బొంబాయి సేవాసదనమువారు వచ్చి సాయపడిరి. ప్రయాగసేవక సమితి సంపూర్ణ జరసత్వములతో బాసటయై నిలచెను. అపుడా యాత్రికుల సహాయ్యమునకు గృషి చేసిన పడుచువాండ్రు అనేకవేలమంది యుండిరి. వీరందరును సుశిక్షితులు. ఆకస్మికములగు ప్రవాసకప్టుములను జక్కగ నెరింగినవారు. తన్ని వారణోపాయముల యందు మంచి కరిబీకును పొందినవారు. ఆపాయములకులకు జంకని సాహసము, దేహశ్రమకు వెనుదీయని ఉత్సాహము, నాయకుల యాజ్ఞలను నిరుత్తరముగా నిర్వహించు విధేయత - మున్నగు సేవకలక్షణము లభిమానముతో నార్జించినవారు ఈపటాలమునకు మహామహులుచమూపతులై పాలించిరి కావలసిన వేలకొలది ధనమును కలకత్తా మార్వారీ సంఘమువారు పూర్ణవ్యయ స్వాతంత్య్రముతో నిచ్చివేసిరి. ఇందఱు మహామహులు, ఇ౦త ధనసహాయముతో అహోరాత్రులు, అకలంకమును అప్పులితమును అగు నిష్కాను దీక్షతో పాటుపడినను ప్రభుత్వమువారొక ప్రక్క ప్రబలసన్నాహముతో తోడ్పడినను కుంభమేళాయాత్రికుల కష్టములు సంపూర్ణముగ దప్పినవిగావు; సేవకులు కొలది సంఖ్యాకులగుటయే దీనికి కారణము. కావున యాత్రాజనుల సౌకర్యమన్న మాటలతో నగునది కాదు.
గోదావరీ పుష్కరములో గూడ కోట్లకొలది యాత్రీకులు రాజమహేంద్రవరము కొవ్వూరులలో దిగుదురు. ఇంతమంది యాత్రికులకు తగినట్లు చేదోడు వాదోడు సాయమిచ్చుట సులభమైన కార్యము గాదు. యాత్రికులు భిన్న దేశస్థులు భాషాంతరులు. వీరినందఱకు అన్ని విధముల నాదరింపవలెను. గోదావరి పుష్కరమునకు బోయి కష్టముల ననుభవింపకుండ వచ్చితిమని అనుకొనునటుల చేయవలెను. ఉపచార లోపములు కాననీయరాదు. ఆంధ్రులలో అతిధిసత్కారము మెండను కీర్తి రావలెను. ఈ యుపచారసేవ సలుపు ఉత్సాహము నూతనముగ వెలువడిన బాలభటోద్యమమునందు మూర్తీభవించియున్నది. ఈ దీక్షను నిర్వహించుటకు తగిన అవకాశములు కల్పింపవలెను. ఆభారము ధర్మపరాయణులగు మహాజనుల పైనున్నది. ఎట్లందురా? ముందు యాత్రికులకు దెలియుటకై "ఆయా పుణ్యక్షేత్రములను గూర్చి కరపత్రములు వ్రాసి ప్రచురింపవలెను. స్థలాంతరములనుండి లేఖలు వ్రాయు తైర్థికులకు అడిగిన సమాచారములను తక్షణము తెలుపు లేఖకులను నిరూపింపవలయును. యాత్రికులకు వసతులు సాధ్యమైనంతవరకు యాత్రికుల భాషా సంబంధమునుబట్టి విడిదివాడలు నిర్మింపవలెను. ఉదాహరణము, మహారాష్ట్రవాడ; బెంగాలీవాడ మున్నగునవి. రైలుస్టేషనుకు సమీపమందు ప్రజలు నిలుచు పాకలు వేయించి వారి వారి నియామక వాటికలకు జేర్పవలెను. యాత్రికుల ఆధిక్యముకు బట్టి తినుబండారములును, తీర్థవస్తువులును మితిమీరిన ధరలకమ్మబడును. అందుకొరకు పరపతి భాండారమును స్థాపించి వస్తువులు సప్లయిలకు తగిన యేర్పాట్లు చేయవలెను. ఉత్తరాలు మనియార్డర్లు మున్నగు విషయములలో సాయము చేయవలయును. ఉత్తరములు వ్రాసికోలేనివారికి వ్రానీ పెట్టుటకు తగిన వసతులు చేయవలెను. కలరా జ్వరము మున్నగు తరుణవ్యాధులకు మంచిమందులను సంపాదించి సహాయము చేయవలెను.
స్నాన ఘట్టములయందు అలవలుగట్టి ఈతసాధనములతో అపాయరక్షకుల నేర్పరుపవలెను. యాత్రికులు స్నానమునకును, చోరబాధలేకుండా కాపాడుటకు కొందరిని నిలుపవలెను. గాయములు తగిలినవారికి తగిన సహాయము వెంటనే యొసంగుట అత్యంతావశ్యకము. రైళ్లరాకపోకలు, టిక్కెట్ల ఛార్జీలు, అయాభాషలలో దెలుపగల ఉపచారకుల నందందు నిలుపవలెను. వంటచెరకు సేకరించి సరియైన ధరలకివ్వవలెను. శిశువులకు పాలు సమకూర్చవలెను. అన్నాతురులకు ఆహారమియ్యవలెను. దారితప్పిన వారిని వారి ఆప్తులకు జేర్పవలెను.
యాత్రికులకు అత్యంతావశ్యకములకు కొన్ని ఉపచారములను మాత్రముయిచ్చట మాచించితిని. అవసరమునుబట్టి ఇంక నేన్నియో కార్యములనివార్యములగును. ఇన్ని పనులను యేలోపములేకుండ సమర్పించుట సామాన్యము కాదు. ఎందరో బాలభటులు కావలెను; ఎంతో ధనము కావలెను. ఎన్నియో పరికరములు కావలెను; పనిచేయు భారము మాది. పనిముట్లు సమకూర్చి యిచ్చు బాధ్యత మీది.
మహాజనులారా! పైన చెప్పిన కార్యములన్నియు యాత్రికులకు సంబంధించినవియే. ఇక యాత్రికులకుపచారముచేయు సేవకుల ఆవశ్యకములను గూర్చి యాలోచింపవలసి యున్నది. బాలభటులును, సేవాకుమారులును ఉండుటకు విడుదులు కావలెను. పుష్టికరమును ఆరోగ్యకరమును నగు ఆహారము కావలెను; వీరొకరినొకరు గుర్తించుటకై విలక్షణమును కార్యయోగ్యముమునగు దుస్తులు కావలయును. వంటపాత్రలు తప్పనిసరి. భిన్న ప్రాంతములనుండి వచ్చు సేవకులకు రైలుఖర్చులీయవలెను. వర్షపాతమునుండి సురక్షితులగుటకు తగినదుస్తులు, అవ