Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No. 6 (1919).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయ గోదావరిమండల గ్రంథాలయసభ. డని వా నుచిత రీతిని బడయుటకు వలయు విద్యాపద్ధతులు నిణీ౯తము లగుచున్నవి. దేహమాత్మకర్మక్షమమై యుండ వలయును. విద్య యైహిక పారలౌకికజ్ఞానప్రదమై యుండవలెను. అప్పుడే నిజమగు నాత్మస్వారాజ్యస్వాతంత్య్రము పురుషునకు లభించును. ఇదియే యుపనిషదగ్ధముకూడ.

గ్ర౦థాలయములు

ఇట్టి విద్యావ్యాపనమునందు గ్రంథాలయములు ముఖ్యసాహాయ్యములు. పండితున కుత్తమగ్రంథములకంటె వెఱో౦డు ధనములేదు. అపరిగ్రహులగు సన్యాసులకు గూడ గ్రంధములే ధనముగా నెంచి తద్దోయవిభాగమును గూర్చి విజ్ఞానేశ్వరయోగీ సూత్రము లేర్పఱచి నాఁడు. నిరతిశయమగు సర్వప్రాపంచిక సౌందర్యసారము నోక్కచోఁ బేర్కొనవలసినచో కాకుంతలమును స్మరింపజనునని జర్మనుకవి యుగ్గడించి యుండెను. ఒక్క గ్రంథరాజముయొక్క మహాత్మ్యమట్టిదియగునెడ నద్భుతగ్రంథరత్న భాండాగారమగు గ్రంథాల యమహిమ పెట్టువర్ణింపనగును. పూర్వకాలమునుండియు గ్రంథప్రశస్తి మనదేశమున గ్రహింపబడి సుప్రసిద్ధ రాజ్యస్థానములయందును నవద్వీపాది విద్యానిలయముల యందును మఠములయంగును దేవళములయందును పండితగృహముల ముందును గ్రంథములు పెక్కులు సంగ్రహింపబడుచుండెను. కాశ్మీరదేశమున శ్రీనగరమున సరస్వతీపీఠమని ప్రశస్తిగాంచినది. యచ్చటి గ్రంథరాజములును విద్వచ్ఛేణియునై యున్నవి. మద్ధారకులుకూడ దూరాధ్వములు నడచి యచ్చటికేగి విజయముగాంచి తమ గ్రంథములనిచ్చి మతవ్యాపనదీక్ష వహించియుండిరి; గ్రథాలయముల యాకర్షణశక్తి యట్టిది. వారణాసి క్షేత్రముకూడ వట్టిదే. బౌద్ధమతప్రచారముగల కాలమున బౌద్ధవిహారములయందెన్నియో యుత్తమగ్రంథము లుండియుండెను. మతములు క్షీణదశకు వచ్చి రాజ్యము పరహస్త గతంబైన బిదప బ్రజలయం దుదరభరణమే కష్టమగుటను విద్యావ్యాసంగము గ్రంధసంపాదనాసక్తియు తగ్గిపోయి యుండుటను గ్రంథము లనేకములు ఖిలమయినవి. భారత భరతఖనియం దమూల్యరత్నములగు గ్రంథరాజములు కొన్ని విదేశరాజ్య గతములయినవి. సంధివిషయమున భరతఖండమునుండి జర్మనుచోరులవలన గొంపోబడిన గ్రంథరత్నముల దేఱిగి మన దేశమున కర్పింపబడునటుల గోరుడని వాక్రుచ్చిన హిందూమహా సభాధ్యక్షుకోపన్యాసము మనసంత్రాసమును వెలిబుచ్చుచున్నది.

గ్రంథాలయోద్యమము

పూర్వగ్రంథాలయచారిత్ర మెటులుండ నవీనగ్రంథాలయవిజృంభణ మించుక యాలోచింతము. పాశ్చాత్యదేశములయం దీయద్యమము బాగుగ వాడుకొని ప్రభుత్వములవలనను విశ్వవిద్యాలయములు మున్నగు ప్రతిస్థాపనముల వలనను బోషింపబడుచున్న యంశము తమకందఱకును విదితంబయి యున్నది. పుస్తక సామగ్రియు విజ్ఞానమును విచ్చలవిడిగా ప్రజలకందఱకును సులభ్యములగు నటులు దగుయత్నములు జేయబడుచుండును. దివ్యభవనములు పుస్తకాలయములుగ నిర్మింపబడియున్నవి. ఉచితముగను అల్పములగు చందాలవలనను సమూల్యములగు పుస్తకముల ప్రజలు జదివి జ్ఞానాభివృద్ధి చేసుకొనుసాధనములు పాశ్చాత్యదేశములదేశములయందు గలవు. స్త్రీలకును పురుషులకును నీరూపమున విద్యాగ్రహణము సులభసాధ్యమై యున్నది. లక్షల కొలది ద్రవ్యము వెచ్చింపబడును. చదువరుల నాకర్షింపదగు నానావిధ సౌకర్యములుగూర్ప బడును. పుస్తకములలోని సారమున కనురూపముగ బాహ్యాలంకారములు, చిత్రముద్రణము, సొగసైనయట్టలు మొదలగు నెన్నియో యలంక్రియ లోనగూర్ప బడును. మఱియు పుస్తకము లసంఖ్యాకములగుటచే సెక్కుచోట్ల పుస్తక వివరణపట్టికాక్రమమే యొకళాస్త్రముగా సభ్యసింపబడు చున్నది. ఆమెరికా దేశము సన్ని విధముల నీయుద్యమ ముత్కృష్టదశయందున్నది. మనదేశమున బరోడా సంస్థానమునందు శాస్త్రసంశోధిత పద్ధతుల నీయుద్యమము వ్యాప్తజెందునటుల జేయబడు చున్నది. మనయాంధ్రదేశమున ముఖ్యముగ నామిత్రులగు శ్రీయుత అయ్యంకి వెంకటరమణయ్య పంతులు, శ్రీయుత నూరి నరసింహశాస్త్రిగార్లచే నీయుద్యమము వ్యాప్తము కాబడినది. వారిభాషాభిమానము దేశసేవారతియు సంస్తవనీయములు. ఉద్యమ మారంభమనయిది మొదలు, సర్వంకషముగ నాంధ్రలోకమునం దంతటను కోనలు సాగినది అభినవదీప్తితో విరాజిల్లుచున్నది. ఇతర