Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.5 (1919).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలయును. ఏభటుడైన వందనము చేసినప్పుడు తిరిగి ప్రతినందనమును చేయవలయును. భటునకు చేతిలో భటదండ మున్నప్పుడు ఆ దండమునకు కుడిచేతిని సమకోణముగ ఆనించిన అదియేనమస్కారము. (7వ పటమునందలి మొదటిబొమ్మ భటుడు చేతిలో దండముతో నిలువ బడినప్పుడు చేయుపద్ధతిని, రెండవ బొమ్మచేతిలో దండముతో నడచుచున్నప్పుడు చేయు పద్ధతిని సూచించుచున్నవి).

౯వ పటము యూనియన్ జాక్ - (రాజుగారి బావుటా) తెగల్లగుడ్డమీద ఎర్రని అడ్డగీతలున్నది. ఇంగ్లండు'(సెంటు జార్జ్. 8వ పటమున మొదటి బావుటా) యొక్క బావుటా; ఊదా గుడ్డమీద అయి మూలలకున్న తెల్లగీతలుగలది స్కాట్లాండు (సెంటుఆండ్రూ. 8 వ పటమున రెండవ బావుటా) యొక్క బావుటా. ఈ రెండు బావుటాలును ౧౬౦౬ వ సంవత్సరమున కలుపబడినవి. తెల్లగుడ్డమీద ఐమూలలకున్న ఎర్రగీతలుగలది ఐర్లాండు (సెంటుపట్రిక్ - 8 వ పటమున 3వ బావుటా) యొక్క బావుటా. ఈ మూడును ౧౮౦౧ వ సంవత్సరమున గలుప బడి "యూనియ౯ జాక్" అను పేరుగల బావుటాయైనది. (మనలను పరిపాలించుచున్న ప్రభువుల దేశమునందు ఇంగ్లాండు, స్కాట్లాడు, ఐర్లాండు అనిమూడు దేశములున్నవి. ఆమూడును పైవిధముగా కలిసి సంయుక్త రాష్ట్రములైనవి.) అప్పటినుండియు ఈ బావుటా ఒక సంయుక్త రాష్ట్రముల కేగాక సామ్రాజ్యమున కంతకును బావుటాగ అంగీకరింపబడినది. అది మన రాజుగారగు జార్జి ప్రభువర్యుని ప్రతినిధిగ నెంచి, దానికి భక్తిలో సమస్కరింపబడును.

ఐర్లాండు దేశముయొక్క చిహ్నమగు అయిమూలలందు ఎర్రగా ఉన్న గీతలు స్కాట్లాండు దేశ చిహ్నమగు అయిమూలలందు తెల్లగా ఉన్న గీతల మయముగా వేయక ఒక ప్రక్కగా వేసిరి. అందుచేత ఎర్రని అయి మూలగీతలకు ఒక ప్రక్కను తెల్లనిగీత వెడల్పుగను రెండవ ప్రక్కను సన్నగను కానిపించుచున్నది. ఈ ఎర్రని అయిమూలగీతకు ప్రక్కనున్న తెల్లని వెడల్పుగీత పైభాగమునకు వచ్చులాగున ఈ బావుటాను ఎగుర వేయనలయును. ఈ విషయము ముఖ్యముగా గమనింపవలయును. జనులు సాధారణముగా ఎర్రని అయిమూల గీతకు ప్రక్కనున్న సన్నని తెల్లగీత పై భాగమునకు వచ్చులాగున బావుటాను కట్టెదరు. ఆది సరియైన విధముగాదు. భటు లెప్పుడును ఈ తప్పును చేయరాదు. 9వ పటమున మొదటి బావుటా సరియైన పద్ధతి నెగుర వేయుటను, రెండవది తప్పుగా నెగుర వేయుపద్ధతిని సూచించుచున్నవి.

భారతవర్ష బాలభటుని పతకము - ఈపతకమునందు దీక్షా వాక్యము, కమలము, భానుడు అని మూడు చిహ్నములు గలవు. కమలమును భానుడును గలసి ప్రాధమిక శిక్షయం