తీముమీద వ్రాసుకున్న సంగతులు యావత్తు కొన్ని కాగితములమీద వ్రాసి ప్రతిభటునకును, ఒక్కొక్క కాగితమును యివ్వవలెను. ప్రతి భటుడున్ను కాగితము మీద వ్రాసిన సంగతులు యావత్తు చదువుకొని, అనియెచ్చట ప్రదేశమందున్నది కనుకొనుటకు ప్రయత్నించ వలెను. ఏ భటుడు నియమిత కాలములో తాను కాగితముమీద చదువుకున్న స్థలమును సమాచారమును కనుగొని తిరిగి వచ్చునో ఆ భటుడు ఆట గెలిచినట్టు యెంచబడును. ఆటకు కాలపరిమితి, ఆట ఆడు ప్రదేశమునుబట్టిన్నీ, యితర స్థితిగతులను బట్టిన్నీ, ఉపాధ్యాయుడు యేగ్పరచవలెను.
6. లోకలాట
ఈ ఆట యొంతమంది అయినను ఆడవచ్చును. భటులను రెండు జట్టులుగ విభజింపవలెను. రెండు జట్టులకు తేడా యుండులాగున ఒక గుర్తు యుండవలెను. రెండుజట్టులలోని వారందరికిని తోకలు వుండవలెను. అనగా ఒక చిన్న గుడ్డ లాగితే సులభముగా వూడి వచ్చేలాగున వెనుక వైపున దోపుకొనవలెను. నడుమునకు తాడు మొదలగునవి వేసి కట్టుకొని కూడదు. 15 గజముల దూరములో రెండు జట్టులవారిని యెదురు బదులుగా నిలబెట్టవలెను. ఆట ఆడు స్థలమునకు నాలుగు వైపులను గుర్తులు పెట్టవలెను. భటులు యీ గుర్తులను దాటి అవతలకు పోకూడదు. తరువాత ఉపాధ్యాయుడుగాని మధ్యవతి౯ గాని ఒక యీల వేయవలెను. అప్పుడు ఆట ప్రారంభమవును. ఒక జట్టువారు రెండవజట్టులోనివారి తోకను లాగివేయ ప్రయత్నించవలెను, యే జట్టువారు యెక్కువ తోకలను నియమితకాలములో లాగివేయ గలుగుదురో, ఆ జట్టువారు గెలిచినట్టు యెంచుకొనవలెను. తోకను గోలుపోయిన భటుడు తిరిగి ఆటలో పాలుగొనగూడదు. ఉపాయముచేతితో కలను లాగివేయు ప్రయత్నించవలెను గాని, ఒకరిని ఒకరు కొట్టుకొన కూడదు. ఈ ఆట వలన ఆత్మరక్షణ అలవడును,
7. దీపము ఆర్పుట
ఈ ఆట బహు వినోదము గా నుండును. పిల్లలను రెండు పార్టీలుగా భాగించవలెను. నాలుగు అడుగులు పొడవుగల వెదురు కర్రను భూమిలో పాతి దానిమీద ఒక మైనపువత్తి వెలిగించి పెట్టవలెను. ఈ కర్రకు యెదురు గా షుమారు 20 అడుగుల దూరముగా సున్నా చుట్టవలెను. తడవకు ఒక్కని పిలచి వాని కళ్ళకు గంతకట్టి ఆ సున్నాలో నిలువ బెట్టి మూడుసార్లు గిరగిర త్రిప్పి విడిచి పెట్టి వానిని వెళ్ళి కర్రమీదనున్న మైనపువత్తిని ఆర్పమని చెప్పవలెను. ఏపార్టీవారు యక్కువసార్లు దీపము ఆర్పెదగో ఆ పార్టీవారు గెలిచినట్టు యెంచవలెను.
8 ధ్వనిని కనుగొనుట
ఈ ఆట యచ్చటనైనను ఆడవచ్చును. ఒక పెద్ద మేకును భూమిలో పాతి దానికి 10 అడుగుల పొడవు గల రెండు తాళ్ళును కట్టవలెను. ఇద్దరు పిల్లలకు కళ్ళకు గంతలు కట్టి మేకుకు గట్టిన రెండు తాళ్లు చెరి ఒకటి యిచ్చి ఒక పిల్లవానికి మెత్తని దిండున్నూ, రెండవ వానికి ధ్వనిచేయు గంట కాని మరి యే యితర వస్తువుగాని యివ్వవలెను. ఆటవివరము: - గంట పుచ్చుకున్న కుర్రవాడు ధ్వని చేయవలెను. ఆ ధ్వని విని రెండవ కుర్రవాడు ధ్వని వచ్చిన వైపునకు వెళ్ళి ఆ కుర్రవానిని దిండుతో కొట్టుటకు ప్రయత్నించవలెను. రెండవ కుర్రవాడు దెబ్బ తప్పించుకొనుటకు ప్రయత్నించవలెను. కుర్రవాండ్లు పట్టుకున్న తాళ్ళు బిర్రుగా పట్టుకుని చుట్టు తిరుగవలెను. లేని యెడల క్రింద పడిపోవచ్చును. ఈ ఆటవలన లాభము ధ్వని యే వైపునుంచి వచ్చినది కనుగొనుట అలవడును.
9 శత్రుశిబిరమునందు బాంబును పాతి వేయుట
ఈ ఆట ఆడుటకు చెట్టు మొదలగునవి గుబురుగా యున్న స్థలము కావలెను. రాత్రిపూట అయిన మంచిది. పిల్లలను రెండుపార్టీలు గా భాగించి ప్రతిపార్టీకి ఒక నాయకుని యేర్పరచవలెను. ప్రతిభటునికిన్ని 9 అంగుళముల పొడవుగల చిన్న కర్రలను యివ్వవలెను. ఈ కర్రలకు ఒక మొన సన్నగాయుండి భూమిలోనికి గ్రుచ్చీనపుడు చులకనగా దిగేలాగున వుండవలెను. సాయకులకు కర్రలు అవుసరములేదు. ప్రతిభటునికన్ని తోకలు వుండవలెను. అనగా ఒక చిన్న గుడ్డను లాగితే తేలికగా ఊడి వచ్చేలాగున వెనుకవైపున దోపుకొనవలెను. తరువాత ఉపాధ్యాయుడు రెండు సిబిరములు