నాలకు స్వస్వము, అరుకణా గుణదోషములు వ్యక్తములు కాజాలవు. భ్యాసమున మన్నలైన కవులు స్వతంత్ర మార్గమును బో జాంగనుట స్యము. భావానుకరణమున నాంధ్రకవు 10: 12. యుకా లేగిన మార్గము దిజ్మా ముదాహరించితిమి. యుక్తముల ఒర్చి ఓలను. కరణమును గూర్చి వ్రాయమన్నారము, ముండు సంచికలో ( ఆథారు ( శ్రీ శేషాద్రి రమణక పులు.)
ఐదవ కృష్ణా మండల గ్రంథాలయ సభ.
పెదకళ్లేపల్లె (28-5-20)
ఆహ్వాన సంఘాధ్యక్షులగు శ్రీయుత కావూరి కోదండ రామయ్య గారి స్వాగతోపన్యాసము:౼
కృష్ణామండలస్థలమగు నీ పదెకళ్లేపల్లె గ్రామము కదళపుర మగు నామాంతరము గలిగి కృష్ణానది తీర మ౦దున్న ఉభయ రామేశ్వర ఉభయముక్తేశ్వర ఉభయ నాగేశ్వరాది పుణ్యక్షేత్రములలో నాగేశ్వర క్షేత్రమై ఉత్తరాభి ముఖముగ ప్రవహించిన కృష్ణ వలన దక్షిణ కాశీయని ప్రసిద్ధ గాంచి ప్రతి సంవత్సరము మహాశివరాత్రికి వేనవేలుగ తీర్థయాత్రికుల వలన సేవింప బడునదై యుఁడుటను ౼ యిట్టి గ్రామమున ఈ సభాసమావేశము కాగలుగుట గొప్ప విశేషమనియే చెప్పనగును. ఐనను మారుమూలనున్న యీ గ్రామమునకు శ్రమయు తలచక తామందరును విచ్చేసినందుఁకు సన్మాన సంఘ పక్షమున నేను తమకందరికి మనస్సు పూర్వకముగ స్వాగతము నొసగుచున్నాను.
అజ్ఞానాఁధ కారమున మునిగి యున్న జనసామాన్యమును మనదేశమందుండిన మతాంతరులు కొందఱు స్వమతభూషణము పరిమత దూషణము చేసి మతదూరులుగా చేయుచున్నారు. మన దేశమున మన మతమున కీది యొక గొప్ప యరిష్ఠము. అందువలన సంఘమునకు గొప్ప బలహీనత. ఇట్టి లోపములను తొలగెంచుటలో గ్రంథాలయోధ్యమమొకగొప్ప సాధనమని నానమ్మకము గనుక దీనిని క్రమముగా నుపయోగించు మార్గమును అనుభవశాలుకైన మీరుకొని పెట్టుదురు గాక యని యెంచెద. గ్రంథాలయములను నవి రాజపోవణమును ధనవంతుల ఆదరణమును, ముఖ్యముగా గలిగి సర్వజనులకు అన్నివిధముల అందుబాటులో నుండవలెను. ఈ యుధ్యమము యొక్క ముఖ్యోద్దేశము జనసామాన్యమునకు జ్ఞానమోపదేశము చేయుటయే, ఇదిమన హిందూదేశమునకు క్రొత్తగాదు. లోకములో ప్రతిమానవుడు జ్ఞానవంతుడై యు౦డుట ముఖ్యముగదా అనెడు తలంపుతో శక్త్యనుసారము 'మా శ్రీరామ ధర్మ గ్రంధాలయమున' కను బంధముగ నొక రాత్రి పాఠశాల స్తాపింపబడినది. పగిటియందు పని పాటల వలన జీవించు వారికి రాత్రి ఉచితముగ విద్యనేర్పుట యుత్తామనియు అందువలన ప్రజాసామాన్యము కొంతవరకైనా విద్యావంతులై జ్ఞానాభివృద్ధి కలిగియుందరనియు తలచితిమి. ఎంత ఖర్చు భరించి ఎన్ని సౌకర్యములు గలుగ జేసినను నిర్భ౦ధము లేనెందువలన పిల్లలను వెదకి వారిని బ్రతిమాలి బడికి తెచ్చి చదువు చెప్పవలసి వచ్చుచున్నది. అందువలన పాఠశాలలకగు ఖర్చులు భరించుట విద్య నేర్పుట అనురెండు పనులకంటె పిల్లలను బ్రతిమాలి బడికి తీసుకొని వచ్చుట మిక్కలి కష్టమని పించుచున్నది. కీర్తిశేషుడగు ఘోఖ్లే మహాశయుడు ప్రయత్నించిన నిర్బంధ విద్యావిధానము అమలులోనికి వచ్చువరకు మన గతి యింతేయని రచింపవచ్చును. సర్పురుషులు నాటిన సద్బీజములు అంకురించి వృక్షసులై ఫలింపక మానవు గావున మనసు నిరుత్సాహ మండవలసిన పని లేదు.
ప్రాథమిక విద్య నేర్చుకొని జాలమును సంపాదించుకొనుటకు బోధకులును గ్రంధములును ఆసక్తి గల శిష్యులకు ఉండవలెను. బోధక గురువు లుండెనను బహు గ్రంధపఠనమున గాని జ్ఞాన విశేషము గలుగదు. గ్రంధములు ద్రవ్య సాధ్యములు గావున మన గ్రంథాలయములకు ధనవంతుల సహాయము మెండుగకావలెను.