నిలిచినటులను ఆటంకముగ నిలిచినటులను గానము. ఈ యభిప్రాయముతో ఆంధ్రులుతప్ప మరెవ్వరును ఏకీభవింపలేదు. కాని ప్రధాన కమీషనరుగారు ఒక్క సంగతిని జెప్పిరి. ఏరాష్ట్రమందైన ప్రస్తుతము బాలభటుల కేర్బరచిన దుస్తులు అంగీకారము కానియెడల, వారికి అనువగు పద్ధతులను గురించి తమకు వ్రాసినయెడల అట్టి దుస్తులనే ధరించుటకు ఉత్తరువు నిచ్చెదమని చెప్పిరి.
దుస్తులకు సంబంధించిన విషయమునకు పిమ్మట మనకు సంబంధించిన ముఖ్యవిషయము ఉద్యమవ్యాప్తినిగురించి. ఈ యుద్యనమును ఆంధ్రదేశమునందు వ్యాప్తి జేయుటకు ఆంధ్రదేశమును మూడు భాగములుగ విభజించిన ఉద్యమవ్యాపన సులభమగునని కొందరనిరి. కాని దానికి మేమంగీకరింపక, ఆంధ్ర దేశమంతయు ఒక్క నిర్మాణముగనే ఉండవలయునని ఘంటాపధముగ జెప్పితిమి. ఇదివరకీ యద్యమము ఆంగ్లేయ భాషయందే ముఖ్యముగ నడుపబడుచున్నది. పల్లెలయందరి వ్యాప్తము గావలెనన్న దీనిని సంపూర్ణముగా ఆంధ్ర మునందే నడుపుట కర్తవ్యము; అట్లు ఈ యుద్యమమును ఆంధ్రమునందు నడుపుదమన్న ఆంధ్రదేశమును ఒక్క సంస్థగనే ఏర్పరచుట అత్యంతావశ్యకమని జెప్పితిమి. దానికి ప్రధాన కమీషనరుగా రంగీకరించిరి. ఇందువలన మనమీద ఎక్కువ బాధ్యత ఏర్పడినది. ఆ బాధ్యతకు తగినటులు దేశసేవకులందరును నడుములుగట్టి పనిచేయుట అత్యంతావశ్యకమై యున్నది.
ఇటులే అనేక విషయములను గూర్చిన చర్చలు జరగినవి. మనకు సంబంధించిన ముఖ్యవిషయములను మాత్రము ఇట వివరించితిని. బొంబాయినుండి యీసంఘమునకు జెందని కొందరు బాలభటులు వచ్చి మేము విడిసిన పట్టణమునకు ఐదు మైళ్ళ దూరమునందున్న వేరొక పట్టణమున మకాము చేసిరి. ఒకదినమున వారిని మాకతిధులుగ నాహ్వానించి, ఆదినమంతయు వారితో ఆటలతోడు పాటలతోడను గడపితిమి. మరుసటిదినము ఉదయమున తిరిగి వారు మాకు ఆతిధ్యమొసగిరి ఈప్రకారము యీ దినములు మిక్కిలి యానందముతోను అనుభవములతోను గడచినవి.
ముందుసభ మనదేశమందే
రాబోవు సంవత్సరమునందు అఖిలభారత బాలభటోద్యోగుల మహాసభను ఆంధ్రదేశమున కాహ్వానించితిమి.
ఆంధ్రదేశమునకీ సభను ఆహ్వానించిన మాత్రమున గంత సింపదలవలసినది లేదు. ముందు సంవత్సరమందీ సభ కూడునప్పటకి ఆంధ్రదేశమందీ యుద్యమము చక్కగా నాటుకొనునటుల జేయవలయును; అట్లు చేసిన గాని మన మీ సభను పిలిచినందువలని ప్రయోజనము గలుగదు.
ముఖ్యములగు తీర్మానములు
ఆంధ్రరాష్ట్రీయ సంఘము యొక్క సామాన్యసభ ౧౯౧౯ సం. ఆగష్టు నెల ౧౦ వ తేదీ ఉదయమున బెజవాడ పట్టణమున శ్రీ రామమోహన ధర్మపుస్తక భాండాగార భవనమున జరిగినది. వివిధశాఖా సంఘములనుండి ప్రతినిధులే తెంచిరి. అప్పుడీ తీర్మానములు చేయబడినవి:౼
౧ ఈ సంఘముయొక్క సభలకు ముగ్గురు సభ్యులు “కోరం"గా ఉండవలెనని తీర్మానించడమైనది.
౨ ఈక్రింది సంఘములను ఈసంఘమునకు శాఖలుగ చేర్చుకోవడమైనది: ౧. బందరు ౨. బెజవాడ 3. రాజమహేంద్రవరము ౪.కాకినాడ ౫. వల్లూరుపాలెం ౬. గుంటూరు.
3 ఆంధ్రరాష్ట్రమునకు సంచార కార్యదర్శిగా వెణుతురిమిల్లి శ్రీ రామారావు గారిని ఏర్పరచడమైనది.
४ భారతబాలభట సంఘము యొక్క "సెంట్రలుకావున్సిలు” నకు ఈ సంఘపక్షమున ౧ కావలి శంకరరావుగారిని ౨ వార్నాని సుబ్బారావు గారిని సభ్యులుగ ఎన్నుకొనడమైనది.
౫ బెజవాడ తాలూకాకు బండి బుచ్చయ్య చౌదరీగారిని ప్రధాన బాలభటోపాధ్యాయుని ఏర్పరచడమైనది.
౬ ఆంధ్రరాష్ట్రమునందు ఏ పటాలము వారైన బాలభటులకు నియమితమైన దుస్తులు గాక, కట్టుకొనుటకు పంచెను తొడుగుకొనుటకు జుబ్బాను వేసుకొనునెడల, ఆప్రకారము అంగీకరించుటకు తీర్మానించడమైనది. అయితే అట్టి పటాలమువారందరును ఒకేరీతి దుస్తులను ధరింపవలసియుందురు. వారు ధరించుగుస్తులును జుబ్బాయును రంగువై యుండవలెను. తలపాగాలు మాత్రము ఆకుపచ్చరంగువై యుండవలెను.
౭ ఈ సంఘమునందు సభ్యులుగానుండు వారందరును సంవత్సరమునకు (శాఖా సంఘములనుండి వచ్చు ప్రతినిధులకూడ)రు ౫ లకు తక్కువకాని చందానియ్యవలయునని తీర్మానించుచున్నారు.
అంతటితో ఉదయము సభముగింపబడి తిరిగి మధ్యాహ్నముగూడినది. అప్పుడీ తీర్మానములు జేయబడినవి:౼