Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.3 (1920).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రచించుచున్నారు. శ్రీయుత దంటు శ్రీనివాసశర్మగారు నూతనముగా రాధాకుముదముకర్జీగారు రచించిన "హిందూ దేశమందలి స్థానిక పరిపాలనమును" గూర్చిన గ్రంథమును తెలుగుభాషలోనికి అనువాదము చేయుచున్నారు. ఈ వ్యాసములు కృష్ణాపత్రికలో ప్రచురింప బడుచున్నవి. రాజ్యాంగశాస్త్రమును గూర్చి కూడ కొన్ని కరపత్రములు తయారైనవి. కొన్ని యగుచున్నవి ఈ విధమున విద్యావ్యాసంగము జరుపుటకు యితర ములుగు ఆంధ్రపట్టణములయందుగూడ ప్రయత్నములు చేయుదురని నమ్ముచున్నాను.

గుటూరుజిల్లా నర్సారావుపేటయందలి గ్రంథాలయ సంఘమువారు వారి గ్రంథాలయమను గుంటూరుమండల గ్రంథాలయముగా నేర్పరచుటకు ప్రయత్నములు చేయుచున్నారు. అందుకొరకై యింటి నొక దానిని కొనియున్నారు. మన నూతన రాజకీయ పరిస్థితులకు తగినట్లు తేట తెలుగు మాటలతో రాజకీయ విషయములను కరపత్రములు ప్రచురించుట మూలమున ఆంధ్రలోకమున కంతకును భోధించుమన్నారు. వీరి యద్యమము ప్రస్తుత కాలమున మన కెక్కువ యావశ్యకమైనదై కడుప్రశంసార్హముగా నున్నదని వేరుగా చెప్పనక్కరలేదు.

ముద్రణయంత్రము:—కడచిన గ్రంథాలయసభకు వచ్చినవారు ఆసభయందు ఈ సంఘమునకు మొదటినుండియు కార్యదర్శిగా నుండి రాత్రియనక పగలనక, యెంతో దవ్యనష్టమునకోచ్చి తమ శక్తియుక్తుల నన్నిటిని మాతృదేవతారాధనకు నర్పణ చేసిన శ్రీయుత అయ్యంకి వెంకటరమణయ్యగారిని గౌరవించుట కొకతీర్మానము సభలో ప్రవేశపెట్టిరనియు, వారికి స్వయముగ వర్తించు గౌరవమును దేవిని స్వీకరించుటకు వారొల్లకుండుటచే వారు నియోగించుకొన్న సేవావ్రతమును అభివృద్ధి నొందించుటకు తగు పరికరములను వారికి కూర్చి యిచ్చుటయే వారిని గౌరవించుట యని యెంచి అందుకొరకై ఒక ముద్రణయంత్రమును కొని వారి కిచ్చుటకు తీర్మానించుటయు, తమకు జ్ఞప్తి యుండియే యుండును. ఈ యుద్యమమును కార్యసాఫల్యము నొందించుటకు ఆంధ్ర దేశ సుప్రసిద్ధ నాయకులలో అగ్రేసరులును అప్రతిమాన వితరణశాలియు నగు శ్రీయుత టంగుటూరి ప్రకాశంగారు బద్ధంకణులైయున్నారు. శ్రీయుత వావిళ్ల వెంకటేశ్వరశాస్త్రిగారు ఇందుకొరకై స్వహస్త పరహస్తములచే కడు సహాయము చేయుచున్నారు. కొంతవఱకు పరికరములు సంపాదించుటయైనది. యంత్రము కొనబడినది. కొంతవరకు మూల్యము అర్పింపబడినది. ఇంకా కొంత పూర్తి కావలసియున్నది. ఈ యుద్యమము సఫల మగుటకు శ్రీ యుత యస్. శ్రీనివాస అయ్యంగారు, కె. శ్రీనివాస అయ్యంగారు మొదలగు మన తమిళసోదరులు కూడ సహకారులు గానుండుట మిక్కిలిసంతోషమైన సంగతి. అచిరకాలములోనే ఈ ముద్రణయంత్రము బెజవాడ పట్టణమున అమర్పబడి, పని ప్రారంభమగుటకు పరమేశ్వరు డనుగ్రహించుగాక.

ఆ ముద్రణయంత్రము పనిప్రారంభించిన తరువాత మన సంఘముతో కూడిన కృషి యత్యధికముగా నిర్వర్తింపబడునని నేను వేరుగా చెప్ప నవసరము లేదు.

గ్రంథాలయ సర్వస్వము:౼ శ్రీ వెంకట రమణయ్య పంతులుగారు ఈ ఆచ్చు పనిముట్లు సంపాదించుటయందు తమ యవకాశమును తమ ద్రవ్యమును వినియోగించుచుండుటచే