దలు ౧౨ సం|| వయస్సుగల మగపిల్లలకును ఆడపిల్లలకును, ౧౨ సం॥ వయస్సుమించిన ఆడపిల్లలకును ౧౮ సం॥ వయస్సు మీరిన యువకులకును గూడ అవకాముగలదు.
దేశము కొఱకు తమ లాభనష్టములను వినియోగింపుచు దేవునిదైవభక్తులను సేవింపుచు, సామ్రాజ్యమున రాజభక్తిగలిగి జీవింపుచు, అందరికిని ఉపయోగకారులైయ్యండ వాంఛింపుచు పౌరధర్మములను గుర్తెఱింగిన వారినిగ మనబాలురను యౌవనులను జేయుటయే ఈ స౦ఘోద్దేశము.
ఇవియే యీసంఘము యొక్క ముఖ్య సూత్రములు. పసిభటులు (ఏడు మొదలు ౧౨ సం॥ వరకు) బాలభటులు (౧౦ మొదలు ౧౮ సం॥ వరణ) యౌవనభటులు - అని ఈ యుద్యమమునందు తరిబీతును పొందువారు మూడు తరగతులుగనుందురు. బాలికలకుగూడ ప్రత్యేక శాఖ గలదు. అభిలాషులగు పెద్దలు తమతమ గ్రామములందును పట్టణములందును ఈ సంఘమునకు శాఖల నేర్పరచి, ఈ యుద్యమాభివృద్ధికై కృషి సల్పదగును. శారీరక సాధకముల మూలమునను, కవాతువలనను, బహిరంగ ప్రదేశముల నాడుకొను ఆటలవలవను, యాత్రలమూలమునను, పలువిధములగు చేతిపనులయందు ప్రాధమిక జ్ఞానము కలుగజేయుటమూలమునను - దెబ్బలు తగిలినవారికి ప్రాధమిక చికిత్సజేయుట, అక్షరావధానమును జేయుట గుడిసెలనుగట్టుట, తోటలను పెంచుట, ఈత నేర్చుట మున్నగునవి నేర్పుట మూలమునను యీ భటోద్యమమందు శిక్ష నొసంగబడును. భటధర్మములవలన ధర్మమార్గానువర్తనమల వడుటయేగాక తమ గౌరవముయొక్క విలువను వారు తమ దృష్టియం దుంచుకొనెదరు. ఇతరుల బలవంతము మీద గాక తమంతట తాము ఒక విధమైన శిక్షకు లోబడియుండుట యందును జావాబుదారీని వహించుటయందును సోదరబంధములను పెంపుజెందించు కొనుటయందును ఈ యుద్యమము అద్భుతములగు అవకాశములను గలుగజేయుచున్నది.
మాతృదేశాభివృద్ధిని గోరువారందఱును భావికాలమందు జాతీయ నిర్మాతలుగ నుండతగిన బాలుర అభివృద్ధిని గోరువారందఱును ఈ యుద్యమ వ్యాప్తికై కృషి సలుపవలయును. యువకులయం దుత్సాహమును కలిగించుటయందు దీనితో సాటియగునది లేదు. ఇది రాజకీయ విషయములకు గాని, మతకరులకు గాని, చోటియ్యనిది; మన పిల్లలయొక్క శక్తియుక్తులను సన్మార్గమున ద్రిప్పునది. ఆత్మగౌరవమును, ఆత్మవిశ్వాసమును, జితేంద్రియత్వమును గలిగించి సేవాగ్రతమునందును, పౌరధర్మములయందును తరబీతు నిచ్చునది; దేశమునకును సామ్రాజ్యమునకును మానవకోటికిని సేవజేయించునది.
ఉద్యమ బీజములు
౧౯౧౬ సం॥రమున సంభవించిన కృష్ణ, కొల్లేరు వరదల సందర్భమున పలుగ్రంధాలయముల ప్రతినిధులు బెజవాడ సేవకసంఘము వారి ఆదరణ క్రింద చేసినసేవ చాలమందికి జ్ఞప్తి యందున్నదని తలంచెదను; అప్పుడు వరదల పనులు ముగిసిన పిమ్మట సేవజేయుటయందు సేవకులకు తరిబీతునిచ్చినయెడల, సేవావ్రతమింకను ఎక్కువ దీక్షతోడను ఎక్కువ పవిత్రతతోడను జరుగగలదని యు, ఇట్టి యాపత్తులు ఒకరితో చెప్పిరావు గనుక వచ్చునప్పటికి “సిద్ధపడియుండు” వారుండుట అత్యంతావశ్యకమనియు తలంచిన వారమై భాలభటోద్యమమును గూడ నెలకొల్పి ఆంధ్రదేశమున కంతకును సేవాసంఘమును స్థాపింపవలయునని వాంఛించితిమి. ఇంత కాలము దాక ఆకోరిక ఫలింపకపోయినప్పటికిని మాహృదయములందు పరిపక్వమగుచున్నదని మాత్రము చెప్పగలము సుమారు నాలుగు మాసముల క్రిందట భారత బాలభటసంఘ ప్రధాన కమిషనరుగారగు పియర్సుదొరవారును, బందరు జాతీయ కళాశాలయందు బాల భటోపాధ్యాయు లగు వారణాసి వేంకటసుబ్బారావు గారును దయతో బెజవాడకు విచ్చేసి మాలో గొందఱకు బాలభట శిక్షణము నొసంగి మావా౦ఛ సఫలమగుటకు గావలసిన యవకాళము నొసంగిరి.
ఈయుద్యమమును వ్యాపింపజేయుటెట్లు?
ఆంధ్రదేశమునందీ యుద్యమమును విరివిగ వ్యాపింప జేయుటకు గాను, ప్రతిపట్టణమునందును, పల్లెలయందును బాల భటోపాధ్యాయులుగా తయారయినవారు ఒక్కరయినయుండుట అత్యంతావశ్యకము; అట్టి ఉపాధ్యాయులు తయారగుటకు గాను అక్కడక్కడ శిక్షాస్థానముల నేర్పరచి, వారిని తరిబీతు చేయవలసియున్నది. శిక్షాస్థానములను యేర్పరచుటయన్న సులభముగ కొనసాగు నట్టి కార్యము గాదు, విశేష వ్యయప్రయాసలతో గాని కొనసాగదు. భటోపాధాయ్యలను తరిబీతు చేయుటకు తగినంతమంది శిక్షకులుండవలయును. భటోపాధ్యాయులుగ తయారగువారికి తగిన వసతులమర్పుటకు ఉదారవంతులుండవలయును. బాలభటోపాధ్యాయులను తయారు జేయుటకయి అధమము ప్రతి తాలూకాకును ఒక శిక్షాస్ధాసమునయిన ఏర్పరచుట అత్యంతావశ్యకమయి యున్నది. ప్రస్తుతమున్న పరికరములనుబట్టి ప్రతి తాలూకాకును