వలన మనోగతమైన గొప్పగ్రంధములను లిపిగా చేయుచుండసాగిరి. అట్లు గొప్ప పరిశ్రమ చేసి భద్రపరుపబడిన గ్రంధములు మన అనుభవార్ధము వచ్చినవి. గనుక వానిని పూర్వపు పరిశ్రమకు తగినంత రక్షణలో కాపాడుట మన విధ్యుక్తధర్మమై యున్నది. పూర్వము మనవారు గ్రంధములను గ్రంధాలయముల మూలముననో, పరంపరాగతకముననో, కాపొడి సారస్వతమును కొంతవరకైన దక్కించిన కారణముచేతనే, మన పూర్వచరిత్ర కొంతవరకైనను మనకు తేటపడి మన భావిస్థితికి అనుభవపూరితములైన మార్గములను చూపుచున్నది.
సంచారగ్రంథాలయము
గ్రంథాలయమూలమున దేశమునకు లభ్యపడవలసిన గొప్ప ప్రయోజనములు పొందతలంచితిమేని ఏవిధమున గ్రంథాలయము ఉపపయోగములు జనసామాన్యమునకు సమాకూర్చగలపూ అట్టి మార్గముల నాలోచితము. వానిలో సంచారగ్రంథాలయములు, ప్రజలలో జ్ఞానబీజముల నాటుటకు ఉపయోగకరములు. ప్రజలకు గ్రామైక్య జీవితాదర్శనములను, ఆరోగ్య మార్గములు బోధించుటకును మాజికులా౦తరుల సహాయముతో ఇంట్లో ఫోటోగ్రాపు ప్రదర్శనములను ఏర్పాటుచేయవలయును. ఈ సాధనములతో ప్రజలను అజ్ఞానాంధకారమునుండి కార్యోముఖులుగాచేసి సంఘమునకు చేకూరవలసిన ప్రయోజనము బడయవలెను, జీవితాదర్శముపట్ల, జ్ఞానసముపాదనమునందు అభిమానము ఉత్సాహము కలిగివారికి బిడ్డలను విద్యావంతులుగాజేయు కోరిక గలగినయెడల జ్ఞానాభివృద్ధికి పైమాగ౯ములె కాక ఇతర విధములుగను మనము చాలపని చేయవచ్చును. బాలురను, బాలికలను సమావేశపరచుచు వారి నాకషీ౯చు విషయములను సినమెటోగ్రాపులలో ప్రదర్శించుచుండవలయును. ప్రాధమిక, మాధ్యమిక విద్యాలయములను నెలకొల్పి వారికి విద్యాదానము చేయుచుండవలయును. వీనివలన వారిజీవితమున నెన్నియో మార్పులు కలుగగలవు. దేశాభ్యుదయమునకు వారు పాటుపడుటకు ఉత్సాహమును చూపినవారమగుదము. మనము గ్రంథాలయములను నెలకొల్పి పలు శాస్త్రములకు సంబంధించిన గ్రంధము లందు౦చిన యెడల వారు వానిని చదివి, జ్ఞానవంతులగుటయే గాక మన దేశక్షేమమునకును ఎంతయో సహాయభూతులు కాగలరు.
ఒక దేశముయొక్క గ్రంథాలయములు నాగరికత, సారస్వతము, కళాభివృద్ధులకు, రాజకీయ పారిశ్రామిక ఆర్థికాభివృద్ధుల కెంతయో పనిచేయగలవు. విజ్ఞానమునకు గ్రంథాలయములు ధనాగారములని చెప్పవచ్చును. ఇందువలనే మన వారు గ్రంధములను కోశములని పేర్కొనుచుండెడివారు. మానవసంఘమునకు చేయుసేవ అపారము, ఆనందము. ఈరహస్యమును బరోడా, మైసూరు సంస్థానాధీశులు కనుగొని గ్రంథాలయోద్యము వ్యాపనమునకు ఎంతయో పని చేయుచున్నారు. స్వదేశ సంస్థానాధీశుల యాదర్శములనైనను గ్రహించి మన ప్రభుత్వము వారీ విషయము ముందంజవేయకుండుట విచారకరము. ప్రభుత్వమువారు ఈ విషయముననికనైనను శ్రద్ధదీసికొని, గ్రంథాలయోబివృద్ధికి పనిచేయ ప్రారంభించి ప్రజలలో అవగాహన కలిగించుట అవసరము.