నుంచ యిటు తిరుగుచుండ వలెను. నున్న వెలుపలనున్న యితర కుర్రవాండ్లు దొంగ కుర్రవానిచేత తాకబడకుండ నున్నా లోనున్న కర్రను తీసుకుని దూరముగా విసరి వేయుటకు ప్రయత్నించ వలెను. అలా చేయగలిగిన యెడల దొంగ కర్రను తీసుకువచ్చి తిరిగి నున్నలో నుంచవలెను. కర్రను విసరి వేయుటకు ప్రయత్నించునప్పుడు సున్నలో దొంగ యెవరినైనను తాకగలిగిన యెడల తాక బడినవాడు దొంగ యగును. కర్రను విసరి వేయక పూర్వమే దొంగ సున్నలో తాకవలెను కాని కర్రను విసరిన తరువాత తాకిన లాభము లేదు. దొంగ నున్నలో నిలుచుని తనచేతితో యెవరినైనను బయటవున్న వారిని తాకిన తాకబడినవాఁడు దొంగ అగును. నియమిత కాలములో యెక్కువసార్లు దొంగ అయిన కుర్రవాడు ఆట ఓడినట్టు యెంచవలెను.
3. చెట్టుకోతికొమ్మచ్చి
ఈ ఆట ఆడుటకు విశాలమైన చెట్టు ఒకటి కావలెను. చింత చెట్టు చాలా మంచిది. యేచెట్టు అయినను యేర్పరచుకొనవచ్చును. గాని దానికొమ్మలు పెళుసుగా యండగూడదు. యీఆట 10 మొదలు 12 మందివరకు ఆడవచ్చును ఈ ఆట ఆడుటకు కావలసిన వస్తువు ఒక గజము పొడవుగల ఒక కర్ర. యీ కర్రనే కోతి అందురు. మొదట ఈఆటలో ఒక కుర్రవానిని దొంగగా యేర్పచు కొనవలెను. కోతిగా యేర్పరచిన కర్రను మరియొక కుర్రవాఁడు తన కాలిక్రిందునుంచి విసరి వేయవలెను. విసరినితక్షణం దొంగగా నియమింపఁబడిన కుర్రవాడు కర్రను తీసుకొని రాగలందులకు పరుగిడవలెను. దొంగకుర్రవాడు తిరిగి వచ్చులోగా మిగతా కుర్రవాండ్లు అందరు చెట్టును యెక్కవలెను. దొంగ కుర్రవాఁడు కర్రనుతీసుకొని “వేడికోతి" అని గుక్కపెట్టుచు చెట్టువద్దకువచ్చి గుక్క వదలకయే ఆకర్రతో చెట్టుమీఁదనున్న కుర్రవాండ్లను అంటుకొనే ప్రయత్నించవలెను. చెట్టుమీదనున్న వారిలో నెవరినైనను తాకగలిగినయెడల తాకబడినవాడు దొంగఆగును. గనుక అందరును తప్పించుకొనుటకు ప్రయత్నించవలెను. పైచెప్పిన విధముగ దొంగ కర్రతో తాకలేనియెడల కర్రను చెట్టుక్రిందవుంచి చెట్టుయెక్కి యెవరినైనను తాకి తిరిగి వచ్చి కర్రను ముట్టుకొనే ప్రయత్నించవలెను. అలా చేయగలిగినయెడల తాశ బడినకుర్రవాఁడు దొంగఅగును. దొంగ చెట్టు యెక్కినప్పుడు చెట్టుమీద నున్నవారు క్రిందికి దిగివచ్చి క్రిందవున్న కర్రను కాలిక్రిందుగా విసరి వేయుటకు ప్రయత్నించవలెను. అలా విసరి వేయగలిగిన యెడల దొంగ చెట్టు దిగివచ్చి కర్రను తీసుకువచ్చి తిరిగి తాకుటకు ప్రయత్నించవలెను. నియమితకాలములో యేకుర్రవాడు యెక్కువసార్లు దొంగ అగునో ఆకుర్రవాడు వోడినట్టు యెంచవలెను. ఈ ఆట ఆడునప్పుడు చేతులు కాళ్ళు విరుచుకొనకుండ జాగ్రత్త గాచూచుకొనవలయును.
4. వోలలాడుట.
ఈ యాట యెంతమందియైనను యాడవచ్చును. ఈత రానివారు యాడకుండుట మంచిది. ఈ యాటలో ఒక దొంగ యుండును. ఈ దొంగ నీటిలో మునిఁగి మన్ను తీసికొని నీటి పైకి వచ్చిన తరువాత నీటిలో మునగ కుండానున్న వారిపైన వేయుటకు ప్రయత్నించ వలెను. ఒక పరియాయము తెచ్చిన మన్ను ఒకరిమీదనే వేయవలెను గాని అందరిమీదను చల్లగూడదు. అందరు భటులును దొంగ మన్ను విసరివేయగలిగినంత దూరములో నేయుండవలెను. అందరును దొంగ యొక్క చేష్టలను కనిపెట్టుచు, వాడు మన్ను విశురు సరికి తమమీద పడకుండ నీటిలోనికి మునిఁగి తప్పించుకొనవలెను. మన్ను యెవరిమీదనైన పడినయెడల ఆట్లు పడినవాడు దొంగయగును. ఒక సారి దొంగయైనవాడు తిరిగీ యింకొకని దొంగచేసిన తరువాత ఆటలో పాలు గొన కూడదు. పైఁ జెప్పినవిధముగా వినోదార్ధము కాలపరిమితి పెట్టుకుని యాడు కొనవలెను. ఈ ఆటవలన చురుకుదనము హెచ్చును. నీటి భయము తీరును. ఊపిరి బిగబట్టుట అలవాటు అగును.
5. స్థలమును కనుగొనుట
ఈ ఆట ప్రారంభించుటకు పూర్వము ఉపాధ్యాయుఁడు భటులకు యెవరికి తెలియకుండ దగ్గర ఉన్న గ్రామమునకుగాని, పట్టణ భాగమునకు గాని వెళ్ళి, కొన్ని జాగాలను, వస్తువులను చూచి వాటియొక్క ఆకారము వగైరాలను ఒక కాగితముమీద వ్రాసుకోవలెను. తరువాత ఆట ప్రారంభించవలెను. ఉపాధ్యాయుడు కాగి