Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.6 (1920).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాహిత్య క్షేత్రమున విమర్శనా బీజములు, విత్తందుటలేదు: ఈ విషయమున మిక్కిలి శ్రద్ధగా పాటుబడినది కీర్తిశే షులైన, పూండ్ల రామకృష్ణయ్య గారును, కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రులవారు నైయుండిరి. ఆట్టి వ్యక్తులు తిరిగి దేశమునుర్భవించకయో, లేక, ఉండి ఉపేక్షించు టయో, ఏకారణమువలననో విమర్శనము లాంధ్రమున నాగిపోయినవి.ఇప్పుడు నిర్భయముగా బ్రచురింపబడు నాట కములు, నవలలు, మఱియు ఆనేక చిల్లర గ్రంధములు రచ్చ కువచ్చి ఆంధ్ర సాహిత్యము యొక్క విశుద్ద స్వరూపమును మఱుగుపఱచు చున్నవి. దీనికి దోడు మన యాంధ్రము నందలి కొందరు పత్రికాధిపతులు కూడా గ్రంథకర్తలు గ్రంథములు బంపుకొందురు. వానిని యుదాసీనముగ జూచుచున్నారు. కాని లాభకరమైన విమర్శనము సేయ కున్నారు. ఆంధ్రభాషాభివృద్ధికై నూతన మార్గములను జూపిన కీర్తిశేషులైన రావు బహద్దర్ శ్రీవీరేశలింగంగారి శతాధిక గ్రంథములు, వేంకట్రాయశాస్త్రుల వారి ఆంధ్రీకృత సంస్కృత కావ్య నాటకములు, విజ్ఞాన చంద్రికా ది వివిధమండల యాధి భౌతిక శాస్త్రీయ, భాషాంతరీక రణులు, మున్నగునవి యన్నియు, నాంధ్ర భాషావనికి, యమూల్యాభవణములని వేరు చెప్పనక్కర లేదు. భాషాభివృధికి వివిధ మార్గములని చెప్పనొప్పు గ్రంథాలయకులు, వార్తాపత్రికలు, మున్నగునవి, దేశ మునందలి విద్యాధికులగు విద్వాంసులు యాదరణమునకు నిరీక్షించుచున్నవి. పెక్కు ఉద్యమములు ధనాదా రములులేక, యనామక మగుచున్నవి. ప్రతి గ్రంథాలయమునకు గొంత శాశ్వత మూలధన ముండినయెడల, చిరకాలము సాగును. కాబట్టి ఉదార పురుషులగు భాగ్యవంతులకు ముఖ్యముగా తమ ద్రవ్యమును నిట్టి కా ర్యములందు వియోగించుట ద్వారా పవిత్రతను సమ కూర్చిన యెడల దేశముయొక్క భాగ్యోదయ మిప్పుడేయగును. మన సంసారజీవితమునకు, త్యాగ మెంతయు ముఖ్యాలంకారము. తటాకోదర జలంబులకు బర్దీవా హం వలె సమార్జిత విత్తంబునకు, త్యాగమే రక్షణ నుని పెద్దలు సెప్పుగురు. ప్రస్తుత కాలమంది కార్మి రోద్యమములు దేశమునందలి యుదాక ప్రురుషులవలన నెరవేరవలెను. మన రాష్ట్రమునందు స్థాపింపబడిన నిలయములలో నేవో రెండు మూడు తప్ప తక్కిన వన్ని యు దినగండము వలె నున్నవి. ప్రజాభిమానముగాని రాజాదరణముగాని యున్న యవి బాగుపడగలవని మాయాశయము.

చూడుడు! చెన్నరాజ్యమును సంబంధించి తెలుగు వ్యవహరింపంబడు 11 జిల్లాలయందు గల మన యాంధ్ర సోదరులెళ్లి తీవ్రోత్సాహముతో గ్రంథాలయోద్యము మును జయప్రదముగా సాగించినదియు, విజయవాడ పట్ట ణమున శుకపక్ష కౌమదింబోలి వర్ధిల్లు శ్రీరామమో హన పుస్తక భాండాగారమును మ.రా.శ్రీ. అయ్యంకి వెంకటరమణయ్య గారి స్వార్థ పరిత్యాగ శూరత్వమును దిలకించితిమేని మన మేమిసేయువలయునో బోధ కాగలదు.

సోదరులారా!

ఈ ద్వితీయ వార్షికోత్సవ సందర్భమున తమకెండఱ కు శ్రమయిచ్చి, తమ యమూల్యమైన కాలమున కొత్తి డి గలుగ జేసినందులకు సోదరవాత్సల్యముతో మమ్ములను క్షమింపగలరని విశ్వసించుచున్నారము. మనదేశమునం దిట్ఠి గ్రంథాలయోద్యమములు. విద్వాంసులయు, ధనాధి కులయు, అనుగ్రహాతిశయముచే, దినదినాభివృద్ధిగ హేతుభూతులగు ప్రజ లకును, అందు ముఖ్యముగా భావి ఙాత్యాభివృద్ధికి తుభూతులగు బాల, బాలికలకు నత్యంత ఫలదాయకముగా పరిణమించుటకును, పరమేశ్వరుని బ్రార్ధించుచు నింంతటితో విరమించుచున్నాము.