చుండగాఁ గావేరి త్రెంపుకొని క్రొత్తపాయబడి పోవుచుఁ' గమండలు వెగురఁదన్నుకొనిపోయినందున నా పేరు వచ్చెనంట) యను కావేరి పాయకు దక్షణపంచున నున్న “భూపతిరాజపుర” మను నగ్రహారము గాంచి మిగుల ముఱియుచు నచ్చోఁ, గొంత కాలము వసింపఁ జూచిరి. కేవలము దానిరామణీయకతయే అందులకారణము గాదు, తీర్థులవారప్పుడు దుర్భరమైనకడుపునొప్పిచేఁ నలుఁగుచుండి దానింబోకార్చుకొన నిష్టదైవమైన వేంకటేశ్వరుని ధ్యానించుచుండిరి. తురకదొరలయలజడిలోఁ దిరుపతి' వేంకటేశ్వరుని విగ్రహముందెచ్చి చెరుపకుండ నచ్చో (భూపతి రాజపురపు వేంకటేశ్వరాలయములో) దాఁచినారన్న వినుకలిగూడ నాస్థలమున వారికి మిక్కిలి మక్కువ యగుటకుఁ గారణము (నేఁటికిని ఆ తెచ్చినదే యిది యనఁబడు మిగుల వర్చస్వంతమైన విగ్రహమొకఁ డందు గలదు) ‘భూపతిరాజు పురపు'దేవాలయములో భగవద్ధ్యానము సేయుతఱి నెకనాఁడు 'నారాయణతీర్థుల' వారికి శ్రీకృష్ణుఁడు వరాహరూపమునఁ గలలో నగపడెను. అంత నుండియు నానోవు దీఱి వారు స్వస్థులయిరి. అందువలననే “భూపతి రాజపురము'లను వరాహపురమని మార్చి పిలుచుచు నా నిర్వాణము వారందే కడపిరి (ఇప్పటికిని వేంకటేశ్వరాలయ ప్రాకారమధ్యమున నే 'నారాయణతీర్థుల' సమాధియుఁ గలదు). అందుండియే తీర్థులవారు 'కృష్ణలీలాతరంగిణి' రచియించినది. ప్రథమతరంగముననే వరాహపురి వెంకటేశ్వనిఁ బాడినారు. 'తరంగములు' చేసి నారాయణ తీరులవారందుఁ గల భరతాదిసంప్రదాయము లెల్లను కొందఱుశిష్యులఁ జేరఁదీసి నేరిపినారు. అందులగురుతుగా ఆయూరి వేంకటేశ్వరోత్సవములు. ఈ భజన సంప్రదాయమువారే స్మార్త బ్రాహ్మణులు కొందఱు, గజ్జలుకట్టుకొని, చిటికెలు తంబుర యొక విధమగుకుల్లాయి మున్నగు పరికరములతో గోపీచందన ధారులై కోణంగి వేషములతో నాడుచుఁ బాడుచు దేవున కెదుర నూరేగుదురు. ముఖ్యముగా ఆకైంకర్యము నిమిత్తమే తీర్థుల వారట్టి 'కోణంగి పదములు' గూడ చేసినది. ఇదిగాక మఱియు నా వేంకటేశ్వరాలయమున వీరు కావించిన యేర్పాటు లనేకములు కలవు. అవియన్నియు నేఁటికిని బీఱుపోకుండ చెల్లుచునేయున్నవి”. ఈ భజన 'ఖత్తు' బ్రాహ్మణులందఱును ఉంఛజీవనులయి సంగీత౯నము పాడికొనుచుండుటయే పర మాధ౯ముగాఁ దలఁచెదరు.
తీథు౯లవారి తెలుఁగు పదములు వారితరంగిణితోఁబాటు అరవదేశపు గ్రంథ లిపిలో ముద్రితములయి యున్నవి. మఱియు వీరు రచించిన 'హరిభక్తిసుధాణ౯వమ'ను (సంస్కృత) మహాకావ్యము భక్తిశృంగారముల గుమ్మఱి౦చునది. చెన్నపురపు “ప్రాచ్యలిఖిత పుస్తకభాండారము” న గలదు. పదునాలుగు కల్లోలములందున్నవి. అసమగ్రమేమో. ఇది వారే నిర్మించి నారనుటకు గుఱుతుగా నందు కల్లోలాంతములలో “నారాయణతీర్థవిరచితే” యని యుండుటయే కాక "కృష్ణలీలాతరంగిణి” లో నున్నట్టి "హిమగిరితనయా పత్యం హేమాచలచాపసముదితం తేజః౼ " అను విఘ్నేశ్వరస్తుతి శ్లోకమే ముఖాలంకారముగా నందు నదుకఁబడినది. కవితగూడ తరంగిణి దానివలెనే లలితతమమయి మధుర మధురముగా నున్నది.
'తరంగములు' సంస్కృత గేయము. 'సుధాణ౯వము' సంస్కృత మహాకావ్యము. పదములు నారాయణతీర్థుల