Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No. 6 (1919).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదలగువానియందు నెట్టియాకారములు గానవచ్చునో యట్టియాకారమే యాయాయక్షరమున కియ్యబడినదని యక్షరవిధానశోధకులు వచింతురు. రూపము సంకల్పించినపుడు మెదడునందెట్టులో యక్షుని ముచ్చరించినపుడు నోరనట్టులే మార్పుకలుగును. ఒక్కొక్క యక్షరము పలుమాఱు జపించిన నొక్కొక్క ఫలము గలుగునని మంత్రయోగశాస్త్రములు చెప్పుచున్నవి. అక్షరములన్నియు బీజాక్షరములే. అక్షరజపము వలన ఫలము గలుగుట సత్యము, దీనికిఁ గారణమార యుదము. ఒక్క యక్షరముపలుమాఱు జపించినయెడల వరములందు నొక్క విధమయిన చలనము (Vibration) విడువక కలుగుచున్నది. ఈదలనమేకతాళమువలె నేకవిధగమనము కలదైయుండవలయును. నడుమనడుమ భిన్నించినఁ గీడుకలదు. దీర్ఘ సమగ మనమువలన నొకశక్తి యావిర్భవించును. ఆశక్తికొలఁది ఫలము గలుగును. మంత్రములు ఫలప్రదములగుట కిదేయొక కారణమై యుండవచ్చును.

ఆకారస్వరూపము మీరంద అఱుఁగుదురు. ఆయక్షరమునుచ్చరించునపుడు పెదవి పెదవి కలియకనోరు తెఱచి కొనియుండునుగదా. అకారమందు మొదటివలయము పై పెదవి యనియు దానికెదురుగనుండు దంపు క్రింది పెదవియనియు రెంటికి నడుమనుండు నెడము రెండు పెదవులనడిమియంతరాళమనియు భావించితి రేని ధ్వనిని సూచించు నడిమిలోగీఁత పెదవులు దాఁటిపోకుండుటయు నెఱుఁగఁగలరు. ఇప్పుడు మన మకారము నడ్డముగ వ్రాయుచున్నారము. అటు గాక నిలువుగా వ్రాసితిరేని నేను జెప్పినది సుబోధమగును.

ఇఁక ఉకారము విధము చూతము. ఉకారముచ్చరించునప్పుడు పెదవు లేయాకృతిని బొందునో కనిపెట్టి యాయాకృతికి ఉకారము సరిపోవునోపోవదో చూడుఁడు. ఇందును రెండు పెదవులు, నడుమ కంఠమునండివచ్చు ధ్వనిని దెలుపు గీఁతయఃఁగలవు గాని య కారమందువలెఁ గాక గీత వెలుపలికి బోవనుంకించుచుండును. ఈ గీతయందిట్టి యత్నము కలదని దీర్ఘమైన ఊ కారమునందు స్పష్టపడు చున్నది. ఉ - కారము ఓష్ఠ్యము కదా.

ఇంక ఓ కారమును బరిశీలింతము, ఆ కారము ఉ కారము సంధికలియఁగానైనది ఓ కారమనిమీ రెఱుగుఁదురు. అకారము కంఠ్యమనియు, ఉ కారము ఓష్ఠ్యమనియు నీరెంటిసంధివలననైన ఓ కారము కంఠోష్ఠ్యమునియును మీరెఱుఁగుదురు, అక్షరస్వరూపమందును నీ సంధిగాన నయ్యెడి. ఉ కారము నడిమిగీఁతతొలగించి ఆకారము నందలి మొదటివలయము ఉ కారమునకు వైవైపుగఁజే ర్చ యా గీతలోఁ గలిపిన ఓ కారమగును. ఓ కారమునధ్వని యూర్థ్వగతముగావున ఓ కారము తలపై గీఁతగీయవలెను.

ఇ కారముచ్చరించునపుడెట్లు ధ్వనియధోముఖరుగునో యట్లే ఆదియు నధోముఖముగనే వ్రాయఁబడును. ఏ కారముచ్చరించు నపుడెట్లు ధ్వని యూర్థ్వపథగామియగు నో వర్ణమునట్లే వ్రాయఁబడును. ఉచ్చారణము ననుసరించి ఐ క్రిందఁజూచునట్లు వ్రాయుచున్నాము. పరిశోధించు వారికిట్టి చిత్రము లింకను దెలియ వచ్చును.

వీనినన్నిటిని చక్కఁగనాలోచించినచో మనయక్షరములు కొండగుర్తులని మీరందురా?

ఇంతియ కాదు. అన్ని యక్షరములు కంఠముమొదలు పెదవులకు లోపుబుట్టును, కంఠముమొదలు పెదవులకు నీవలఁగాని పుట్టినవి లేవుకదా. ఇంక నక్షరములనుజూచిన ఆ కారము మొదటిది, మ కారము కడపటిది. మ కారమోస్ట్యము. మ్ అవ్వగానే నోరుమూతపడును. తరువాత నక్షరమెట్లు పుట్టును. కంఠమునకుఁ బెదవులకు నడుమ ఉ కారధ్వని యెట్లు సంచరించుచు రెంటికి సంబంధము గలుపునో యట్లే అ కారమునకు మ కారమునకు నడుమ ఉ కారమువచ్చి ఆఉమ్ అయి ఓమ్ అగును. కంఠమునకుఁ బెదవులకు నడుమనే ధ్వనియిమిడియుండునట్లు సమస్తశబ్దప్రపంచము ఓమ్ అను నొంటియక్షరములో నిమిడియున్నది, వాచ్యుఁడైన యీశ్వరునందు సమస్తమెట్లిమిడియున్నదో యట్లే వాచకమైన ప్రణవమందును సమస్తమిమిడియున్నది. వాచ్యుఁడెట్లు ముక్తిప్రదుఁడో వాచకమట్టులే ముక్తిప్రదము. ఈవిషయమింత కెక్కువ వచించుట యప్రస్తుతమగును గావి ప్రణనము పరబ్రహ్మవాచకమై ప్రణవమందు సమస్తశబ్దప్రపంచమిమిడి యుండుటచే శబ్దప్రపంచమంతయు బ్రహ్మమయమే యగును. నూక్మమొకటి స్థూలమొకటి అంత మాత్రమేభేదము, శబ్దప్రపంచమంతయు బ్రహ్మమయ