులగు కోలవెన్ను రామకోటీశ్వరరావు బి.ఏ. బి.ఎల్. గారి ఉపన్యాసము-

మహాజనులారా! గ్రంథాలయ సోదరులారా! వీర భూమియు పల్నాటి సీమయందు గ్రంథాలయోద్యమ ము మొలకెత్తి, విజృంభించి, నేటికి తాలూకా గ్రంథా లయ సభ సమావేశమగుచుండుట కెంతయు సంతసించు చున్నారు. పండిత వర్యులును, ఉద్యమ నాయకులును పలువురుఁడ కేవలము సేవకుడనగు నేను సభాధిపత్యము వహించుటకు సంశయించుచున్నాను. కాని పల్నాటి సోదరుల యాజ్ఞ నుల్లంఘించుటయు వారల నిరుత్సాహ పరచుటయు పాడిగాడని తలచి నేనీ పదవి నంగీకరించి నాకీ గౌరవ మొసఁగినందులకు మీకు వందనము ఆర్పించుచున్నాను.

ప్రజల జ్ఞానాభివృద్ధికావించి, వారిలో ఐక్యమత్యము స్వయం సహాయము, కార్యదీక్ష, దేశాభిమానము, పురి కొల్పుటకే గ్రంథాలయోద్యమము బయలుదేరినది. దేశా భ్యుదయకరములగు సదుద్యమముల కన్నిటికిని గ్రంథా యోధ్యమ ప్రచారకులు చేయూత నోసంగి వలయున నియే ఉద్యమ స్థాపకుల వాంఛ. గ్రంథాలయోద్య మము మతి త్వరితముగ నాంధ్ర దేశమంటను వ్యాప్తి చెంది ఆంధ్రుల పురోభివృద్ధికి ముఖ్య సాధనముగ వెలయుచు న్నది.

గ్రంథాలయోధ్యము పరిశీలించిన వారికి రెండు విషయములు పొడగట్టును. ౧ దొరతనమువారి సహాయమును పొందకయే గ్రంథాలయములు స్థాపితములయి వర్ధిల్లుచున్నవి. ఆ ఉత్సాహవంతులగు యువకులు స్వ శక్తి వలన నీయుద్యమమును జయప్రదముగ నిర్వహించు చున్నారు.

ప్రతివిషయమును దొంతరము వారి సహాయ్య మపేక్షిం పక, ఐకమత్యమువలనను, స్వయంసహాయము వలనను, మన దేశీయులు ఉత్తమ కార్యములను నెరవేర్చగలుగుదు రనుటకీ నిదర్శనము చాలదా? ఆంధ్రయువకులు కేవల ము నిరర్ధక వాగ్వివాదములతో కాలయాపన చేయక కార్యరంగమున ప్రవేశించి దేశసేవ చేయగలుగుదు రనుటకీ నిదర్శనము చాలదా?

గ్రంథాలయోద్యమము మనదేశమునకు నూతనముగా దనియు ప్రాచీన భారతవర్షమున ప్రశస్త గ్రంథాలయ ములుండి భాషాసేవ కావించినవనియు నిరూపించుట కెన్నియో సాధనములు కలవు. కాని ప్రాక్తన భారత వర్షమును గూర్చియు, ఆంధ్రగ్రంథాలయోద్యమ ప్రాశస్త్యమును గూర్చియు మీరు పలుమారులు పత్రికలలో పఠించి యున్నారు. ప్రస్తుతము పల్నాడు తాలూకా యందీ యుద్యమమును నిర్వహించు విషయమున కొంత ముచ్చటించెదను. ఇచ్చిట సుమారు ౧౨ గ్రంథాలయముల ప్రతినిధులు సమావేశమైనట్లు నమ్ముచున్నాను. వెంటనే తాలూ కా గ్రంథాలయ సంఘము నేర్పరచి సమర్థులగు కార్య నిర్వాహకుల నెన్నుకొనుడు. ధనవంతులును వయోవృ గలును మీకు తప్పక సాయము చేయుదురు. కార్యభారమంతయు యువకులే వహింపవలసియుందురు. ఆడంబరములేక నిర్మల హృదయములతో ఉద్యమవ్యాప్తి కావింప వలెను.

వీలుననుసరించి కారెంపూడి గ్రామమునగాని మఱి యొక గ్రామమునగాని తాలూకా గ్రంథాలయ సంఘ కార్యస్థానముండవచ్చును. తాలూకా యందలి ప్రతి గ్రంథాలయమును సంఘమునకు శాఖగా చేరి కొంత మొత్త మును చెల్లించుచుండవలెను.

ప్రతి గ్రంథాలయమును చుట్టు ప్రక్కలనున్న గ్రామము లనున్న ప్రజలకు ముఖ్యవిషయముల గూర్చి బోధించుచు గ్రంథాలయ స్థాపన గూర్చి హెచ్చరించుచుండవలెను. గ్రంథాలయమనిన విశేషధనము కావలెనను ఆపోహ మనలో ప్రబలి యున్నది. విశేష ధనము వ్యయపరచి