Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No. 6 (1919).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రామములో నియంతః కలహములు నిర్జింపఁబడఁగలవు. గ్రామస్థులు వివేకులై, కలహములచే న్యాయస్థానముల కెక్కి ధనవ్యయముసేయక గ్రామములో వివిధవిషయములను బంచాయితీమూలముగఁ బరిపాలించుకొనుచు సంపూర్ణ స్వాతంత్ర్యముఁగ స్వల్పసంస్థానములవలె వృద్ధిఁజెందఁగలవు. దేశసేవకు మార్గదర్శకము కాగలవు. కాన

గ్రంథాలయ వ్యాపనము

కై సర్వప్రయత్నములు సలుపవలయును. సంచార గ్రంథాలయములచే మండలములోని ముఖ్యపట్టణముల కును, తాలూకా ఫిర్కా పట్టణములకును పరస్పరసంబంధముఁ గలుగఁజేసి, అమెరికా, బరోడా సంస్థానములలో జరుపురీతి గ్రంథాలయోద్యమమును జరుపుట యుత్తమము కాని స్వదేశసంస్థానములవలె మనకవకాశములు లేకుండుటయేగాక, రాజాదరణ సహితము తగినంత లేక యున్నది. కాన

స్వయం సహాయము

చే మన మీ యుద్యమమును నిర్వర్తించవలసియున్నది.

౧. గ్రామసముదాయమునకు సంబంధించిన బీళ్ళు,కంచలు, దొడ్లు లోనగువానినుండి వచ్చు వరుంబడి, మనలో నిరంకుశాధికారముగల యొకరిద్దఱిచేవసూలు చేయఒడి, నీతిబోధకు మాకు దుర్వృత్తుల కవకాశముఁగలిగించునట్టి యుద్యోగస్థులకు నియ్యవలసిన మామూళ్ళకును,లంచములకును, మిగత పైకమును లెక్క ఁజూపకయే స్వార్ధముకొఱకు వినియోగపరచుటయ తటస్థించుచున్నది. ఈ మొత్తము గ్రంథాలయముల కార్యనిర్వాహక సంఘమున కర్పించిన, వారు వలయువారికి ఖర్చుపెట్టి మిగత మొత్తమును గ్రంథాలయ నిర్వహణమునకు వినియోగపరచుట లాభకరముగ నుండును.

౨. సదుద్దేశ్యములతో దేవాలయములను స్థాపించి,భక్తులచే జీవనముల నేర్పాటుజేసినను, దుర్వ్యయములకును, ఉత్సవాదులయందు యనావశ్యకములగు వ్యయములఁబెట్టుట మామూలై యున్నది. దేవాలయములందు, మఠములు, సంస్కృత, వేదపాఠశాలలఁ బోషించుట మానివైచిరి. ఇందువల్ల ర్యాదగిన ధనమును యీయుద్యమమున కుపయోగించుట భావ్యము.

౩. నురుపిళ్ళయందును,వివాహాది కార్యములయం లాభములలోకొంత భాగమును, గ్రామములోని కొలగారమువల్ల వచ్చువరంబడియు, లోనగు యాదాయములచే గ్రంథాలయోద్యమము వ్యాపనము కాగలదు.

ముగింపు.

ఆంధ్రోద్యమప్రారంభమాదిన యాంధ్రదేశమున నూతనశక్తి వ్యాపించినది. కామ్యార్థములకు శక్తిసాధనము లాపశ్యకములు ఘనకార్యములు త్యాగయుతములై యున్నవి. కీర్తి ఘనకార్యమువల్లఁ బడయవచ్చు. గతించినిను సజీవులుగాఁ జేయునది కీర్తియై యున్నది. కీర్తిశేషులుగాఁ జేయునది శారదాలయములై యున్నవి. ప్రస్తుతమున కార్యశూరత్వమునకు శక్తిజాలక వాక్ ప్రౌఢిమతో జరిపింపఁబడు సభలవలెఁగాకఁ గార్య శూరులై గ్రంథాలయములు వెలుఁగు చున్నవి. ఆంధ్ర పత్రికాధిపతియగు శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావుగారి నుడువు లీతరుణమున స్మరణకువచ్చుచున్నవి. "గ్రంథాలయ ప్రతినిధులు కార్యశూరులు గాని వాళ్ళూరులు గారు. స్వయంసహాయావలంబులుగాని నివేదనావలంబులుగారు. త్యాగపరులుగాని స్వార్థపరులుగారు; సేవానిరతులుగాని లాభార్థులుగారు. మాతృభాషాభిమానులుగాని మాతృభాసానిర పేక్షకులుగారు”

జన్మసాఫల్యముఁ గాంచుటకు భగవత్ప్రతినిధులగు మానవులసేవ యావశ్యకము. నిర్గుణబ్రహ్మోపాసనకు సగుణబ్రహ్మోపాసన యావశ్యకము. ఇదియే ప్రపంచముయొక్క పరమావధి శాన యాత్మావలబ్ధికిని, మదీయ సోదర యాత్మావలబ్ధికిని ప్రధానసోపానమైన గ్రంథాలయోద్యమము నుత్సాహముతోను శ్రద్ధాభక్తులచే నుత్తేజముఁ గలిగింపవలయును. సర్వేశ్వరుఁడీసభకు సర్వైశ్వర్యములు ప్రాసాదించుగాఁత, ఓం శాంతిః

అధ్యక్షులగు శ్రీవావిలకొలను వేంకటసుబ్బారావుగారి - యుపన్యాసము

సత్యభాషణము దోషావహముకాదు. ఆంధ్రలోకపురోవృద్ధి సూచకముగ దేశమున స్థాపింపఁబడుచుండు గ్రంథాలయములను గుఱించి నేనేమియునింతవఱకుఁ బరిలించినవాడను గాను నాయందీలోపముగా గలదని సన్నీ సభకాహ్వానింపవచ్చిన వారికి విన్న వించుకొంటిని.