Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.3 (1920).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంథములు మఱియున్నవేమో మేనెఱుఁగను.

ఒక వేళ జయదేవునితోఁ దూఁగఁజాలఁడేమో కాని ఆ వెనుకటివారిలో నింతటి గాన శాస్త్రప్రవేశము గలిగి యిట్ల సదృశముగా సంస్కృతమునఁ గవనము చెప్పినవాఁడు మఱిలేడు. బహుశః ఈయనకుఁ జయ దేవునిఁ బోలవలయు ననునాస యుండిన నుండవచ్చునని అందులకుఁ దగినవాఁడు మాత్ర మగును.

"కృష్ణలీలాతరంగిణి 'తంజావూరు' మొదలుకొని ‘విశాఖపట్టణము' దాఁక వ్యాప్తిఁగాంచినది. ఇంచుమించుగానే నన్నిసీమల వారి పాటయు వినియున్నాను. కాని యింది” “ఒంగోలు" హరిదాసులు గడించిన ప్రశస్తి మఱియెవరికిని లేదు. అని నేనెక్కఁడనుటకాదు. ఈభజన పరులలోనివారయిన ద్రావిడులే అనుక్షణము మెచ్చుకొనుచుందురు. ఆ గజ్జెవరుసలు, ఆమృదంగ పుదరువులు అన్నియు క్రొత్తవే. ఇదిగాక వీరిముఠాలు గూడ నిత రాపేక్షచే నీచోట హెచ్చుగానున్నవి. 'తరంగ కాలక్షేప’ మిప్పుడు చల్లారినదిగాని మునుపటి వారి'లో కృష్ణదాసుగారినృత్తమః, చిమట రంగయ్యమద్దెల, రామాయణమువారు చదలవాడ వారల రాగతాళప్రజ్ఞలు జగద్విదితములు.

నిజముగా నది చూడనివారికి నేవ్రాయునది యతిశయోక్తి గాఁ దోపవచ్చుగాని ఆమేళములోఁ బోయి కూర్చుండెద మేని, నృత్తము చేయువాఁడు గజ్జెలకాళ్ళతో రంగమున నిలిచి యాడుచో నప్పు డప్పుడు వాని చిత్తము వచ్చినపుడెల్ల పాదమటు తలక్రిందుగాఁ బెట్టి, తాళ శుత్రులతో మేళవించి బొటనవేలనీడ్చెడి యీడ్పులలో గలుగు రవరవలు మువ్వ కొత్త వైకుంఠముచొప్పున చూపించును. ఇక నృత్యము కడముట్ట వర్ణింప నా తరమా. మిగత కర్ణాటక గానము లో నరవ లిప్పు డు తమోత్తములుగా నున్నను ఇందుమాత్రము వీరి పొంకము కుదుర లేదు. “క్రొత్తపల్లి, ఒంగోలు, అద్దంకి, నిడుమానూరు, క్రొత్తపట్టణము” లలో నీతరమువారు పలువు రుండిరి.

తీర్థులవారిది భజన ప్రధానమైన యద్వైతము. ఈయన శివ కేశవుల నఱలేక కీర్తించెను. గ్రంథమింకను పెరుగునని వారి గ్రంథముల నుండి ప్రమాణములు చూపను. విష్ణువే పరతత్వమని నమ్మకముతోఁ గీర్తించినను విభూతి మత్తు లెల్ల భగవదంశలే యని తన్మయత్వమ చెందు నుత్తమాద్వైతభావనుఁడు. ఈయనను గూర్చియు, ఈబాణిని గూర్చియు ననేక చిత్రకథ లున్నవి అవసరమైనప్పుడు వాని వివరించెదను.

పరమ భాగవతవర్యుఁడును, అప్రతీపగానవేత్తయు, మహాపండితుఁడునైన యీజీవన్ముక్తుఁడు శ్రీమన్నారాయణతీర్ధ పాదుఁడు బహుదినము లాంధ్రులకు కనుమఱుగయి నేఁడు పొడచూ పెను. ఈవిషయమునఁజాల చెప్పవలసి యున్నను గ్రంథవిస్తరభీతిచే నిప్పుడు విరమించు చున్నాను.

ఎటు బోయినదో యీ యనఘుని ప్రతికృతి తంజావూరు రాజ భవనమునఁ జేరి యుండెను. అప్పుడిది సంతరించినవారెవరో యెఱుగఁము. కాని తరువాత నిదియిప్పుడీ ప్రతిబింబమును మనకొసఁగిన లక్ష్మణశాస్త్రి భరతశాస్త్రులపితామహులును, ఈ భజనసంప్రదాయమునకుఁ జేరినవారునైన వరహూరి గోపాలభాగవతులవారు సంగ్రహింపఁగా నావంశమువారు పుత్రపౌత్రపారంపర్యముగా దేవతార్చనామందిరమునఁ బెట్టి పూజించు