ఘములు 39 గానవచ్చుచున్నవి. మండలములలోని గ్రంథాలయములలో నెల్లూరులోని తిక్కన భాండాగారము సుప్రసిద్ధము పోట్ల పూడి మందలివి వేకానంద ధర్మపుస్తక భాండాగారమును, గండవరములోని రామమోహన గ్రంథాలయమును బేర్కొనఁ దగియున్నవి. గ్రంథాలయోద్యమముపట్ల ఈమండలమున శ్రద్ధతో పనిచేయుచున్న వారలలో శ్రీయుత పొణకా పట్టాభిరామారెడ్డి గారు - నెల్లూరు వేంకట్రామానాయఁడు, పెల్లేటి ఆదినారాయణరెడ్డి, సర్వాభొట్ల గోపాలకృష్ణయ్య, తూమాటి మల్లారెడ్డి, మన్నేపల్లి రామకృష్ణ రావు గారులు ప్రశంశాహులు.
పూర్వులు: పామరజనులందు భక్తిలిబురిఁకొల్పుటకై సతీసమేతులైని శివకేశవాలయములు నిర్మించి నిత్యనైవేద్య దీపరాధనలకై మడిమాన్యములు దేవాదాయాదులు సమర్పించి శాశ్వతధర్మముల నెలకొల్పిరి. అట్టి పుణ్యమూర్తుల సంతతివారమగు మనము కొఱఁతబడినవిద్యాదేవతయగు శారదాంబకు భవనముల నిర్మించి ఆర్చకునకు ఆలయ సంరక్షణములకు కానుకలను, మాన్యములనర్పించ వలయును. ఈనిలయములే గ్రంథాలయములు. అర్చకుఁడే గ్రంథాలయాధిపతి.
ఈగ్రంథాలయములు గ్రామమున మధ్యగట్టఁబడి, దేశీయపరిశ్రమలకు దగిన స్థానములై యుండవలయును. పూర్వమువలె యువకులు పాఠశాలలనుండి బయలు వెడలునపుడు సింగ పుఁగొదమలవలెగాక, నిరుత్సాహులై, ధైర్యస్థైర్యములుడిగి జీవయాత్రక సమర్ధులై యుండుటఁ జూచుచున్నారము. ఈదురవస్థ సుపశమింపఁజేయట యొకధర్మమైయున్నది. అందలి యధికారి సర్వసమర్ధుఁడై గ్రామములోని వ్యాయామములఁ జక్కగవరసి యందులకు వలయుపొత్తములను కరపత్రములను తెప్పించి పంచి పెట్టవలయును. విరామములేక కృషికలుపు వ్యవసాయకులను, సోమరితనముచేతను,చెడ్డవృత్తులచేతను గాలముఁగడుపు బుద్ధిహీనులను సహితము నాకర్షించి జ్ఞానోపదేశముజేయుట కనేకమార్గములు గలవు. అందు
౧ వార్తాపత్రికలు వివిధరకముల గ్రంధములు ధ్మపయోగమునకై యుంచవలయునను వారలకు శ్రద్ధ గలుగుటకు వార్తాపత్రికలనుండి విషయములజగువుచు, వారికి యుత్సాహముపుట్టునట్లు కలసిమెలసి ముచ్చటించుటయు, పూర్వ గ్రంధములనుండి రాగయుక్తముగఁబాడి వారికిబోధించవలయును. మఱియు, నవీన పాశ్చాత్య నాగరికతావ్యామోహకులై లోక వ్యవహారములయందు కేవలము ధనకాంక్షచే వ్యాపార సంబంధముగ వతి౯ంపక, పారమార్ధికములచే సంచరించి జ్ఞానమునుబడని నిజమైన భారతీయుల మనిపించుకొనవలయును.
౨. ఉపన్యాసములు:— పెద్దల నప్పుడప్పుడు రావింగ్రామస్థుల కుపన్యాసము లిప్పించుచుండవలయును
3. వివిధవస్తుప్రదర్శనము: వివిధవస్తువులను సేకూర్చి వాని ప్రాముఖ్యతను వెలిఁబుచ్చవలయును. వాని సంయోగమువలని లాభములును, మార్పులును గ్రామమున కుపయోగించవలయును.
౪. మాజిక్ లాంతరులు ౫. భోజనకాలక్షేపములు, ౬. పురాణశ్రవణము, ౭. హరికథలు: —— వీనియందు యుక్తియుక్తముగ జనోపయోగములగు విషయములఁ గుఱించియు బోధిఁజేయుట కెక్కువ యవకాశములు గలుగుచున్నవి. మణియు, దేశభాషలను బెంపొందింపఁ జేయుటయు, కర్తవ్యమైయున్నది. భావములుగల పండితుఁడైనను, భాషాజ్ఞానములేనిది రంజిల్లనేరఁడు. కాన మన యాంధ్రభాష సంస్కృతముతో మైత్రికలిగినందున బ్రఖ్యాతిఁగాంచి ప్రజలను ర౦జింపఁ జేయుచున్నది. క్రిందట నే ఆంధ్రభాష “దేశ భాషలందుఁ దెనుఁగు లెస్స” అని కవిపుంగవులచేఁ గొనియాడఁబడియున్నది. ఇట్టి యాంధ్రభాష ఉన్నతదశయందుండియు, భాషనుయభివృద్ధిఁ గాంచుటకుఁ బెట్టఁబడిన పరిషత్తులలోఁ బ్రఖ్యాతిఁగాంచియు, ఉద్గ్రంథరచనయందు నుత్సాహముతోఁ దోడ్పడుటయుఁ గవివర్యులను, పండితవర్గమును బూజించుటకుమాఱుఁగ “చెట్టుచెడి కుక్క మూతి పిందెలు పుట్టె" ననురీతి గ్రామ్యభాష దేశమునకు యోగ్యమని వాదులాఁడువారు మాతృభాషాపోషితులు గారని వేఱుగఁ జెప్పనక్కర లేదు.
శారదానిలయములు, వివిధజాతులవారి వ్యక్తులను, ధర్మములను, కర్తవ్యములను, వివిధ చట్టములను దేట తెల్లముఁజేయుచున్నవి. కాన యవిమన సముదాయపు వ్యవహారముల యందెక్కువ యుపయోగకారులై పరిణమింప గలవు· గ్రంథాలయములు స్థాపించినకొలఁది, శారదాంబ కటాక్షముచే నజ్ఞానముఁబాసి చేకూర్చి,