ప్రతిజ్ఞలను చేసియుంటివి గదా! ఆమూడుప్రతిజ్ఞలను ఎల్లప్పుడును నీకు జ్ఞప్రియందుండి ఆచరించుటకును నీవు నమస్కరించు భటునికి జ్ఞాపకము చేయుటను ఈ మూడు వ్రేళ్లురు సూచించును. (ఆరవ పటమును జూడుడు).
౭వ పటము
౮వ పటము
కుడిచేతిని భుజమునకు సమరేఖలో నుంచి మూడు వ్రేళ్లను కణతకు తగిలీతగలనట్లు ఉంచవలెను. దీనికి సంపూర్ణవందననుని పేరు (7వ పటముందలి 3వ బొమ్మనుజూడుడు). కుడిచేతిని మడచిన భుజమునకు తిన్నగా వ్రేళ్లు వచ్చును; అప్పుడు అరచేతిని ఎదురు వైపునకు పెట్టి మూడు వేళ్లను చూపిన అది అర్థవందనము (7వ పటమందలి 4వ బొమ్మను జూడుడు). ఒక భటుడు సమానహోదా గలిగిన మరియొక భటుని తెలిసికొన్నప్పుడు అర్ధవందనము నిచ్చును; తన పైయధికారి జట్టు పెద్ద, సేనాపతి, భటోపాధ్యాయుడు, మొదలగువారికి సంపూర్ణ వందనము నిచ్చును. భటులు, తమభటవస్తులయందున్నప్పుడు, రాజుగారి "కమీషండుఆపీసరు "లకు "యూనియన్ జాక్" అను బావుటాను రాజుగారికై ఎగుర వేసినప్పుడు (అనగా కోటమీదదాని, సైన్యముతీసికొని పోవునప్పుడుగాని, కవాతు సమయమందు గాని) ను, సంపూర్ణ వందనమే చేయవలయును. రాజుగారిమీద కీర్తన, భరతవర్షముమీద కీర్తన, వందేమాతర కీర్తనలను పాడుటకు పూర్వమునందును పరమందును గూడ సంపూర్ణ వందనమే చేయవలయును. భటదుస్తులయందు లేని యెడల, “హుషార్ " (Alert) గా నడచుచుపోయినచాలును. భటదుస్తులయందున్నను లేకపోయినను భటులు పరస్పరము కలిసికొన్నప్పుడు వందనముల నిచ్చుకొనవలయును. కొందరు భటులు ఒకచోట నిలుచుండి యుండగా, పైయధికారివచ్చిన యెడల, ఆ భటులందు" పెద్ద” వారినందరిని "హుషార్" గా నిలునబెట్టి, తానొక్కడు ఆ పైయధికారికి వ౦దన మొసంగినచాలును. వందనము లెప్పుడును కుడిచేతి తోడనే చేయ