విచారము
మార్చి 24 వ తేదీ రాత్రి మాకు మిక్కిలి విచారముగలిగించిన సమయము, రాత్రి పండ్రెండు గంటలగునప్పటికి మేమందఱమును మా సామానులఁ గట్టుకొని గూడులేక చంద్రమండలము నంతను రాత్రి యంతయు మా కండ్లముందగ నుంచిన నాలుగు మోట బండ్లపై నుప్పులూరు రైలా స్టేషనుకు ప్రమాణ మైతిమి. రాత్రి వల్లూరుపాలెమున సోదరబృందమును విడచి వచ్చునపుడును, స్టేషను వద్ద బెజవాడ సోదరులు విడనాడు నపుడును గల్గినవిచాగ మెవ్వరును దాచఁజాఁలక పోతిమి. ఆ సమయముననున్న వారిలో ప్రతివారును బాలభటోద్యమమునందును మన జీవితమునందును నిట్టి యాత్రలెంత సంతోష జనకములో తెలుపుటకు సాక్షులు.
యాత్ర
అంధ్రసోదరులారా ! మనలో దైవభక్తి, దేశభక్తి నశించిన కొలఁదిని తీర్ధయాత్రలు తగ్గి పోవుచున్నవి. భరతఖండమున నవతరించి, దైవసృష్టి నైపుణ్యమును ప్రకటించు పుణ్యక్షేత్రముల వీక్షించఁజాలకపోయినను, యట్టి జన్మయే పరమావధిగా నెంచుకొను భక్తి జీవనమునకు ప్రధమ సోపానములగు నీ బాలభట శిక్షాస్థానయాత్రల సేవించి, మాతృనేవాగ్రతదీక్షుఁ గైకొనుటకు సమకట్టుదము.
నే నేమి సేయుదు
వల్లూరుపాలెములో నేర్పరుపఁబడినది మొదటి శిక్షాస్థానమే ఇంక నట్టి వెన్నియో నేర్పరచినఁగాని యాంధ్రయువకు లెల్లరు నిట్టి శిక్షను పొందఁ జాలరు. కావున దేశాభిమానులును ధర్మపరాయణులును యిట్టి శిక్షణమునాకు నన్నివిధముల సాయముసేయ ప్రార్ధితులు.
ఇట్టి శిక్షాస్థానముల ప్రయోజనమును గ్రహించియు, భోజనాదు లుచితముగ నొసంగఁ బడు సౌకర్యమును మరువకయు, శిక్షణమంతయు నాంధ్రమున గరపఁబడు నను విషయము గమనించియు నెట్టి విచక్షణ లేక, ఆంధ్రు లెల్లఱును నిట్టి శిక్షాస్థానముల కెక్కువ సంఖ్య లుగా వచ్చి మాతృసేవఁ గావింతు రని ప్రాధించుచున్నాము.
ఈ శిక్షాస్థానము నేర్పరచి, ఖర్చులు భరించి మాకెల్లలురును గావలసిన సమస్త సహాయమును గావించిన శ్రీ బండి వేంకటకృష్ణయ్య చౌదరి గారికిని వారి స్నేహిశులకు, వల్లూరుపాలెపు సోదరులకును, వందనము లర్పించు చున్నాము.
ఈ ప్రథ మాంధ్ర బాలభట శిక్షాస్థానమున సేవావ్రతదీక్షఁ గైకొన్నవా రెల్లఱును తమ కృషిని క్రియారూపముగఁ గనుఁబరతు రని నమ్ముచు వారికెల్లప్పుడును నా యురారోగ్యముల నిచ్చి తోడుగ నుండునట్లు నిరంతరమును దైవమును బ్రార్ధించుచున్నాము.
రైలుబండి
చదువరులాగా ! మనము వుప్పులూరు స్టేషనుకు వచ్చి చాలా సే పైనది. బందరు మెయి లాలస్యమగుటచే మిమ్ము నింత సేపు నిలుప వలసి వచ్చినది. రైలుబండి స్టేషనులో వచ్చి నిలిచినంతనే మాకు యాకుపచ్చతలగడ్డలవార౦దఱ అదృశ్యమైరి. బండి కదలు నప్పటికి ప్రదేశ మంతయు "ఆంధ్రమాతకు జై" "బాలభటులకు జై" యను కేకలతో మారు మ్రోగెను. వందేమాతరం.
౼ వారణాసి వేంకట సుబ్బారావు
ప్రథానశిక్షకుఁడు