Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.3 (1920).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తీర్మానమును తాడిమేటి కుటుంబశాస్త్రి (నిడుదవోలు) బెల్లంకొండ రాఘవరావుగార్లు బలపరచిన యనంతరము అందరిచే నంగీకరింప బడినది.

రాబోవు సభ

“రాబోవు సంవత్సరమున గుంటూరు మండలమున జరుపవలయునని యీసభవారు తీర్మానించుచున్నారు.”

తీర్మానమును కుప్పా శ్రీ రామశర్మగారుపపాదించిరి. శరణు రామస్వామి చౌదరి, చట్టి నరసింహారావు, బెల్లంకొండ రాఘవరావుగార్లు బలపరచిరి. తీర్మాన మందరిచే నేకగ్రీవముగా నంగీకరింపబడినది.

కార్యనిర్వాహకులు

“ఆరవ ఆంధ్రదేశ గ్రంథాలయ సభలో జరిగిన యెన్నికల ప్రకారమే ఆంధ్రదేశ గ్రంథాలయ సభకు "అధికారులును సభ్యులును ఉండుటకును, అవసరమైనచో వారలో ఇతరులను జేర్చుకొనుటకును ఈసభవారు సభ్యులకధికార మిచ్చుచున్నారు.”

ఈతీర్మానమును గాడ్సే సూర్యనారాయణశర్మగారుపపాదించిరి. తాడిమేటి కుటుంబ శాస్త్రిగారు బలపరచిన పిదప సభ్యులందరూ నామోదించిరి.

రిజిస్ట్రేషన్

కోన వెంకటరాయ శర్మగారీ క్రింది తీర్మా నము నుపపాదించిన:- ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమును 1850 వ సం॥పు 21వ ఆక్టు ప్రకారము రిజస్టరీ చే యుటకును, దానికి సంబంధించిన కాగితము జిల్లా రిజస్ట్రారువద్ద దాఖలు చేయుటకు సం ఘ కార్యదర్శిగారు అయ్యంకి వెంకటరమణ య్యగారి కధికార మిచ్చుటకును, ఈ సభవా తీర్మానించుకున్నారు.

ఇది వరకు ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమునకు చేయబడి, అచ్చొత్తించి ప్రచు రింపబడిన నియమములను ఈ సభవారంగీ కరించుచున్నారు.

తీర్మానమును చట్టి నరసింహరావు గారు బలపరచిన యనంతరము అందరిచేతను అంగీకరింపబడినది.

సేవక సంఘనిర్మాణము.

అయ్యంకి వేంకటరమణయ్య పంతులు గారీ తీర్మానము నుపపాదించిరి.

ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమమును బా ల భటోద్యమమును ఆంధ్రదేశమందు వ్యాప్త ముజేయుటకై సేవక సంఘము ఒక దానిని ని ర్మాణము చేసి అందు తగినవారిని సేవకులను గా జేర్చుకొనుటకును, అవసరమైనచో ఆ సేవకులకు వేతనముల నిచ్చుటకును, ఇందుకు కావలసిన ద్రవ్యమును సంపాదించుటకును ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ కార్యనిర్వా హక సంఘమునకు ఈసభ వారధికార మి చ్చుచున్నారు. తీర్మానమును నూరి వెంకటనరసింహశాస్త్రి పేరు రామదాసు నాయుడుగార్లు బలపరచారు తరువాత అందరిచే నామోదింపబడినది.

సంఘ పతకములు.

సంఘముపపాదించిన యీ క్రింది తీర్మానమంగీకరాయించబడినది:- అధ్యక్షుబడినది: “ఆంధ్ర దేశగ్రంథాల యోద్యమమునందు కృషి చేయు సభ్యులకును సేవకులకును చిహ్నముగా నుండుటకు సర స్వతీ విగ్రహముతో గూడిన పతకములను తయారు చేయించి పెట్టుటకు కార్యనిర్వాహక సంఘము వారికి సభవారధికార మిచ్చుచున్నారు.