Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.5 (1919).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిమ్ము లేదా మాట్లాడక ఊరకుండుము.

౬ భటుడు భూతదయగలవాడు.

జంతువులన్నిటికిని బాధకలుగకుండ తన చేతనైనంతవరకు చూడవలయును. అనవసరముగ ఏ జంతువునుగాని చంపకూడదు; ఇతరులచేత చంపింపను కూడదు. పెంపుడుజంతుపులను అలక్ష్యముగా విడిచి పెట్టకుము.

౭. భటుడు తల్లిదండ్రులయొక్కయు, బాలభటోద్యోగీయుల యొక్కయు ఆజ్ఞలను నిర్వివాదముగ శిరసావహించును

ఉద్యోగుల యొక్కయు, తల్లి దండ్రులక్కయు, జట్టు పెద్దల యొక్కయు, యోగ్యుల యొక్కయు ఉత్తరువులను శిరసావహించ వలయును. నీకు ఇష్టముకాని ఉత్తరువును ఇచ్చినప్పటికిని నెర వేర్చుట నీధర్మ మగుటచే, దానిని శిరసావహింపవలెను. ఆ ఉత్తరును నెర వేర్చినపిమ్మట, దానికి వ్యతిరేకమగు సంగతులేమైన ఉన్న చెప్పనలయును. ఇదియే శిక్ష (Discipline.)

౮. భటుడు ఎట్టి కష్టములందును సంతోషమును విడువడు.

నీకు ఉత్తరువునిచ్చిన, దానిని సంతోషముతోడను ఇష్టముతొడను, తక్షణమే నెరవేర్చవలయునేగాని, అది నీకిష్టములేక పోయినప్పటికిని, దానిని నెమ్మదిగాను అసుతుష్టితోడను అసమ్మతితొడను చేయగూడను. భటుడెప్పుడును గొణగుటగాని మూలుగుట గాని చేయడు. పరిస్థితులు అసంతుష్టికరముగను అపకారముగను ఉన్నప్పటికిని, గొణిగినగాని, మూలిగినగాని లాభమేమియు లేదు అట్లు చేయుటవలన ఇతరులకు గూడ అసౌఖ్యము గలుగును. అట్టి పరిస్థితులయందు గూడ సరియైన భటుడగువాడు ఉల్లాసములో తోడనే నిండియుండి, కష్టములనుండి తొలగుటకై ప్రయత్నించును. ఓర్పును గోల్పోడు. చెడుమాటల నుపయోగింపకు ప్రమాణముజేయడు. ధైర్యముతోడ కష్టమును బాధను సహించును.

౯. భటుడు మితవ్యయి.

అనగా నీవు ద్రవ్యమును వృధాగా వ్యయపరుపగూడదు. నీవు ద్రవ్యము యొక్క ఉయోగమును తెలిసికొనియుండి, సాధ్యమైసంత కూడబెట్టి, ఇతరులమీదా భారముగాకుండ నుండవలయును. అట్లు కూడబెట్టుట వలన ఇతరులకు అవసరమైనప్పుడు 'సహాయ చేయగలిగి యుందువు.

౧౦. బాలభటుడు త్రికరణ (మనస్సు, వాక్కు, కాయముల) శుద్ధిగలవారు.

ఆతని అలవాటులన్నియు పరిశుభ్రముగా నుండును. ఆతడు తన దేహమును పరిశుభ్రముగాను ఆరోగ్యవణముగాను కాపాడుకొనును. మత్తు పదార్ధములను త్రాగుట, చుట్టలు మొదలగు వానిని కాల్చుట, పొడుము పీల్చుట, మొదలగు అనుపయోగకరములును అసహ్యకరములును అగు అలవాటులు నాతడు దరిజేరనీడు. అపరిశుభ్రమగు ఆలోచనల నాలోచింపను. అపరిశుభ్రమగు కోరికలను కలిగియుండును. అపరిశుభ్రమగు మాటల నుచ్చరింపకు. అపరిశుభ్రమగు కార్యములను చేయడు.

(ట) భటుని గుర్తులు, నమస్కారములు, పతకము (Badge), జెండా.

భటుని గుర్తులు — వీనిని ఇసుకయందు గాని నేలయందుగాని రాళ్ళమీదగాని గీతలు గీచి వేయవచ్చును. పుల్లలతో గాని కర్రలతో గాని చేయవచ్చును. భూమిమీద రాళ్ళను గుర్తులు పెట్టవచ్చును. లేదా సుద్దతో వేయవచ్చును. ఇతర భటులకు ఇబ్బంది కలుగకు౦