Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.3 (1920).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్వకళా పరిపూణ౯యై యౌవనప్రాదుర్భావమున నున్న యీ యాంధ్రగ్రంథాల యోద్యమ మిపుడు కల్యాణసిద్ధిని గోరి, ప్రమథ గణాధిపతియయిన మహానందీశ్వరుని వరప్రసాదమును బడయుటకయి యీ పుష్కర పర్వకాలమున నీ పుణ్యక్షేత్రమునకు విచ్చేసి, మీ మహదాశీర్వచనమునకై వీక్షించుచున్నది. విూర లీ దివ్యక్షేత్రమును సందర్శించుట చేత నేఁడు మీ హృదయములు పవిత్రములగు చున్నవి. మీ పవిత్ర హృదయములతో నొక్క మాఱుదీవింపుడు. ఆంధ్రగ్రంథాలయోద్యమము మీ మహదాశీర్వచన బలముతో మహానందీశ్వరుని వరప్రసాదమును బడసి, కల్యాణసిద్ధినిగాంచి, తనకల్యాణ విజయగీతము నాంధ్ర దేశమున నింటింట విన్పింపుచు, ప్రత్యాంధ్రుని జీవితమును పవిత్రవంత మైనదిగను పురుషార్థసాధక మైనదిగను జేసి, యాంధ్రులకు భరతఖండమున నుత్తమస్థానము నొసంగి, ప్రపంచమున వారి యశస్సు దిగంతముల వఱకు వ్యాప్తిచెందింపగలదు.

అర్ధశతాబ్దికిఁ బూర్వము మన యాంధ్రదేశన గ్రంథ సంపాదన మెంతకష్టముగ నుండెనో యీ క్రింది కథవలన మీకు విశదము కాఁగలదు. ఈనవీనశకమున మన దేశమునందలి సకలోద్యమములకు మూలపురుషుం డనఁజగి కీర్తి శేషులయిన సంస్కర్తలు వీరేశలింగము పంతులుగారు తమ స్వీయ చరిత్రమునందీరీతిని వ్రాసి యున్నారు.

“ఆంధ్ర కావ్యములలో నెల్లనను వసుచరిత్రము తమమైనదని పలువురు చెప్పచువచ్చిరి. అందుచేత దాని 'నేలాగుననైన జదువవలెనని నామన స్సువ్విళ్ళూరఁ జొచ్చెను. మా యింటఁగల తాటాకుల పుస్తకముల నెల్లనువిప్పి చూచితిని గాని వసుచరిత్ర ముందు గానరాలేదు. అప్పుడేమి చేయుటకును తోఁచని వాఁడనయి, నాతల్లినడుగుదునా, మానుదునాయన్న సందేహముచే డోలాందోళన మానసుఁడనై కొన్ని దినములు నాలో నేను తలపోసి, తుదకు సాహసము చేసి యొక నాడు మెల్లగా నామెను డాయఁబోయి వసుచరిత్రమును కొని పెట్టుమని దీనముగా వేడితిని. అది నా పాఠపుస్తకము కాదని యెఱిఁగినదయి యామె నా కోరికను చెల్లింపక నిరాకరించెను. ఇట్లా శాభంగము మెందినవాఁడనైనను నిరాశజెంది యూరకుండక యేలాగుననైనను వసుచరిత్రమును గొనిచదువ వలయునని నిశ్చయించుకొంటిని. ఎట్లు కొనఁగలుగుదును? అప్పుడు పుస్తకము వెల నాలుగు రూపాయల యెనిమిదణాలు; నా చేత నెనిమిదణాల కంటె నెక్కువగా లేవు; నాతల్లినడిగిన నేమియు నిచ్చుజూడ కనఁబడ లేదు; న్యాయమార్గమున నంత విత్తము నార్జించుటకును నాకప్పు డాధారము కనఁబడలేదు. అందుచేత నాయొద్దనున్న యెనిమిదణాలును తోడనే పుస్తక విక్రేత చేతిలోఁ బెట్టి, తరువాత నెల కెనిమిదేసి యణాలు చొప్పున ప్రతిమాసము నిచ్చుచుండు పద్ధతి మీఁద పుస్తకమునుకొని చదువవలెనని, నాకప్పుడొక దురాలోచన తోచినది. నెల నెలకు నెనిమిదేసి యణాల చొప్పున నిచ్చుచుండుటకు సహితము నాకప్పుడు శక్తిలేదు. కాఁబట్టి ప్రతిదినము వేళకు భోజనము చేసి పాఠశాలకుఁ బోవుచున్నట్లు నటించుచు నెక్కడనో కూరుచుండి సాయంకాల మింటికి వచ్చుచుండుటకును, పాఠశాల జీతము నిమిత్త మిచ్చెడి యెనిమి యాణాలును పుస్తకము నిమిత్తము వ్యయ పెట్టుచుండుటకును నిశ్చయించితిని... పుస్తక పఠనాభిలాష నన్నవివేకిని జేయఁగా నేను వెంటనే పుస్తక "