Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.1 (1920).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏర్పరుపలేక పోయినప్పటికిని, ప్రతిజిల్లాకును ఒక్క శిక్షాస్థానమునైన ఏర్పరచుటకయి ప్రయత్నములను సలుపుచున్నారము.

ప్రధమశిక్షా శిబిరము

ఔదార్యవంతులురు, దేశాభిమానులును, పరోపకారపారీణులును అగు శ్రీబండి వేంకటకృష్ణయ్యగారి పోషణవలన, కృష్ణాజిల్లా బాలభటోపాధ్యాయుల శిక్షా శిబిరమును గడచిన మార్చి నెలయందు బెజవాడ తాలూకా వల్లూరుపాలెమునందు బెజవాడ బాలభట సంఘమువారి యాదరణక్రింద నిడపితిమి. బాలభటోపాధ్యాయులకు కావలసిన సమస్త సౌకర్యములను, శ్రీ వేంకటకృష్ణయ్యగాకు మిక్కిలి ఓపికతోను, శ్రద్ధతోను నిర్వర్తించి భాలభటుల కృతజ్ఞతకు పాత్రులైరి. బాలభటులు సేవావ్రతులుగదా. కావున వారు ప్రతిఫలముగ జేయదగినది భక్తి పురస్సరమగు ఒక్క వందనమే; ఆవందనమును వారెప్పుడును జ్ఞప్తియందుంచుకొనుటకై ఒక పతకమును జేసి వారికర్పించితిమ.

వల్లూరుపాలెమునందు యేర్పరచిన యీ శిక్షాస్థానమును భారతవర్ష బాలభటోద్యమ చరిత్రయందొక నూతన యుగము ప్రారంభమైనదని చెప్పవచ్చును. ఇంతవరకును భారతవర్షము నందంతటను భటులశిక్ష ఆంగ్లేయ భాషయందే నడుపబడుచున్నది. ఈ శిక్షాస్ధానమునందు శిక్ష యంతయు ఆంధ్రమునందే గరపబడినది. కవాతు పదములు హిందీయందు వాడబడినవి. అక్షరావధానము ఆంధ్రమునందే గల్పింపబడినది. ఈశిక్షాస్థానమునందు 39 మంది ఉపాధ్యాయులుగను, ౮ మంది బాలభటులుగను తరిబీతును పొందియున్నారు.

ఇతర శిక్షా శిబిరములు

కడపజిల్లా కోడూరు గ్రామమున ౧౯౧౯ సం. ఆగష్టు నెల ౨౭ వ తేదీ నుండి, తొమ్మిది దినములు బాలభటోపాధ్యాయుల ద్వితీయ శిబిరము అత్యుత్సాహముతో మిక్కిలి జయప్రదముగ జరిగినది. ౧౬ మంది బాలభటోపాధ్యాయులుగను, ౮ మంది యౌవన భటులుగను తరిబీతునొందిరి. దత్తమండలముల యందిదియే ప్రధమ శిక్షాస్థానము. కడప, అనంతపురం, చిత్తూరు, కృష్ణా జిల్లాలనుండి ఉపాధ్యాయులుగ తరిబీతును పొందువారేతెంచిరి. కోడూరు గ్రామము శిక్షాస్థానమునకు అనేక విధముల ఒప్పియున్నది. ఎక్కడ జూచిన చక్కని తోటలు, దొడ్లు, పైరులతో నిండియుండిన పొలములు, ఆడవులు, చక్కని సెలయేరులు గ్రామస్థులు అత్యుహవంతులు. జ్ఞానోదయ గ్రంథాలయ సభ్యులందరును ముఖ్యముగ అధ్యక్షులకు శ్రీదర్శి గురవయ్యగారును కార్యదర్భులకు శ్రీ సీతారామయ్యగారుకు వారి సోదరులును శ్రీ పెరుమాళ్ల శ్రేష్ఠి గారును చూపిన యాదరణము ఎన్నటికిని మరపురాదు. శ్రీ వేదం వేంకట కృష్ణశర్మగారి పట్టుదలయే ఈ శిక్షాస్థానమునకు ముఖ్యకారణ మయ్యెను. దత్తమండలములందు బాలభటోద్యమ బీజములను నాటుటకు ప్రథమ ప్రయత్నము నొనర్చిన కోడూరు వాస్తవ్యుల మాతృదేశాభిమానము మిక్కిలి ప్రశంసనీయము.

దత్తముండలములకు ద్వితీయ శిక్షాశిబిరము సెప్టెంబరు నెల ౨౨ వ తేదీ నుండియు చిత్తూరుజిల్లా తిరుత్తలి గ్రామమునందు నిర్వహింపబడినది. ఆంధ్ర రాష్ట్రీయ బాలభట సహాయకమీషనరు గారగు శ్రీ వారణాని వేంకటసుబ్బారావుగారు ఈ శిబిరమును నడపిరి. తిరుత్తని గ్రామము గొప్ప పుణ్యక్షేత్రము. కొండలతో దర్శనీయమై యొప్పుచుండును. ఈశిబిరమునకు గావలసిన యేర్పాటులను శ్రీ బూమారు రామానుజులురెడ్డిగారును శ్రీ యం.ముని కన్నయ్యగారును బాల్యులయ్యు మిక్కిలి జయప్రదముగ నిర్వహించిరి; వీరికి అండగ చిత్తూరు న్యాయవాదులును దేశాభిమానులునునగు శ్రీ బి.మునుస్వామినాయుడుగారు నిలచి సర్వవిధముల సహాయమును జేసి యున్నారు. ఈ శిబిరమునందు ౧౬ మంది బాలభలోపాధ్యాయులుగ తరిబీతును పొందియున్నారు.

సెప్టెంబరు నెల ౨౮వ తేదీనుండియు గుంటూరు నందు వేరొక శిక్షాశిబిరము నెలకొల్పబడినది. ఈ శిబిరమునకు కావలసిన యేర్పాటులన్నిటిని శ్రీ చట్టి నరసింహారావు పంతులుగారు అత్యుత్సాహముతోను, మిక్కిలి పట్టుదలతోను జయప్రదముగ జేసియున్నారు. తొంబదిమంది బాలధీటోపాధ్యాయులుగను, జట్టు పెద్దలు తరిబీతును పొందినారు. శిక్షాస్థానమును ఆంధ్రరాష్ట్రీయ బాలభట సహాయ కమిషనరుగారగు శ్రీ కావలి శంకరరావుగారు తమ సహాయకులతో నడపిరి. ఈ స్థానమును జయప్రదముగా కొనసాగించుటకై శ్రీ నరసింహారావుగారు అనేక విధముల మిక్కిలి ఓపికతో శ్రమపడి పనిజేసి యుండుట శ్లాఘాపాత్రము.

ఉద్యమము ప్రచారమగు టెట్లు?

ఈ బాలభటోద్యమము ఇతరోద్యమములవలె ఉపన్యాపములతోను, సంఘస్థాపనలతోను మాత్రమే కొనసాగునది గాదు. బాలభటులను సేవావ్రత దీక్షితులుగ తయారుజేయుటకై ప్రత్యేకముగ తరిబీతును పొందినట్టి బాలభటోపాధ్యాయుడు ప్రతిపట్టణమునందుకు, ప్రతి