Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.1 (1920).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రు జదివియున్నారుగదా! అట్టి సాంఘిక స్థానములగుటకు మనము జేయవలసిన విధులలో నొకటి సంఘ సేవనము. అట్టి సంఘ సేవనమును మన మిదివరకే నిర్వర్తించుచున్నను అది ఇంకను ఎక్కువ సమర్థతతోను, ఎక్కువ పట్టుదలతోడను జేయించుటకు మనకీ భటోద్యమము సంప్రాప్తమైనది. కావున గ్రంథాలయోద్యమమునుండి భటోద్యమము భిన్నమని ఎంత మాత్రమును తలంప వలసినదిలేదు. కావున గ్రంథాలయోద్యమాభిలాషులారా! మీసేవావ్రతదీక్ష పరిపూర్ణమై, మీరు "దేవునకు, దేశమునకు, రాజు నకు మీ విధ్యుక్తధర్మ మొనర్చుటకు” తగిన సమయమే తెంచినది. కావున “సిద్ధపడియుండుడు”.

— అయ్యంకి వెంకట రమణయ్య.



భట ధర్మము

తొల్లి శ్రీకృష్ణభగవానులు అర్జునునకు ఉపదేశించిన ఈ క్రి౦దివాక్యములు భట ధర్మమును చక్కగా బోధించుచున్నవి:౼

"కార్య కర్మముల
సలుపుము ఫలముల సంగంబు లేక
ఫలసంగరహితుడై భవ్యకర్మమును
సలిపిన జరుడు మోక్షము నుందగలడు
వలదిక సందేహపడ దీనియందు
జనకాదులైన రాజర్షులు మున్ను
ఘనముగ నిష్కామ కర్మంబు చేత
స్థిరచిత్త పరిశుద్ధి జెందిరి గాదె
కరము నీవు నిక లోక ప్రయోజనము
కనుచున్న వాడపై కర్తవ్యకర్మ
మొనరింపదగుదు వత్యుత్సాహగరిమ. (3అ)

“ఎవడు బ్రహ్మమునందు నెల్లకర్మముల నిలిపి ఫలాసక్తిని బరిత్యజించి సలుపునో యాతండు సలిలంబు చేత వనజపత్రమువలె, పాపంబుచేత తనుకంగ బడడు.

“గురుసమాహిత మనస్కుడు కర్మఫలము
పరిహరించి పరాత్మ పర నిష్ఠయందు
పొసగిన శాంతిని బొందుచున్నాడు. (౫అ)
మము భిన్నమని ఎంత మాత్రమును తలంప
వలసినది లేదు.

ఈ వాక్యములను మనస్సునందు గురిగా నుంచుకొని తన ధర్మమును ఎవ్వరైతే నిర్వహించుచున్నారో అట్టివారు ఎట్టి కష్ట సమయమందైనను ఎట్టి నిష్టుర సమయమందైననుగాని, ఆవంతమైన ధైర్యస్థైర్యములను గోలుపోవంగజాలకు; అట్టి వారి మనస్సు ఎల్లప్పుడును నిర్మలమై, నిష్కామమై, పరిశుద్ధమై యొప్పుచుండును; సదా శాంతముతో తమ కార్యములను నిర్వర్తింప గలిగి యుందురు.

ఏ మనుజుడైనను తన మనస్సునందువిచారమునకు ఎంత మాత్రమును జోటియ్యగూడదు. విచారము మనస్సునందు బ్రవేశించినదా, ఇక దానిని స్వాధీనము జేసికొనుట కష్టము. మన విచారము మనతో నుండదు. ఇతరులకుగూడ ఆపాదించును. కావున విచారమును దరికి రాకుండ జాగ్రత్తగా కాచియుండుము. వచ్చుసూచనలు గనబడినవా ఏదో యొక కర్మను జేయుచుండుము. సత్కర్మనే నిష్కామముగ జేయుచుండుము. ఫలితమేమి సంభవించినను, నీకు విధి కృతమైన కర్మమును