9వ తీర్మానము
ఆంధ్రసారస్వతాభివృద్ధికిని, ఆంధ్రుల భావి భాగ్యోదయముకును పత్రికా నిర్వహణము ముఖ్యగుని యెంచి లిఖితమాసపత్రిక స్థాపించి నడిపించుచున్న వాసంత గ్రంథనిలయము, స్వసంఘము, బాలసరస్వతీ గ్రంథాలయము, రత్నకవి గ్రంథాలయములవారి యాశయముల గోనియాడుచు - ఆంధ్రదేశమున గల గ్రంథాలయము లన్నియు అట్టి పత్రికల స్థాపించి, నిర్వహింతురని కార్యనిర్వాహకులను ఈ సభవారు ప్రార్థించుచున్నారు.
- ఉప ౼ తేకుమళ్ల వె౦కొజీగారు
- ఆమో — ఆరెకపూడి రామశాస్త్రులుగారు
10వ తీర్మానము
- (క) వాఙ్మయములోని ముద్రితాముద్రిత గ్రంథములు సేకరించి, సారస్వత సాధనములు జేయుచుంటయే గాక, ఆంధ్రుల ప్రత్యేక వ్యక్తిని, కళలను, ఆచారములను, పండుగలను, వర్ధంత్యుత్సవములను ప్రోత్సాహపరచు సాధనములను అవలంబించుటకును,
- (చ) తమ్మకు సంబంధించిన రాత్రి పాఠశాలలయందు ఆంధ్రుల ప్రత్యేకకళారూపమును దెలుపు విద్యావిధానముల నవలంబించుటకును,
- (ట) నిమ్న జాతుల విద్యాభిలాష గలవారలుగ జేయుటకు ఉపన్యాసము లిచ్చుట, బొమ్మలజూపుట, మొదలగు సాంఘిక సేవజేయుటకు వలయు సాధనములు సేకరించుటకును,
- (త) రాత్రిపాఠ శాలలయందు పఠించు ఆదిమాంధ్రవిద్యార్థులకై గ్రంథాలయ స్వంతభవనమున గాని సామీప్యమున గాని వారి కనువగు ప్రార్థనాలయములను గట్టించవలయుననియు ఆంధ్ర దేశమునందుండు వివిధ గ్రంథాలయముల కార్యనిర్వాహకులను ఈ సభవారు కోరుచున్నారు.
- ఉప - గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు.
- ఆమో - గోనుగుంట్ల వేంకట సుబ్రహ్మణ్యంగారు.
11వ తీర్మానము
- (క) ఆంధ్ర వాఙ్మయమునం దుండు గ్రంథముల నన్నిటిని బహుసులభముగ వివిధ భాగములుగ భాగించి పుస్తకముల పట్టీల తయారీ చేయుటకును, గ్రంథాలయముల గ్రంథములకు సంకెలు వేసి బీరువాలయందుంచుటకును, సులభమగు పద్ధతిని వెదకుటకును ఆంధ్రగ్రంధాలయ స్థాయి సంఘము వారిని కోరుచున్నారు.
- (చ) ప్రస్తుతము ఆంధ్రవాఙ్మయ సూచిక నెక దానిని తయారు చేయుచున్నట్టి శ్రీ కాశీ నాధుని నాగేశ్వర రావుగారికి ఏత దుద్యమము తగు సాహాయ్యముచేయవలయునని ఈ సభవారిని కోరుచున్నారు (అధ్యక్షులు).
12వ తీర్మానము
ఆంధ్రగ్రంథముల అట్టలపై, ఆంగ్లమున గ్రంథనామముల ముద్రించుటవలన నెవ్వరికి మేలు గలుగుకున్నాను, కనివినరాని యాభాసపు ఉచ్చారణల కెడమిచ్చుటయే గాక, ఆంగ్లవిద్యానిపుణున కేని శీఘ్రముగ నర్థము గాకుంటయు ఆంగ్ల భాషాజ్ఞానము లేని జన సామాన్యమునకు బొత్తిగ నర్థముగా కుంటయు జూడ అట్టి ముద్రణములు విపరీతములును మన భాషకును, మనకును న్యూనత దెచ్చుచున్న వనియు, ఇకముందు ప్రచురింపబడు గ్రంధములపై తెనుంగుననే గ్రంధ నామముల ముద్రించుడని, ప్రకాశకులను యీ సభవారు కోరుచున్నారు (అధ్యక్షులు).
13వ తీర్మానము
కీర్తి శేషులయిన పండిత వర్యుల కుటుంబ