విద్య: పగలంతయు కాయ కష్టముల బడు బీద బాలురు (నిమ్న జాతులకు) సయితము విద్యా దానం బొనర్చుటకు రాత్రి పాఠ శాల యొఁడు ని లయ పక్షమున నిర్వహింప బ్రయత్నించు చున్నా రము. దయామయులగు విద్యాభిమానుల, యమూల్య సాహాయము విరివిగ లభ్యమై, భవన నిర్మాణము యైన వెంటనే అక్కార్యమునకుపక్రమించగల మని విన్నవించెదము.
కర పత్రములు:-మాటలచే కార్యములు సా ధించుట కన్న కార్యరూపము పని చేయుటయుత్తమ మని, సులభ శైలిని, ఉపయోగకరములగు విషయ ముల, కరపత్రముల వలె నచ్చొత్తించి, ప్రజల యందు నూతన పద్ధతుల గావింప మొదలిడి, గత వత్సరము “ఆంధ్ర రాష్ట్రము” యను విషయముల కర పత్రము వలె నచ్చోత్తించి పంచి పెట్టి యుంటిమి.ఈ వత్సరమున మన దేశమును దారిద్య్ర్య దేవి వశమొనర్చి పీల్చి పిప్పి చేయుచున్న, (మద్య పాన నిర సనమును) గూర్చి గ్రంథ రూపమున కోరి పత్రములు నచ్చొత్తించి విరివిగ పంచి పెట్టితిమి. ఇందులకై ధన సహాయ్యములు విరివిగ గావించిన మాపోషకులలో నొకరుగు శ్రీ యుత, గుండారెడ్డి, రంగయ్య రెడ్డి గా రికని, మాకృతజ్ఞతా వందనములర్పించుచు, తదితర మహాశయులును, ఈలాటి సాయ మొనర్ప వేడుచు న్నారము.
ఆదాయ వ్యయములు:
ఈ ద్వితీయ వత్సరమున చందాల వలనను, భాషాభిమానముతో నిచ్చిన విరాళముల రూపకముగము గ్రంథాలయమునకు వచ్చిన ఆదాయము మొత్తం - రు.105-0-0
ఇందు ఖర్చు :-
- గ్రంధములకు - 15-0-0
- బీరువాకు - 32-0-0
- ముద్ర - 3-8-0
- వార్తా పత్రికలు - 24-12-0
- తపాలా, ఆచ్చ మున్నగునవి - 12-0-6
- చిల్లర సామాన్లు - 7-0-0
- ఇతర ఖర్చులు - 2-0-0
వెరసి మొత్తం - 96-2-6
- నిలువ - 8-13.6
బూడూరు రామానుజులు రెడ్డి
(కార్యదర్శి.)
ప్రథమ పల్నాడు గ్రంథాలయ ప్రతినిధి మహాసభ,
గంగవరము.౨౦-౧౧-౧౯౨౦
ఆహ్వాన సంఘాధ్యక్షులగు గోవి నరసయ్య గారి ఉపన్యాసము.
ఆర్యసోదరులారా! ఆంధ్ర మాతృ ప్రియపుత్రులఁగు మీకు స్వాగతము. దేశభక్త వతంసులుగు మీకు స్వా గతము. గ్రంథాలయోద్యమ మతి పవిత్రమైనది. ఆ హారనిద్రాభయ మైధునముల వలనగాక జ్ఞానముగలుగుట వలన పశువులకంటే మనుష్యుడుత్కృష్టుడగుచున్నాడు. అట్టివిజ్ఞానము గ్రంధములయందిమిడియున్నది. అట్టే గ్రం ధములు ప్రజా సామాన్యమునకు సులభసాధ్యములు కావు. ప్రజా సామాన్యము నందీ జ్ఞానబీజములను వెదజల్లుట యే యీ గ్రంథాలయోద్యమము యొక్క ముఖ్యోద్దేశము. ఆ గ్రంథాలయోద్యమ లత యొక్క పుష్పములు గా మన పల్నాటి యందు షుమారు పది గ్రంథాలయము లేర్పడినవి.పని చేయుచున్నవి. బ్రస్తుతి కాలమున ప్రతివిషయమును మనదేశమున రాజ్యాంగమునకు లోబడియున్నది.ఇప్పటి కియ్యది ప్రజలచే నడుపబడుచున్న స్వంతంత్రోద్యమము, మాననీయులగు కొండా వెంకట ప్పయ్య పంతులుగారు చెన్నపురి శాసన సభలో నీ యుద్యమ ములకు నిరువదివేల రూప్యముల ప్రభుత్వము వారు యిచ్చునట్లు కృషి సల్పి కృతార్థులైరి. ఆ ధనమును స్వీకరించిన యడల వారి ధనమును స్వీకరించి ఇతర సంస్థల వలె యీ సంస్థ యొక్కయు స్వాతంత్ర్య మడుగంటునే