త్రికుల నందరను, ఆనందాబ్ధి నోలలాడించు చుండున నెడి విషయము మీరిచ్చటకు వచ్చి నప్పటినుండి స్వయముగా తిలకించియే యుందురుగదా!
మామండలమున గ్రంథాలయోద్యమము శైశవావస్థయం దుండియున్నది. అయిదు సంవత్సరములక్రింద కర్నూలు నగరమున మండల రాజకీయసభ జరుగుచుండ, ఆసభకు ఆంధ్రదేశ గ్రంథాలయపక్షమున, శ్రీయుతఅయ్యంకి వెంకటరమణయ్య పంతులుగారును, గోపరాజు బ్రహ్మానందంగారును దయచేసి, గ్రంథాలయోద్యమము నీమండలమున వ్యాప్తినె౦దించుటను గూర్చిన తీర్మాన మొకటి సభయెదుటకు తెప్పించుటకు ప్రయత్నించిరి. ఆంధ్రోద్యమ మనుపేరు విన్నతోడనే గుండెలవియుచున్న ఆసభ్యులలో కొందరు “ఆంధ్రో ద్యమము కామరూపిణి. వేఱువేఱు వన్నె చిన్నెలతో ఈ యుద్యమము ఎన్నియో ఆకారముల జనులను భ్రమింపజేయుచుండును. ఆంధ్రగ్రంథాల యోద్యమము ఆంధ్రోద్యమము యొక్క అంశయే గాన ఆంధ్రోద్యమమునకు మనమెట్లు చోటునీయగూడదో ఆంధ్ర గ్రంథాలయోద్యమావలంబకులకు గూడ మనమెట్లే ప్రోత్సాహము నొసంగరాదు” అని ఎలుగెత్తి సభలో ఘోషించిరి. అట్టి ఘోషలన్నియు రానురాను తగ్గి, ఈ మండలమున ఆంధ్రదేశ గ్రంథాలయ సభయే గాక, ఆంధ్ర మహాసభకూడ ఏక కాలముననే ఈ మహాక్షేత్రమున సమావేశమగుట ఆంధ్రుడను పేరు పొందిన ఎవనికి సంతోషజనకమును, పోత్సాహకరమును కాకుండును?
మనయుద్యమమును మొట్టమొదట ప్రజలు అనాదర భావముతో వచుచుండిరి. ఆదశ గడచి కేవలము నిరుత్సాహవముతో చూచు కాలముకూడ గడపితిమి. ఇప్పుడు మనయుద్యమము నెట్లయిన పరులు తమపనులు కుపకరించునట్లు స్వాధీనపరుచుకొనవలయు ననెడిదశ కిప్పుడు వచ్చితిమి. ఇట్టి తరి మనముజాగరూకతతో ఏసూత్రముల ననుసరించి మన మీ యుద్యమము నడపవలయునో నిర్ణ యించుకొనుట మనకు ముఖ్యమగు విధి.
దొరతనమువారు ఈ సంవత్సరపు బడ్జెట్టులో ఆంధ్రనాయకులగు శ్రీయుత గౌ॥ కొండా వేంకటప్పయ్య వంతులుగారి కోరిక మీద 20,000 లను గ్రంథాలయోద్యమ ప్రచారణకై యిచ్చియుండిరని మీకు తెలిసిన విషయమే. ఈ సొమ్మును పంచి పెట్టువిధానమును గూర్చి మనము దొరతనమువారికి సలహా నియ్యవలసి యున్నది.
గ్రంథాలయోద్యమ ప్రచారణ కొరకై మన సభ యొకటియే చేయు కృషిమాత్రము చాలను. ఈసభ ప్రారంభమైనది మొదలు ఈ సభకు ఆంధ్రదేశ గ్రంథాలయసంఘము స్థాయిసంఘముగా నేర్పడి అందుకు సంబంధించిన విధులను నిర్వతి౯౦చుచున్నది. బెజవాడ రామమోహన ధర్మపుస్తక భాండాగారము ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ కేంద్ర గ్రంథాలయముగా విశాఖపట్టణమున నిర్ధారణము చేయబడినది. జిల్లా కేంద్ర గ్రంథాలయములు ఏర్పడి ఎవరిజిల్లాలో వారు ఉద్యమప్రచారమును చేయవలసియున్నది. ఈసభ యిక్కడకూడుటకు ఫలితముగ ఈ క్షేత్రాధినాధుని వరప్రసాదముచే మా మండలమున గూడ గ్రంథాలయోద్యమము దట్టముగా వ్యాపించుటకు నేను కోరుచున్నాను.
ఈ మండు వేసవిలో మాయాతిధ్యము నంగీకరించి, పలుకష్టముల కోర్చి, ఇచట కేతెంచిన మీకందరకు తిరిగి స్వాగతమిచ్చుచు