Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.1 (1920).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనిషి దొరకినప్పుడు వారిస్థానే యేర్పాటు జేయుటకు యింకొకరిని మీరునూచింపవచ్చును.

పతకమునందు మార్పుదల జేసినయెడల దేశమునందు ఇదివరకు ప్రచారమునందున్న వందలకొలది పతకములను తీసివేయవలసి వచ్చును. ఇంతేగాక ఇదివరకు తయారుచేసిన అచ్చుదిమ్మలు, నమోనాలు అన్నిటిని మార్చవలనియుండును. దీనికంతకును విశేష ద్రవ్యము గూడ వ్యయమగును. అందుచేత ఈవిషయము " సెంట్రల్ కవున్సిలు" సంపూర్ణముగ యేర్పడు వరకును ఆపుదలచేయ వలయును. ఆది గాక మీరు సూచించిన మార్పుదల నాకు సరిగా తెలియలేదు. కమలమును, భానుని దీనివేయవలెనని తలంపా లేక వానిని హిందూదేశ పటమునం దుంచవలెవనియా? సంస్కృతమునందు దీక్షావాక్యము యేమియుండవలెను? మీ సూచనను పటమున వ్రాసిపంపిన ముందుకు ఉపయోగకరముగడును.

జండాను గూర్చి గూడ “సెంట్రలు కవున్సిలు" వారు సంపూర్ణముగ యేర్పడిన పిమ్మటనే నిర్ణయింపవలెను. అప్పటికి కాంగ్రెసు మహాసభవారుగాని మరియొకరు గాని హిందూదేశమునకు జాతీయ పతాకమును నిర్ణయింపవచ్చునని నాకోరిక; అది జరుగువరకును మనము ఇదమిద్ధమని నిర్ణయించుటకు వీలులేదు. భారత బాలభట సంఘమునకు ఇప్పుడున్న జెండాను వాడుటయే మనము చేయదగిన పని. ఈ విషయము “లోనవ్" లా యందు చర్చింపబడినదని మీకు దెలియును; కాని తీర్మానమునకు వచ్చియుండలేదు - ప్రస్తుత పతాకమును ఉంచుటకే చాలమంది అభిప్రాయ పడుచున్నారు. (యూనియన్జకు జెండా మధ్యకు భానుని కమలమును వేసినది ప్రస్తుతపతాకము). భానుడు కమలమునకు తోడు హిందూదేశమును సూచించుటకై ఇంకేమైన వేసిన బాగుండునని కొందరు అభిలషించుచున్నారు. తాత్కాలికముగా ఈక్రింది విధమైన జండాలలో దేనినైన ఉపయోగించుకోనవచ్చునని నేను అంగీకారము నిచ్చుచున్నాను:౼

౧ ఇప్పుడున్న జెండా.

౨ నాలుగు భాగములుగ విభజింపబడిన గుడ్డమీద ఈ ప్రకారము వేయవచ్చును. ఒక మూల యూనిజన్ జాక్. రెండవ భాగమున భారతవర్ష పటము. మూడవ భాగమున మనసంఘ చిహ్నమగు భానుడు కమలము, దీక్షా వాక్యము. నాలుగవ భాగమున రాజధానియొక్క గాని లేక పటాలము యొక్క గాని చిహ్నలు.

ఈరెండవ విధము అన్ని అభిప్రాయములకును చోటిచ్చుచున్నది; కావున అది బాగున్నదని తలంతు.

ఆంధ్రదేశమునందు ఇంతత్వరితగతిని అభివృద్ధినిజూపుచుండుట నాకు మిక్కిలియానందముగ నున్నది. దేశమునందు కొన్ని భాగములు పరిపాలనను తమచేతిలోనికి దీసికొనుటయందు మందముగనున్నను, ఈ యుద్యమమున రాష్ట్ర స్వాతంత్య్రము చక్కగా పని చేయగలదని నేను నిశ్చయముగా జెప్పగలను.


గ్రంథాలయోద్యమము

ఈయేడు సభలు

ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభయును, అఖిలభారత గ్రంథాలయ ప్రతినిధిల మహాసభయును, ఆంధ్రసారస్వత మహాసభయును, అఖిల భారత గ్రంథాలయ ప్రదర్శనమును, ౧౯౧౯ సం॥ నవంబరు నెల ౧౪,౧౫, ౧౬ తేదులయందు మద్రాసు నగరమున జరుగనున్నవి. బెజవాడ రామమోహన ధర్మగ్రంథాలయమునకు, అది పుట్టిన నాటినుండియు ఉపాధ్యక్షులుగను ఉండి ౼ యుద్యమాభివృద్ధినిమిత్తమై నిరంతరకృషి సలిపినట్టి దేశాభిమానదక్షులగు శ్రీ సూరి వేంకట నరసింహశాస్త్రి గారు, ఆంధ్రదేశ గ్రంథాలయ