టకు కావలసిన వస్తువులు, ఒకకర్ర, ఒక తాడు బంతిగాని తోలుబంతి గానిచాలును. ఈయాటకు భటులు రెండుపార్టీలుగా చీలవలెను. రెండు రాళ్ళను సమానప్రదేశమందొక గజముదూరముగాఁబెట్టి యారాళ్ళవైన యొక వెదురు కర్రనుంచవలెను. ఈలా యేర్పరచిన తావునుంచి పదిహేను గజముల దూరములో రెండు పాటీ౯లవారును యెదురుబడిగా నిలువవలెను. ప్రతిపాటీ౯లవారును యెదురుబడిగా నిలువవలెను. ప్రతిపాటి౯లోనూ బంతి విసురుట కొకరిని, బంతిని పట్టుకొనుట కొకరిని నియమించ వలెను. బంతిని విసురువారు తాము నిలుచున్న స్థలమునుండియే విసరి వేయవలెను. ఆలా విసరునపుడు బంతి రాళ్ళమీదనుంచిన వెదురుకర్రకు తగిలి కర్ర క్రిందబడులాగున గురిఁజూచి విసరవలెను. పైఁజెప్పిన విధముగా కర్రను క్రింద పడగొట్టగలిగినయెడల తన యెదరి జట్టులో బంతిని విసుకుటకు నియమింపబడిన వాఁడు అయిపోవును. వానిస్థలము రెండవవాఁడు ఆక్రమించును. ఒక జట్టువాఁడు బంతిని విసరినప్పుడు రెండవ పాటీ౯యందు బంతిని పట్టుకొనుట కేర్పరుపఁబడిన భటుఁడు బంతి యొకసారి క్రిందబడి యెగిరినప్పుడు పట్టుకొనినచో - అతఁడు కర్రకు దగ్గిరకువచ్చి బంతితో కర్రను క్రిందపడఁగొట్టిన యెడల యెదర పాటీ౯లో బంతినిపట్టు కొనుటకు నియమింహాఁఒడినవాఁడు అయిపోవును. అలా కొట్టినప్పుడు రెండవపాటీ౯లోని వారా బంతిని ఒకమారు క్రిందకిబడి లేచినప్పుడు పట్టుకోగలిగిన యెడల యిదివఱకు అయిన వాఁడు బ్రదుకును. బంతి పైకి యెగిరినప్పుడు పాటీ౯లోనున్న వారందఱు పట్టుకొనవచ్చును. కాని వారు కర్రవద్దకు రాకూడదు. ఏ స్తలమునుండి బంతిని పట్టుకుందురో యాస్తలము నుండియే కర్రను పడగొట్టుటకు ప్రయత్నించవలెను. ఈలా ఆడగా ముందు యేపాటీ౯ వారందఱూ అయిపోవుదురో వారు ఓడిపోయినటుల ఎంచవలెను. ఈ యాటవల్ల గురి బాగుగా కుదురును.
౮ బంతిని ఊగుట
ఈ ఆటకుఁ బిల్లలను రెండుపాటీణలగా భాగించవలెను. ఆరడుగుల పొడవుగల బల్లమీద నొక "సెల్యు లాయిడు" బంతి గాని లేక ఊలు బంతిగాని మరియేయితరమైన తేలికఒంతిగాని బల్లమధ్య ఉంచవలెను. రెండు పాటీ౯లను బల్లకు చెరియొకవైపున నిలువఁబెట్టవలెను. మధ్యనున్న బంతిని నోటితో ఊది తమ యెదరవైపు నుంచి క్రిందపడగొట్టుటకు ప్రయత్నించవలెను. యేపాటీEవారు ఆలా చేయగలిగితే ఆపాటి౯వారు గెలిచినట్టు యెంచవలెను. బంతి పాటీ౯లు నిలుచుండినవైపు నుండిగాక వేరుప్రక్కనుంచి క్రిందపడినయెడల నాబంతిని తిరిగి బల్లమధ్యనుంచి యధాప్రకారము ఆట ప్రారంభించవలెను.
౯ జ్ఞాపకశక్తి
ఒక బల్ల మీద యిరువదియొక్క వస్తువులనుంచి పైన గుడ్డనుకప్పి వేయవలెను. తరువాత బాలభటులను బిలచి పైకప్పినగుడ్డను దీసివేసి యొకనిమిషము కాలము నా బల్లమీఁదనున్న వస్తువులను చూడనిచ్చి, తిరిగి బల్లమీద నుండు వస్తువులు కనుబడకుండ గుడ్డనుకప్పి వేయవలెను. కప్పి వేసిన రెండు నిమిషముల కాల మాగనిచ్చి ప్రతిభటుని బల్లమీద చూచినవస్తువులన్ని౯టిని వ్రాయునటుల చేయవలెను. ఏ భటుఁడు నియమిత కాలములో యెక్కువ వస్తువుల పేర్లను వ్రాయునో ఆభటుఁడు గెలిచినటుల యెంచవలెను. ప్రతి భటుఁడు పదునారు వస్తువుల పేర్లకు తక్కువలేకుండ వ్రాయవలెను. ఈ ఆటవలన జ్ఞాపకశక్తి వృద్ధియగును.
౧౦ బంతిని యందఁ జేయుట
ఈ ఆటకు కావలసిన వస్తువులు రెండురబ్బరుబంతులు గాని లేక రెండు ఉన్నిబంతులు గాని చాలును. ఆట నాఁడువారిని రెండుపాటీ౯లగా భాగించి ప్రతిపాటీ౯కి యొక నాయకుని యేర్పరచవలెను. ఒక పాటీ౯వారిని లైనుగా నొకరి వెనుక నొకరిని నిలువబెట్టవలెను. రెండవ పాటీ౯ వారిని వైవిధముగానే మొదటిపాటి౯వారి ప్రక్కన నిలువబెట్టవలెను. నాయకులు ముందు నిలుచుండవలెను. ప్రతినాయకునికి నొక బంతి యివ్వవలెను. ఉపాధ్యాయుఁడు “వెళ్ళు" అను ఉత్తరవును యిచ్చినతోడనే నాయకులు తమవద్దనున్న బంతులను కాళ్ళ స౦దునుంచి వెనుకనున్న తమ పాటీ౯వానికి నందఁజేయ వలెను. అదేవిధముగ బంతి పాటీ౯లోని చివరకుర్రవాని వద్దవఱకు వెళ్ళవలెను. చివరకుర్రవాడు తాను బంతిని యందుకున్న తరువాత పరుగున వెళ్ళి యాబంతిని తన నాయకునికి నందఁజేయవలెను. ఏపాటి౯వారు ముందు బంతిని నాయకునికి నందఁజేసెదరో ఆపాటి౯వారు గెలిచినట్టు లెంచవలెను.
౧౧ ఘ్రాణశక్తి
కాగితపు సంచులను కొన్నింటినిచేసి వాటిలో వివిధ నువాసనవస్తువులు పెట్టి, ఆసుంచుల నన్నింటిని ఒక వరుసలో పెట్టవలెను. జట్టులోనున్న ప్రతికుర్రవానిని పిలచి సంచులను వరుసగా వాసనచూడమని చెప్పవలెను. ప్రతిసంచిని వాసనచూచుటకు అయిదు శెకనులు కాలము మాత్రమివ్వవలెను, అన్ని సంచులను వాసనచూచిన T