Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.3 (1920).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిప్పులార్పు కవాతు, ప్రథమ చికిత్సాది విషయములనేకములును, వచ్చిన సోదరులకు శిక్షకులు క్రమముగ బోధించిరి. శిక్షణము ప్రారంభించిన యైదవనాడు తిరుత్తనికి ఉత్తరదిగ్భాగమున సుమారు పదునైదుమయిళ్ళ దూరమున నుండు పురాతనక్షేత్రమగు శ్రీ భైర వేశ్వరాలయమును దర్శించినపుడును, క్షేత్రవాసియగు తిరుత్తని సుబ్రహ్మణ్యస్వామి వారి కోవెలకు వెళ్ళి అర్చనలు గావించినపుడును గలిగిన యానంద మేమనివర్నింతును! వేయేల? శిక్షణకాలము మిగుల సంతోషదాయకముగ నుండెను.

పర్వతశిఖరములమీదుగ నాటలాడుటకు వెళ్ళినపుడు గూడ సోదరులందరును కుతూహలాయత్తచిత్తులై యుండిరి. ఎనిమిదవ రోజున శ్రీయుతులు బి.మునుస్వామి నాయుడు,బి.యె.,బి.యల్., వారి యాజమాన్యము క్రింద నొక పురజనసభయు అందు బాల భటోపాధ్యాయులుగ తయారైన వెళ్ళు వారివారి శక్తి సామథ౯ర్యములను ప్రదర్శించి ప్రేక్షకుల నానందింపజేసిరి. ఆదినము తిరుత్తని యందొక పండుగ దినము నెంచబడెను. తొమ్మిదవరోజున వారివారి యర్హత ప్రకారము యోగ్యతా పత్రము లిచ్చుటయందును, చాయాపటము దీయట యందును, దీక్షాస్వీకరణము మరియొకతూరి దలచుకొనుట తోడను, జయజయద్వానములతోడను, వందే మాతరాది శ్రావృగీతాదులతోడను, పరస్పరాభివందనముల తోడను శిక్షా శిబిర కార్యము పరి సమాప్తి కావింపబడెను.

వందనములు

మా వినతి నంగీకరించి, మా శిక్షాశిబిరమున కరుదెంచి, కష్టములకోర్చి, శిక్షనొసంగిన శ్రీయుత వారణాసి వెంకటసుబ్బారావుగారికిని, మొవ్వ నాగేశ్వరరావుగారికిని, ద్రవ్యసహాయ మొనర్చిన మహాశయులకును, ద్రవ్యసహాయము శరీర సాహాయము గావి౦చి అన్ని విధముల తోడ్పడిన వారిలో ముఖ్యముగా బాటుపడిన శ్రీయుత దావుళూరు మునికన్నయ్య గారికిని మా మనఃపూర్వకమగు కృతజ్ఞతాభివందనము లర్పించుచు ఇమ్మహనీయులకు భగవంతుడాయురారోగ్యైశ్వర్యంబు లొసంగుగాక యని బ్రార్థించుచున్నాను.

బూదూగు రామానుజులు రెడ్డి

కార్యనిర్వాకుడు

II

ప్రయాణము

౨౧-౯-౧౯ తేదీ ప్రాతఃకాల మయిదున్నర గంటలకు నేనున్నూ, ఆంధ్ర రాష్ట్రీయ సహయబాలభటసంఘపు కమీషనరుగారగు శ్రీ వారణాశి వేంకట సుబ్బారావుగారును, మచలీపట్టణమందలి ఆంధ్రజాతీయ కళాశాల విద్యార్థులున్నూ, మదరాసుధూమశకటంబెక్కి, మధ్యాహ్నము రెండుంబాతిక గంటల కాలమగుసరికి గూడూరు జేరితిమి. అంత రెండున్నరకు వేరొక బండి నెక్కి, యయిదున్నర గంటలకు రేణిగుంట స్టేషన్కుజేరి, వెంటనే తిరుత్తణి గ్రామమునకు వెళ్ళుటకు తయారుగానున్న బండి నెక్కి, రాత్రి యెనిమిదిన్నర గంటల కాల మగుసరికి తిరుత్తణి గ్రామము చేరితిమి.

అంతట మేము ధూమశకటము నుండి దిగుసరికి ఆ గ్రామమందు శిక్షణమును పొందవలయునని కుతూహలాయత్తచిత్తులై వచ్చినవారును, దేశభక్తులును సత్యవాక్యపరిపాలకు