దు తీర్లతను దెలుపు పతక మగును. దీక్షావాక్యమును, కమలమును గలసిమధ్యమశికయందు తీర్థతను దెలుపు పతక మగును. ఉత్తమ శిక్షయం దుత్తీర్ణతను దెలుపు పతకమునందు ఈ మూడు చిహ్నములను గలిగియు౦డును. ఉద్యోగులును, జ్యేష్ఠభటులును ధరించు పతకమునందు ఈ మూడు చిహ్నములుండుటయే గాక చుట్టును గుండ్రని యాకారముగ నేర్పడియుండును.
దీక్షా వాక్యము - “సిద్ధపడి యుండుము” (Be prepared) అనునది దీక్షా వాక్యము. నాగరికత జెందిన దేశములన్నిటియందును ప్రపంచమంతటనుగూడ భటులకిదియే దీక్షా వాక్యము. మనము పొందునట్టి తరిబీతు అంతయు సేవకొరకేననియు, ఆకస్మికములగు అనసరముల కెల్ల మనము సిద్ధపడి యుండవలయుననియు, ఆవాక్యము మనలను ఉద్బోధించుచుండును.
కమలము భారతవర్షమంతటను ప్రీతి పూర్వకముగా జూచు చిహ్నము. బురదగుంటయందు జన్మించి ఉదకముద్వారా బైటికి పెరిగి అక్కడ సూర్యరశ్మి తగులగానేవికసించి సౌరభముతో గూడిన సౌందర్యవంతములగు దళములను ప్రకాశింప జేయుచున్నది. అందుచేత కమలము పవిత్రతను, వాంఛను సూచించు చిహ్నమైయున్నది. కమలమువలెనే భటులు గూడ, స్వార్థపరత్వమను చీకటినుండి వెలుగునకువచ్చి తమ సేవావ్రత సౌరభమును ఇతరులకు వెదజల్లి ప్రపంచము నింకను సౌందర్యవంతమగునట్లు జేయ పాటుబడు చుందురు.
భానుడుగూడ భారతవర్షము యొక్క చిహ్నమేయి యున్నది. ఇది మహ్మదీయుల యొక్కయు చిహ్నము. ఉదయభానుని వలెనె మన గౌరవ ప్రపత్తులు మనసేవ అత్యున్నతంబులై వెలుంగవలయును. దేవుని, సామ్రాజ్యమును, దేశమును, సేవించవలయునని నిష్కల్మషముగ వాఛించు పుత్రీ పుత్రకులు పది వేలమందియైన భారతవర్షమందు ఉదయింపగలిగిన యెడల, శ్రీరామచంద్రమూర్తి- అక్బరులనాటి ప్రాచీన ఔన్నత్యము తిరిగి పునరిద్ధరింపబడగలదు.
౫ భటుని దుస్తులు
ప్రతిజ్ఞ తీసికొనునాటికి భటులందరును భటుని దుస్తులను సంపాదించుకొన వలయును. ఈక్రింది దస్తులు భటునికి అత్యంతావశక్యములు.
కాకీషర్టు ౼ కాకీషర్టు బుజములమీద పట్టీ, వక్షమునందు రెండు జేబులు, జేబులకు మూతలు కలిగి యుండవలయును. దానికి గుండీలు "కాకి" రంగునే గలిగి యుండవలయును.
మట్టలాగు ౼ కాకీమట్టలాగు, మోకాలు వరకు మాత్రముండవలయును.
తలగుడ్డ ౼ ముదురు ఆకుపచ్చని గుడ్డ 3 గజములు మొదలు 3౺ గజముల పొడవుండవలయును.
మెడరుమ్మాలు ౼ ౨౭ గాని 3౦ గాని అంగుళములు చతురమునుగలిగి మెడచుట్టును కట్టుకొనుట కుపయోగించును. అది జట్టు ఏ రంగును నిర్ణయించుకొనునో ఆరంగునే కలిగి యుండవలెను.
బుజము మీది ముడి - 1¾ గాని 2¼ గాని వెడల్పును ఆరు అంగుళములు పొడవును గల ౪ ముక్కలు ఎడమబుజముమీది చొక్కాకు తగిలించుకొన వలయును. ఇదియును జట్టు యొక్క రంగునే గలిగి యుండవలయును.