Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.3 (1920).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాలభటోపాధ్యాయ శిబిరము, తిరుత్తని (22.9.19)

ఆంధ్రదేశమునం దీ యుద్యమమును విరివిగ వ్యాపింప జేయుటకుగాను ప్రతిపట్టణము నందును పల్లెయందును బాలభటోపాధ్యాయులుగ తయారైనవారు ఒక్కొకరైన ను౦డుట అత్యంతావశ్యకమనియు అట్టి యుపాధ్యాయులు తయారగుటకుగాను అందందు శిక్షాస్థానముల నేర్పరచి అట్టివారిని తరిబీతు చేయుట విధి యను ఉత్సాహముతో చిత్తూరుమండలమందలి చిరుతని యను పుణ్యక్షేత్రమున నొక శిక్షాస్థానమేర్పరుచుట ముఖ్యమని నా యంతరాత్మ బోధించె. చిత్తూరు మండలము ముఖ్యముగ నాంధ్రమండలమయ్యు కొందరు అరవసోదరుల స్వల్పమైన ప్రతికూల భావముచే తమిళమండలము కాజాలదు. వారికోర్కెలు సాగవు. చిత్తూరుమండలమున కేలాటి ముప్పును లేదు. ఆవాద మటుండనిండు. చిత్తూరుమండలము కడచిననాలుగైదు వత్సరములనుండి నిశ్చలతత్వముతో నాంధ్రమాత నారాధించుమనే యున్నది. "పదుగు రాడు మాట పాడియై ధరజెల్లు నొక్క డాడు మాట యెక్క దెందు” అను నార్యోక్తి లాగు నేనొక్కడనే యీయుద్యమ విషయమయి మాట్లాడి పూర్తిచేయుట పాడికాదని యెంచి నామిత్రులును బాలభటోద్యమాభిమానియును వేలంజేరి వాస్తవ్యులును అగు శ్రీయుత డి. మునికన్నయ్యగారి కీవిషయము నచ్చజెప్పి మనప్రాంత్యమున శిక్షాశిబిర మేర్పాటు చేయవలయునని హెచ్చరించితిని. చెప్పి ముగింపకమునుపే సరిసరియని యుత్సాహముతో నొప్పుకొనిరి. అంతట మాకిరువురకేగాక మండలము దెల్లరకును అపరిమిత పరిచయులును, దేశాభిమానులును, సుప్రసిద్ధన్యాయవాదులును, వెలంజేరి వాస్త వ్యులును అగు శ్రీయుత మునుస్వామి నాయుడుగారి యనుమతిని కార్యము సాధించు నుద్దేశముతో వారికి సమాచారమంపితిమి. వారిని రావించి తిరుత్తనియందు వారి యాజ మాన్యమున నొక పురజనసభగావించి శిక్షాశిబిరము తిరుత్తనియందే యేర్పరచుట యుక్తమని తీర్మానించితిమి.

మాప్రయత్నములు, ఆంధ్రదేశమున బాలభటోద్యమస్థాపకులును రాష్ట్రీయకమిషనరుగారును అగు శ్రీయుతులు అయ్యంకి వే౦కట రమణయ్యగారికి దెలియబరచితిమి. ౧౯౧౯ సం॥రం సెప్టెంబరు నెల ౨౨వ తారీఖు నుండి శిక్షాశిబిర మేర్పాటు చేయవలెననియును తరిబీతునిచ్చుటకు తాము రాగలమనియును దయతో అంగీకారమును దెలియబరచిరి. శిక్షాస్థానము తిరుత్తనియుదు స్థాపింపబడుననియు, భోజనాది వసతులు మేమే భరింతుమనియు వారి యంగీకార మందినవెంటనే ఆంధ్ర ఆంగ్ల పత్రికలయందు బ్రచురించితిమి. వచ్చువారికి అన్నపానాదివసతులు మే మీరుపురముభరిపజాలమింజేసి దేశీయసోదరుల కొందరిని విరాళము లడుగ మొదలిడితిమి. మాతృదేశము నారాధించుట కిరికదా సమయమని తలచి కాబోలు శ్రీయుతులు బి.మునుస్వామి నాయుడుగారు రూ. 50 లును, దావుళూరు మునిరత్నం నాయుడుగారు రూ. 25 లును, బి. అక్కయ్య నాయుడుగారు రు 10 లును, భొ॥ పె.కొ.మునుస్వామినాయుడుగారు రూ. 5 లును, పాముల రామచంద్రకొండారెడ్డిగారు రూ. 5 లును, ఇచ్చెదమని వాగ్దానం బొసంగిరి.