Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.1 (1920).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాల భటోద్యమము ఇంతవరకు జరిగిన పని

నేడు బాలురుగను యౌవనులుగాను ఉండి యున్నవారే రేపు జాతీయ మహాసౌధమును నిర్మించువారై యున్నారు. వారి నిర్మాణమునకు గావలసిన పునాదులను వేయుట మనయొక్క విధ్యుక్తధర్మమై యున్నది. మనము వారికి ఇపుడిచ్చు తరిబీతును బట్టియే ఆ సౌధ నిర్మాణము గూడ నుండును. మన జాతియొక్క భావిఔన్నత్యమున కంతకును కర్తలగు వీరి కొరంతలేమియో దెలిసికొనుట మన బాధ్యతగాదా?

౧ వారు ఆరోగ్యవంతులుగా నుండవలయును. జాతి యొక్క శారీరక బలమంతయు దీని మీదనే ఆధారపడి యుండును. సామ్రాజ్యమున కిది రక్త నాళమువంటిది.

౨ తమ ధర్మము యొక్కయు గౌరవముయొక్కయు విలువను వారు దెలిసికొనవలెను. జాతియుక్క ధార్మికబలమంతయు దీనిమీదే ఆధారపడి యున్నది. సామ్రాజ్యమునకిది ఆత్మవంటిది.

౩ వారు సేవావ్రతులై యుండవలెను; అట్టి వ్రతమును నిర్వహించుటకు వలయు తరిబీతును శిక్షను వారు పొంది యు౦డవలెను. దీనిమీదనే జాతియొక్క శక్తి యంతయ నాధారపడియున్నది. ఇదియే సామ్రాజ్యమునకు శరీరమువంటిది.

౪ వారు పావనవంతులైయుండవలయును. జీవితము పవిత్రవంతమైనగాని ఇహపర సౌఖ్యములు లేవు మానవుల భవిష్యత్తు దీనిమీదనే ఆధారపడియున్నది.

మన పిల్లలను యౌవనులను, ఆర్యోగ్యవంతులుగాను ధర్మపరులుగను దేశ సేవానురక్తులుగను పావనవంతులుగను చేయుటకే భారతవర్ష భాలభభోద్యమము ప్రారంభింపబడినది. ఈ యుద్యమమునందు మన పిల్లలు సేవావ్రత దీక్షను గైకొనుటయేగాక, సేవావ్రతమును ఆచరణయందుగూడ బెట్టెదరు. వారేమి నేర్చుకొనెదరో దానిని ఆచరణయందు బెట్టుటకు వలయు సదుపాయములను వారు దీనియందు నేర్చుకొనెదరు.

పది సంవత్సరములకు పూర్వము బాలురను యౌవనులను పౌరధర్మములయందు తరబీతుచేయుటకై బాలభటోద్యమము ఆ౦గ్లేయ దేశమున “సర్ రాబర్టు బేడెన్ పవెలు” దొరగారిచే ప్రారంభింపబడినది. నాగరికజెందిన దేశములన్నిటియందును ఇపుడది వ్యాపించి యున్నది. అమెరికాదేశ సంయుక్త రాష్ట్రములందే ౨౫౦,౦౦౦ మంది బాలభటులు గలరు; ఈ యుద్యమమును జాతీయ ప్రతిష్టాపనగ నంగీకరించుచు నా దేశము యొక్క కాంగ్రెసు మహాసభవారు ఒక చట్టమును గూడ చేసియున్నారు. రెండులక్షలు మాత్రము జనసంఖ్య గలిగిన “న్యూజీలాండు” దేశమునందే ౨౦,౦౦౦ మంది బాలభటులు గలరు. ఈ యుద్యమము ఆయా దేశము లందు ఇంత అద్భుతముగ వ్యాపించుటెందుకు!

ఆ దేశములందలి తలిదండ్రులు తమపిల్లలు ఆరోగ్యవంతులును, ఆత్మవిశ్వాసముగలవారును కావలెననికోరిరి. పిల్లలు తమపనియందు సహాయభూతులయియుండవలెనని ఉపాధ్యాయులుకోరిరి; సన్మాగు౯లును, ఆత్మగౌరవము గలవారును, విశ్వాసపాత్రులును సేవావ్రతులును ఆగు పౌరులు కావలెనని అందరును కోరిరి. ఈయుగమందు విద్యావ్యాపకమున కిది అత్యుత్తమమాగ౯మని వారు కని పెట్టిరి.

౧౯౧౭ సంవత్సరము మార్చి నెలవరకును భారతవర్షమందీయుద్యమమేలేదు; అప్పటికఱకును చట్టముననుసరించి ఐరోపా దేశీయులను, యూరేషియనులను, క్రైస్తవులను తప్ప తదితరులను దీనియందు చేర్చుకొనుట లేదు. ఈ విషయము 'యుద్ధానంతరము ఆలోచించెద మనిరి. అందుచేత మద్రాసు నగరమున ఆనీబీసెంటమ్మగారి యాదరణక్రింద భారతబాలభటసంఘము స్థాపింపబడి, ఈ యుద్యమ వ్యాపకము ప్రారంభమైనది, భారతవష౯ పరిస్ధితులకు అనుగుణ్యములగు మార్పులతోను చేర్పుల తోను “బేడెనుపవెలు” గారి పద్ధతియే ఇచటను అమలులోనికి తేబడినది. ఇతర దేశములందీ యుద్యమమందు ౧౧ మొ॥ ౧౮ సం॥ వయస్సుగల బాలురకు మాత్రము స్థానము గలదు. మనదేశీయ ఉద్యమమందన్ననో ౭ సం॥ మొ