యము నొందక మానము, ఇంకను అమెరికావిషయమును జూచిన వర్ణనాతీతము ఇంకను తదితర దేశములు గ్రంథకొండాగారము లెంతయో ప్రశంసాపాత్రముగ నున్నవి. ఇంగ్లాండును అత్యాశ్చర్యజనకముగ నున్నది. ఇంక మన దేశమును గూర్చి విచారించిన బరోడాయందును తంజావూరునందున్నదియును యిటీవల స్థాపించిన రామమోహన గ్రంథాలయమును యింకను యొకటి రెండు మాత్రము పెద్దవిగనున్నవి. తక్కిన వన్నియు కొద్దికొద్ది గ్రంథాలయములే. అవియైనను దేశమునంతటను విరివిగా నైనలేవు. ఇట్టి గ్రంథాలయోద్యమమును వ్యాపిఁఁజేయుటకు 1916 సం॥ అగష్టు 6వ తేదికి సరియగు నలనామసంవత్సర శ్రావణకు 7 తేదిన యీగ్రాముమందు వేంచేసిన శ్రీలక్ష్మీ చెన్న కేశవుని యంకితముంచి శ్రీలక్ష్మీచెన్న కేశవ విలాస గ్రంథాలయమని పేరిడి నొకగ్రంథాలయము స్థాపింపఁబడియె. దీని ముఖ్యోద్దేశములలో నొకటి పల్నాడుతాలూకా యందు గ్రంథాలయోద్యమమును విరివిగ వ్యాపింపఁ జేయుటనైయున్నది.
ఈవత్సరము 8 మహాజనసభలు గావింపబడినవి. గతవత్సరాంతమందు గలసభ్యులు 3ం; ఇప్పుడు ౪౪ మందిగలరు. గత సంవత్సరాంతమున ౧౮౪ గ్రంథములు గలవు. ఇప్పుడు ౨౨౯ గ్రంథములు గలవు. ఈ సంవత్సరమున చదువఁబడిన గ్రంథముల సంఖ్య ౨౪ం, ౮ పత్రికలు తెప్పింపఁబడుచున్నవి. ప్రతిదినమును సకుటున ౮ మంది గ్రంథాలయమునకు వచ్చెదరు. ఈ సంవత్సరము ధర్మబుట్టలు పెట్టి బియ్యమును వసూలు చేసితిమి. రాత్రి పాఠశాల నేర్పరచుటకై ప్రయత్నించు చున్నారము. స్వంత భవన నిర్మాణమును జేయవలసియున్నది.
వేంకట శివీయ గ్రంథాలయము, కొర్నిపాడు అగ్రహారం.
కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలోఁ జేరిన పయిగ్రామంబున 1-5-1918 తేదిన పై పేరున నొక గ్రంథాలయము నెలకొల్పఁబడినది. ఇందిప్పటికి 324 ప్రసిద్ధమయిన సంస్కృత గ్రంథములును 876 ఆంధ్ర గ్రంథములును గలవు. ప్రతిదినము చదువుకొను వారిసంఖ్య 10. దీనికి మూలధన మెంతమాత్రము లేదు. కాని అగ్రహారందారులయిన బ్రహ్మశ్రీ కూచిభోట్ల వెంకటాచలపతి శాస్త్రి గారి యొక్కయు నాగభూషణముగారి యొక్కయు గాఢాభిమానము గలిగియున్నది. వారీగ్రంథాలయమునకు విలుగగల కొన్ని సంస్కృత గ్రంథమాలను చితముగా నొసంగి నందులకు మేము వారికి కృతజ్ఞులము, ఇంతేగాక దీని యభివృద్ధికై ననేకవిధముల సహాయ మొనర్ప సంసిద్ధులై యున్నారు. ఈ భాండాగారముయొక్క వ్యయ ప్రయాసములు నేటిఁగఱకు మావలననే భరింపఁబడుచున్నవి.
-జంధ్యాల వేంకట శివకవులు