సరము. రాత్రులు కావలిగాయుటకు చేలాంతరులీయవలెను. దూర కార్యనిర్వాహకమునకు త్రొక్కుడు బండ్లు కావలెను. ఒకస్థలమునుండి మరియొక స్థలమునకు వార్తలను నిర్వహించుటకు జెండాలు, ఈలలు కావలెను. చెప్పులు, గొడుగులు, ఈతకు సాధనములు, గోనె సంచులు, త్రాళ్ళు, దబ్బనములు, నడుము పట్టాలు- గొంగళ్ళు, మున్నగుననేక పరికరములు యాత్రకోపచారకులు తమ విధాయక కృత్యము నెర వేర్చుటకవసరము.
చేయవలసిన పని
బాలభలోద్యను వ్యాపకమునకు ఇంతవరకును ఆంధ్రదేశమునందు జరిగిన పనిని గూర్చియు, జరుగవలసిన పనినిగూర్చియు మీకు నివేదించితిని మామూలుగా జరుగవలసిన పనిగాక, గోదావరి పుష్కరములు గూడ వచ్చుచున్నవిగదా; మనకున్న వ్యవధి స్వల్పము. అందుచేత విశేషముగా శ్రమపడి పనిచేసిన గాని, పుష్కర సమయనకు సంతృప్తికరమగు పనిని చేసి చూపజాలము. ఆసమయము నందు పనిజేయుటకై అధమపక్షము ౨,౦౦౦ మంది భటులైన తయారగుట అత్యంతావశ్యకము.
ఎంతసొమ్ము గావలయును?
ఈ యుద్యమాభివృద్ధికై చేయవలసిన పనులన్నింటికిని, గోదావరి పుష్కరములు వచ్చులోపున అధమము రు ౨,౦౦౦ లైన ముఖ్యముగ గావలసియున్నవి. ఎంతో మెలకువగలిగి మితవ్యయము చేసినగాని ఈసొమ్మైనసరిపోదు. సేవాగ్రత దీక్షకొని, ఆంధ్రదేశాభ్యున్నతికై పాటుపడదలచిన యువకుల నేకులున్నారు. అట్టి వారికి అవకాశములను కల్పించి, దేశోన్నతికై సహాయపడుట పెద్దలకును నాయకులకును విధియైయున్నది. ను.
సొమ్ము ఈయదగిన పద్ధతులు.
ఎవరికిదోచిన మొత్తమును వారీయవచ్చును. నూరు రూపాయిల నొక్కసారిగా నిచ్చువారు భారత బాలభట సంఘముయొక్క ఆంధ్రదేశ శాఖయందు శాశ్వతసభ్యులగుదురు. సంవత్సరమునకు రు ౫ ల విరాళమిచ్చువారు సభ్యులు. కావున ఆంధ్రులందరును తమకు తోచిన విధమున తోడ్పడి, దేశసేవజేయుటకు తగిన యవకాశములను మాకు గల్పించెదరని ప్రార్ధించుచున్నాడను.
ఇట్లు విన్న వించు విధేయఁడు,
అయ్యంకి వేంకటరమణయ్య,
ఆంధ్రరాష్ట్రీయ ప్రధాన సైన్యాధ్యక్షుడు.
౧౦-౧౦-౧౯౧౯
అనుబంధము
ఆంధ్రరాష్ట్రీయ సంఘము
వల్లూరుపాలెమునందు జరిగిన కాలభటోపాధ్యాయుల శిక్షా స్థానముతో, ఆంధ్రదేశమునందు ఈ యుద్యమ వ్యాపనార్థమై ప్రత్యేక రాష్ట్రీయ సంఘముయొక్క నిర్మాణమావశ్యక మైనది. ఈయద్యమమును వ్యాపకముచేయుటకై భారతభాలభట సంఘమునకు ఆంధ్రరాష్ట్రీయశాఖ మేర్పాటుగావింపబడినది. ఆంధ్రరాష్ట్రమునకు ప్రధాన సైనాధిపతిని, సహాయసైన్యాధిపతులను ఏర్పాటు గావించిరి; ఆసంఘము యొక్క ప్రధానకార్యాలయము “ ఔజవాడ” యందున్నది.
అఖిలభారత బాలభటోపాధ్యాల సభ
బొంబాయి రాజధానియందు “వెస్టరన్ ఘాట్సు” ఆను గొప్ప పర్వతములున్నవి. ఆ పర్వతములగుండ ముప్పదిగుహలను తొలిచి, రైలుబండిని నడుపుచున్నారు. అట్టి పర్వతములందు మిక్కిలి ఎత్తయిన ప్రదేశమునందు “లోనవులా" అను చిన్న పట్టణ మొకటి గలదు; ౧౯౧౯ సం. మే నెల ౬ వ తేదీనుండి ౧౬వ తేదీవరకు అక్కడ అఖిలభారత బాల భటోద్యోగుల సభ జరిగినది. ఆసభకు మలబారునుండియు అరవదేశము నుండియు బంగాళము మహారాష్ట్రము గుజరాతుసింధు మధ్యపరగణాలు మున్నగు రాష్ట్రముల నుండియు - ఇందోరు మున్నగు స్వదేశీ సంస్థానములనుండియు ఎనుబదిమంది ప్రతినిధలు విచ్చేసిరి. అందు ఆంధ్రదేశమునుండి ఏడుగురు ప్రతినిధులు పిచ్చేసిరి.
ఈ సభవలన అనేక లాభములు సమకూరినవి. దేశమునందు వివిధ శీతోష్ణస్థితుల చేత, వివిధ వేష భాషలచేత వివిధ సాంప్రదాయముల చేత వివిధ ఆచారవ్యవహారములచేత వివిధ నాగరికతల చేత భిన్నులయి యుండిన జనులందరును అచట చేరిరి. ఇన్ని విధములచేత వారు భిన్నులయి యున్నను, అక్కడకు వచ్చినవారందరును సేవావ్రత మహాదీక్షను గైకొన్నవారే. అందఱ ముఖకమలములయందును నిత్యానందము - నిర్యసిద్ధత - నిత్య