భిప్రాయానుసారముగ జరుగునది యొకటి. నైమిత్తికముగా అగ్నిభయములు, సాంక్రామివ్యాధులు, ఆకస్మిక అపాయములు, చోర భయము, జలప్రళయములు, తీర్థములు, జాతరలు మొదలగువానియందు నాయానిమిత్తమున కనుగుణముగా తాత్కాలిక సేవచేయుటొకటి. నిత్యసేవకు ప్రజలలో నుత్సాహము కలుగునట్లు ధర్మాభిప్రాయప్రకటనము అత్యంతావశ్యకమైయున్నది. ఇదిగాక నైమిత్తిక సేవజేయుటకు సేవకులకు భక్తి గలిగి వినయాది గుణసంపన్నులగుటకుగాను, సంఘసేవనమార్గములందు క్రమమైన శిక్ష నొసంగవలెను. ఈదుట, ప్రాణమును కాపాడుట, మంటల నార్పుట, నావలనడుపుట, ప్రథమవైద్యసహాయము నెసంగుట, సాంక్రామిక వ్యాధులయందు ఉపచారము చేయుట మున్నగు కార్యములందు వారికి అనుభవపూర్వకమైన శిక్షను ఒసంగవలయును. ఉపద్రవములు చెప్పిరావు. కాఘన తగిన సంఘములయందు వార్త తెలియగనే సేవకులను పంపు అవకాశము లుండవలయును.
సంఘసేవ గ్రంథాలయ ప్రధానధర్మము
పూర్వకాలమువలె ఇప్పటి గ్రంథాలయములు వట్టి పుస్తక దుకాణములు కాపుగదా. గ్రంథాలయము గ్రామమునకంతకును కేంద్ర స్థానముగ జేసి జనుల కెల్ల ఉపయోగవంతమై యుండునటుల జేయుట మన ప్రధానకర్తవ్యమని గ్రహించితిమిగదా.
ఈ సంఘసేవనమును నిర్వర్తించు టెట్లు?
ఈ సేవావ్రతమును నిర్వహించుటకు యుక్త ? పాశ్చాత్య సాంప్రదాయముల శ్చాత్య ఆదర్శములవలనను మన గిన ఈధర్మవిప్లవమును ఆపా శ్చాత్య మార్గముల నవలంబించియే రూపు మాపవలసియున్నది. సంఘ సేవనమే భటోద్యమము. పైన వివరించిన సాంఘిక సేవనంతను ఒక వ్రతముగ అనుష్టించునదే భటోద్యమము. ఈ సేవావ్రతమును మనయందు గాఢముగ నాటుకొనునటుల జేయుటకు “భటోద్యమము” వంటి మహత్తరమైనది మరియొకటి గానము.
భటోద్యమము గ్రంథాలయోద్యమము
నందొక భాగము
ఆంధ్ర దేమునందు ధర్మగ్రంథాలయములు సేవాస్థానములై ఇదివరకే వెలసియున్నవి; ధర్మగ్రంథ పఠనాపకాశములు, రాత్రి పాఠశాలలు అన్నదానము వైద్యసహాయము - ఇటులయెన్ని యో విధముల ఇవి సేవావ్రతమును ఆచరణయందు బెట్టుచున్నవి. ఇవిగాక కొన్ని యితర సంఘములుగూడ పలువిధముల సేశావ్రతమును ఆచరణయందు బెట్టుచున్నవి. ౧౯౧౬ సం॥న సంభవించిన కొల్లేరు, కష్ణా వరదల సందర్భమున పలుగ్రంథాలయముల ప్రతినిధులు బెజవాడ సేవకాసంఘమువారి ఆదరణ క్రింద చేసిన సేవ మీకింకను జప్తి యందున్నదని తలచెదను. దీనినిబట్టి భటోద్యమము గ్రంథాలయోద్యమమునం దొక ప్రాధాన్యభాగమని మనలో చాలమంది పేరులనుబట్టి గ్రహింపకపోయినప్పటికిని, ఆచరణ యందు జూపుచునేయున్నాము.
ఆంధ్రదేశము - భటోద్యమము
౧౯౧౬ స॥ న వలదల సందర్భమున నే ఈ భటోద్యమమునుగూడ ఆంధ్రదేశమున గ్రంథాలయోద్యమ ప్రాధాన్యభాగమున నెలకొల్పవలయునని వాంఛించితిమి. ఈ సంవత్సర