షుమారు నూరురూప్యములు విరాళముల చే లభించినను మొత్తమున నూటయేబది (15౦) రూప్యములు ఖర్చు తగిలినది. పై మొత్తము నెట్టులో రాబట్టగలిగితిమి.
శిశిబిర మేర్పడు కాల మాసన్నమగు కొలదని మేమును మాయత్నముల కాసన్నమగుచుంటిమి. ముని కన్నయ్యగారు విద్యాధి౯యగుటచే మున్ముందుగ నాకు చేదోడుగ నుండనందున నాకష్ట మపరిమితముయ్యెను. గాని భోజనాదివసతులయందును శిక్షా శిబిరమునకు గృహాది సౌకర్యములకును శ్రీయుతుమునుస్వామినాయుడుగారే చేయూత నిచ్చిరి. సేవక సంఘమునకు వసతిగృహముగ శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి దేవాలయమునకుబోవు రాజమార్గమున నుండు కనకపిళ్ల వారిపట్టనంబునను, సత్రము నేర్పరచుటయేగాక సత్రమున కనతి దూరమున తూర్పుదిశనుండు మంచీనీళ్ళగుంట గట్టున కవాతు నేర్పుట కనుగుణ్యముగ నిర్మించితిమి. వసతిగృహమునకు సమీపముగ శ్రీ స్వామివారి కోవెళ్లి యును, తదితరముగు చిన్న చిన్న పర్వతరాజములురు, శిబిరముసకంటి పెరిగియున్న నారికేళ చందన వటవృక్షాది యార రామములతోడ నలరారుచు చూపరులకేగాక శిబిర వాసులకును నమితానందమును హాయిని గల్పించుచుండెను.
౨౧వ తారీఖు సాయంతనమునకే చివ్వడ వెలంజేరి సింహారాజుపురం ఆరూరు మొదలగు స్థలములనుండి కొందరు యువకులును, ఆరాత్రి రైలుబండ్లలో మచిలీపట్నము బెజవాడలనుండి తరిబీదున౦డుటకు నలుగురు యువకులను, ఉపాధ్యాయులుగా సహాయ కమీషనరుగారగు శ్రీ వారణాసి వెంకట సుబ్బారావుగారును, వారికీ సహయులుగా మొవ్వ నాగేశ్వరరావుగారును వచ్చిరి. శ్రీ యుతులు వెంకటరమణయ్యగారు సహితము రాగలరని ఎదురుచూచుచుంటిమి గాని మా దురదృష్టముచే వారి సతీరత్నమునకు దేహము అస్వస్థతగ నుండినందున వారు రాజాలకపోయిరి. 99 వ తారీఖు ఉదయము మెయిలు బండ్లలో బెంగుళూరు మదనపల్లి కాళహస్తి పట్టణముల నుండియు కొందరు సోదరులు శిక్ష సందుట కరుదెంచిది. శిక్షనందుటకు వచ్చిన సోదరులును ఉపాధ్యాయులును గలసి మొత్తమున షుమారిరువది ముగ్గురు హాజరయిరి. ఆంధ్రదేశమునుండి శిక్షనందుటకు పెక్కండ్రు సోదరులు రాగలవని యుత్సాహముతో నుందురు గాని ౨౬ వ తారీఖునుండి గుంటూరు పట్టణన౦బునను శిక్షణ మారంభమగునని తెలియుటచే కొంతమంది అచటకు బోయిరి.
చిత్తూరుమండలమున ఇదియే మాకు ప్రధమ ప్రయత్నమయినందున ఇంతవరకైనను జయప్రదముగా నెరవేరి మాప్రయత్నములు సంపూర్ణసాఫల్యత జెందుగాకయని ఆంధ్రమాత నారాధించుచు శిక్షణ మారంభించితిమి.
ప్రతిదినము, ఉదోయము ౫ ఘంటలు మొదలు రాత్రి ౧౦ ఘంటలు వరకును తరిబీతునందు వారు శిక్షకుల యాజ్ఞానువర్తులై నడువవలసి యుండెను. మధ్యాహ్నమును సాయంత్రమును కొద్దిగ విరామము గలిగియుండెను. విశ్రమము కొద్దిగ నుండినందున వారి బంధుగులకు జాబులు వ్రాసికొనుటకు గూడ నవకాశము చాల కుండెను. శిక్షానశిబిరమున కల్యాణకూటమునందలి గోడలకు కాలనిర్లయ పత్రికయు హిందీయక్ష సూచికయు తంత్రి గుర్తులు బంధనములు వీనిని దెలుపు పఠములు వ్రేలాడగట్టబడియుండెను. భటధర్మములు, జండావధానము, ఈలగుర్తులు, బంధనములు,