శ్రీ జయలక్ష్మీ సమాజము
శ్రీ కృష్ణ దేవరాయల ధర్మపుస్తక నిలయము, చివ్వాడ, చిత్తూరుజిల్లా.
ద్వితీయవార్షిక నివేదనము.
1919–20.
ఆంధ్ర భాషాభిమానులును దయామయులు, నగు శ్రీయుతులు బి.మును స్వామి నాయుడు గారు. బి.ఎ. బి.ఎల్. (చిత్తూరు) వీరి యాజమా న్యమున 21-3-21 తేదీన చివ్వాడ గ్రామమున జరి గిన యీ గ్రంధాలయ ద్వితీయ వార్షిక మహోత్సవ సందర్భమున గ్రంధాలయ కార్యదర్శిచే చదువబడి న కార్య నివేదికము.
ఈ గ్రంథాలయము పుష్పలత వలె తొలుదొల్త మాతృభాషాభిమానులగు యగు ఒకరిద్దరు యువకులచే 1917వ సం॥ ఆగష్టు నెల 30 తేది గురు వాసరమున మొలక లెత్తి మెల్లన చిగిర్చి గ్రంధ రాజములను, సుమచయంబులతో విలసిల్లి ప్రజల య భివృద్ధి కాకరమై యీనాటికి తృతీయ వర్ష ప్రా యమై యలరారుచు దినదినాభివృద్ధి జెంది ఫల దాయకమగునని సూచించుచున్నది. ఈ నిలయస్థాపనకు కారణము భాషాభి వృద్ధికి, విద్యాభివృద్ధికి బాటుపడుటకు యని వేరుగ చెప్పనక్కర యుండదు. భాషాభివృద్ధి గావలెనన్న ఉద్గ్రంధ రాజ పఠన ముండవ లయును. అదియే ముఖ్యతమము. అమూల్య గ్రంధ రాజములు విరివిగ సేకరించి యింకను బాటు పడ గంకణము గట్టి కొని యున్నారము. మా కార్యభార మంతయు మాపోషకాది కార్య నిర్వాహకుల యొక్క యు, తదితర దేశీయుల యొక్కయు, ఉత్సాహ స హాయము విూద నాధార పడి యున్నది, ఇ`మా ద్వితీయ వత్సరపు చర్యను సంక్షేపముగ నుడివి వి మర్శనా లక్షణమును దేశ భక్తులకు నాంధ్ర మహా జనులకు వదలి వేయుచున్నారము.
సభ్యుల సంఖ్య ఈ నిలయమున ప్రధమమును ముగ్గు రితో ప్రారంభించి ప్రస్తుతము పదుగురుతో బరగుచున్నది. గాని గ్రామ ప్రజలు భాషాభిమానులై విశేషముగ సభ్య త్వము వహించి సహకారు లగుదురని విన్నవించుచున్నారము.
సభలు:- 1919–20 సంవత్సరములందు అధ్యక్షులు, కార్యదర్శులు మొదలగు కార్యనిర్వా హక సభ్యుల నెన్ను కొనుటకును, ప్రజోప యోగము కొరకును 16 సామాన్య సభలు గావింప బడెను. గ్రం థాలయాభి వృద్ధిని గూర్చి చర్చించుటకును సమావేశములు గావింప బడెను.
జయంత్యుత్సవములు:-భాషాసేవకు ముఖ్యము దేశసేవ, దేశ సేవకు ననుకరణము దేశ నాయక సేవయే యని దలచి భారత దేశ బాంధవుడును, భా రత దేశౌన్నత్యమును నిలువ బెట్టు కర్తృత్వముకకుమ బలవత్ప్రవాసములననుభవించి నట్టియు, స్వరా జ్యాందోళకు కర్త లోకమాన్య బాలగంగాధర తిలకు వర్ధంతి నమితోత్సాహముతో కడు వైభవంబుగ జరిపెతిమి. స్వరాజ్య మూల బీజమును భారత దేశ పితా మహుడును, కీర్తిశేషులురు, యగు దాదాభా యి నవరోజి గారి యొక్కయు మనము సంస్కర్త యగు శ్రీరాజా రామ మోహముని యొక్కయు ఆంధ్ర భాషా పోషకుఁడును ఆంధ్ర భోజుడును యగు, శ్రీ కృష్ణ దేవ రాయసార్వ భౌముని యొక్కయు, జీవిత చారిత్రముల సంస్మరించి సంవత్సరోత్సవములు జరిపితిమి. విజయ దశమి, శ్రీ రామ జయంతి యాది గాగల యుత్స వములను, గోవింద సేవా తత్పరులమై భక్తి పూర్వ కముగ పూజలు సల్ఫితిమి.
గ్రంథములు వార్తా పత్రికలు : - ప్రస్తుతము గ్రంథాలయమున 359 ఆంధ్ర గ్రంధములును, 18 సంస్కృ త గ్రంధములును, 9 ఆంగ్ల గ్రంధములును యున్నవి. ఇంద నేకములు కొనబడినవి. మిగిలినవి దాతలచే నివ్వ బడినవి. ఈనిలయమునకు ఆంధ్ర దైనిక పత్రిక, వార పత్రిక, ఆంధ్రవాణి, నెల్లూరి పత్రిక, శ్రీ వేంకటేశ పత్రిక, బాల భారతి (ఉచితము) గ్రంథాలయ సర్వ స్వము, శ్రీ వైఖానస పత్రిక (ఉచితము) మరియు సుబోధినీ గ్రంధ మాల, సాహిత్య సమితి, ఆంధ్ర సాహితీ గ్రంధమాల, మొదలుగా గల ప్రచురణములును వ చ్చుచుండుకు. సభ్యులు మాత్రము గ్రంధముల గృహ ములకు దీసి కొని పోదురు. తదితరులందరును నిలయమున మాత్రము జూడ వచ్చు.