Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No. 6 (1919).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాలభటుని యాటలు

౧ పతాకము దొంగిలించుట.

ఈ యాట యెంతిమందయినను రెండు పాటీ౯లుగా చీలి యాడవచ్చును. ప్రతి పాటీ౯కిని యొక నాయ కుఁడు లేక పెద్దవుజ్జీ ఉండవలెను. ఈ పోటీ౬లలో నొక పాటీ౯ వారు పతాకరక్షకులుగాను రెండవ పాటీ౯ వారు పతాకము దొంగిలించువారు గాను పిలువఁబడుదురు. మూడు పతాకములను సమభూమిమీది, నొక పతాకమునకు రెండవ పతాకమునకును 20 గజముల దూరము ఉండేలాగున పొతవలెను. అనగా నొక పతాకమునకును రెండవ పతాకమునకును మధ్య జాగా 20 గజములు ఉండవలెను. పతాకములు పాతినిస్థలము దొంగిలించేపాటీ౯ వారికి తెలియనీయగూడదు. పతాకరక్షకపాటీ౯యొక్క పెద్దవుజ్జీ,తనపాటీ౯ వారిని, పాతిన పతాకములకు రెండువందల గజముల దూరమున పతాకములచుట్టూ కాపుపుంచ వలెను. అప్పుడు ఆట ప్రారంభనువును. పతాకములను దొంగిలించ నిర్ణయించబడిన పాటీ౯ వారు పతా కములు యెక్కడ పాతబడినదిన్ని కాపలాయున్న వారు యెచ్చట యున్న దిన్ని కనుఁగొని రక్షకులకు తెలియ కుండ పతాకములను దొంగిలించ ప్రయత్నించవలెను. ప్రతి మనిషిన్ని ఒక పతాకముకన్న యెక్కువ దొంగి లించగూడదు. పతాకరక్షకభటులు పతాకములకు రెండు వందల గజములలోగా రాకూడదు. పతాకమును దొంగిలించువానిని రక్షకులు చేతితో పట్టుకోనవసరములేదు. ఇద్దరు రక్షకులుచేరి 10 గజముల దూరములో నుండే దొంగిలింపవచ్చిన వానిని చేతులు యెత్తమన వచ్చును. అప్పుడు దొంగిలించవచ్చినవాఁడు అయిపోయినట్టు యెంచవలెను. దొంగిలించేపాటీ౯వారు రక్షకులను దగాచేయుటకు యిష్టమువచ్చినమోస్తరు జంతువు ధ్వనులుచేయ వచ్చును. నియమిత కాలములో మూడు పతాకములు దొంగిలించవలెను. అలా దొంగిలించలేని యెడల మధ్యవర్తి ఒక ఈలవేయును. అప్పుడెచ్చటనున్నవార నచటనే కదలకుండ నిలువబడవలెను. ఇది యెందుకన దొంగిలించేవారు పతాకములకు యెంతదగ్గరగా నున్నదిన్ని క్షకభటులు యేస్థితిలోనున్నది కనుగొనుటకు. ఈ యాటయొక్క ముఖ్యోద్దేశ్య మే మన రక్షకు లందఱు యొకరికొకరు అందుబాటులో నుండవలెను. ఈ ఆట రాత్రులాడదలఁచినయెడల పతాకములకు బదులు లాంతర్లు పయోగించవలెను.

౨ వేగులవాఁడు

ఒకనిని వేగులవానినిగా నియమించి యతనిచేతి కొకయుత్తరము నిచ్చి శత్రువులచే ముట్టడింపఁబడిన స్థలము నకుఁబోయి ఆ ఉత్తరమును ముట్టడింపఁబడినవారి కిచ్చుట. ఒక గ్రామముగాని, ఇల్లుగాని, లేక యేదో ఒకస్థలముగాని ముట్టడింపబడిన స్థలముగా నేర్పరచుకొనవలెను. వేగులవానిగా నియమింపబడినవాఁడు రెండడుగుల పొడవుగల నొక రంగుగుడ్డను తన భుజముమీఁద నుంచుకొని రక్షకభటులచేత పట్టుబడకుండ రక్షకస్థానము చేరవలెను. రక్షకభటులు గమ్యస్థానముగ నేర్పరచబడిన స్థలమునకు మూడువందల తక్కువకాని దూరములోనుండి వేగులవానిని పట్టుకొన ప్రయత్నించవలెను. వేగులవానిని పట్టుకొనుట యనగా వేగులవాని భుజముమీదనున్న రంగుగుడ్డను లాగుకొనవలెను, వేగులవాఁడు గమ్యస్థానమున కొక మైలుదూరమునుండి బయలుదేరవలెను. వేగులవాఁడు యేవైపునుండి బయలు దేరినది రక్షకభటులకుఁ దెలియకూడదు. వేగులవాఁడు తనభుజముమీఁద రంగుగుడ్డ నుంచుకొని రక్షకభటులను దగాచేసి తప్పించుకొని గమ్యస్థానము జేరుటకు ఆడ వేషముతప్ప తన యిష్టమువచ్చిన వేషము వేసుకొనవచ్చును.

3 ఇరుకక్షుల వేగులవారు

ఈయాట నెంతమందయినను రెండుపార్టీలుగా చీలి యాడవచ్చును. రెండు పార్టీలను సులభముగా పోల్చుకొనుటకు వేరువేరు పేర్లు పెట్టుకొనవలెను. అనగా నొకపార్టీని రామజట్టు, రెండవ పార్టీని రావణజట్టు అనిగాని లేదా ఆటఆడుకొనేవారికి యిష్టము వచ్చిన పేర్లుగాని పెట్టుకోవలెను. రెండుపార్టీలలో నుంచి యొక్కొక్కని తీసికొని వీరిద్దరిని వేగులవాండ్లుగా యేర్పరచవలెను. బాలభటోపాధ్యాయుఁడు గాని లేక యొక మధ్యవర్తిగాని గమ్యస్థానముగా నొకస్థలమును యేర్పరచి యచ్చటఆతను నిలుచుండును. ఆటయాడుకొను స్థలము అడివియైనయెడల దానికి మధ్యప్రదేశమునగాని, లేక బస్తీగాని పల్లెగాని యయిన యెడల చాలా దారులు కలసియున్నకూడలిగాని గమ్యస్థానముగా యేర్పరచవలెను. వేగులవాండ్లుగా యేర్పరచబడిన వారిద్దరు గమ్యస్థానమునాకు రెండు మైళ్ళ దూరమునుంచి యెదురు బడులుగా బయలు దేరి యెదురిపార్టీ వారిచేత పట్టుబడకుండ గమ్యస్థానము జేరబ్రయత్నించవలెను. మిగతా రెండుపా