Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.1 (1920).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రుఁడ వయ్యురు . ద్ధాంధ్ర మెఱుఁగవు తెలిసికోలేవు నీ దివ్య శక్తులను అరపులుమాని ముం దంజలు వేసి కార్యశూరువు గమ్ము * గైకొమ్ము దీక్ష | మా॥ కన్ను ఁ గానక నిన్ను ఁ ( గనలేక పోతి మాతగో నీ పట్ల మౌన భావమును వహియించి యుంటనే పాపుండ నైతి కాలునిబంట్లు వే . కఱవ వచ్చెడిని భరియింపగా లేను బాధల నేను • అంజలి ఘటి యించి యర్మిలి మ్రొక్కి మరిమరి స్మరియించి మాతరో నిన్ను హర్షవ నీలోన . యైక్య మొందెదను సంపూర్ణ సౌఖ్యంబు . సతతంబుఁగోరి మునిఁగి పోయెద నింక మోద వారిధిని మాతరో యాశీస్సు • మహి నిమ్ము నాకు “ఆంధ్రవిష్ణు స్వరూ పాయ! శుద్ధాయ!” మాతృదేశమ నిన్ను మఱచి పోగలమె. -క్రొవ్విడి వేంకటరత్నశర్మ.


శ్రీలక్ష్మీ చెన్న కేశవ విలాస గ్రంథాలయము, కారెంపూడి.

తమోవంతంబైన లోకమునకంతకును సూర్యునిదీప్తి చేబ్రాణిసముదాయ మంతయు నెటుల చైతన్యమును బొందునో మానవజాతి యజ్ఞానతిమిరము నంతమొందించుటకు జ్ఞానదీపిక ఆవశ్యకము జ్ఞానమును సంపాదించుటకు విద్య మిగుల యాధారము. విద్యయన సృష్టియందలి నిర్మాణమును కనుఁ గొనుటయని భావము. మనుజుఁడు కాలానుగుణ్యముగ నొకప్పుఁ డౌన్నత్యమును మఱియొక సమయమున క్షీణత్వము నొందుచుండును. పూర్వము పుణ్యభూమియనఁ బరిగిన మన ఆర్యావర్తము శాస్త్రములు, కళలు, నైతిక రాజకీయ నిమయములన్నిటియందును అగ్రస్థానము నధిష్టించియుండె. అప్పటికాలమున మన మేపరిశ్రమలకుఁగాని వస్తునిర్మాణత్వమునకుఁ గాని పరదేశములమీఁద నాధారపడి యుండుట లేకుండెను. ఇంకను బలము సంపదలకు మన మాతృభూమి యాటపట్టెయుండె. ఇదియంతయు పూర్వులు గ్రహించిన జ్ఞానధనమే. వారొనర్చిన దేశమన వారుపొందిన యైహిక వ్యాపారములును వర్ణనాతీతము, ఇందుకు నిదర్శనము వారు రచియించిన జ్ఞానప్రదీప్తమైన గ్రంథజాలమే. మనము వానిని తెలిసి కొనఁజాలకయు క్రిమిసముదాయమున కర్పించియు భాషాసేవయొనర్పమియు, నింకను వాని మహిమాతిశయంబులను వెలువరింపఁబూను గురు సంప్రదాయము లేమియు క్రమముగా నాజ్ఞానధనము క్షీణదశకు నా నారంభించె మఱియు హైందవుల సంతతికిని మహమ్మదీయులకును - రాజ్యకార్యముల నేమి మతాంతరత్వమున నేమి వైమన్యుములు ప్రబలనారంభించె. అందునను గొన్ని గ్రంథములు అగ్ని దేవునకు నాహుతిఁజేయఁ బడినవయ్యె. మఱికొన్ని గంగాజలముల కర్పితంబులయ్యె. ఇటుల క్రమానుసారంబు, విద్య లేమియు, మత విముఖత్వంబులను గ్రహించి పాశ్చాత్య దేశీయులు మన దేశమున యడుగిడ నారంభించి మన యమృతరసములో యన మనగ్రంథ సందోహములను సాధించి తమ దేశములయందు వేలకొలఁది తమ భాండాగారములయందుఁ జేర్చుకొనిన వారైరి. అప్పటినుండియు వారు వాని యందతి పరిశ్రమచేసిజ్ఞాభివృద్ధిని జేసికొనిరి. వారాసాఫల్యమును బొందుటచే మహోత్కృష్టంబులగు కార్యముల నొనర్చగల ప్రజ్ఞావంతులైరి. అందుచే విదేశములే మనకు శరణ్యములయ్యె. పూర్వము మనదేశమునకంటే విదేశము లిప్పుడు వెలలేని కీర్తిని గడించిన వయ్యె. ఆహా! కాలమెటుల ప్రసరించె, "కాలస్య కుటిలాగతిః" యను వచనము సార్థకమయ్యె. ఇటుల మారుటకు గల వ్యత్యాసమే మన మనగ్రంథ పుంజముల మహిమాతిశయమే. వాటివలన వారికిఁ గలిగిన పాండిత్య ప్రకర్షయే వారిని ధనవంతులుగఁ జేసినది. మన గ్రంథజాలమే వారిదేశంబును జ్ఞాన ప్రదంబుగఁ జేసినవి. మహా గ్రంథపేటికయే ఇవ్విధంబున జ్ఞానవంతంబులై యావి దేశంబులు విలసిల్లుటంబట్టి యచ్చట గ్రంథాలయములకు బుట్టినిండాయె. జర్మనీ గ్రంథాలయములను గుఱించి చరిత్రకారులు వ్రాసిన చొప్పు పరికించిన విస్మ