గాని, ఉత్తరువును పాలింపకపోవుట మూలమున గాని, భటుడు తన ధర్మమును అతిక్రమించిన యెడల, ఆతనికి అంతకన్న ఎక్కువ అవమానము ఉండబోదు. అట్లు చేసిన ఆతనిని భటోద్యమము నుండి తొలగింప వచ్చును. భటుని ప్రతిజ్ఞా నిర్వహణమునందును, తాను ప్రతిదినమును ఇతరులకు ఉపయోగ కరమైన కార్యము నొక్క దానినైన చేయుటయందును తనకును తన భటసోదర బృందమునకును అవమానమును దెచ్చు ఏ కార్యమునుగాని చేయకపోవుట యందును తన గౌరవము తోడుగా కృషి సలుపవలయును.
౨. భటుడు రాజభక్తిని, దేశ భ క్తిని, మాతాపితలయెడల భక్తిని, తాను సేవజేయువారి యెడల భక్తిని తనకులోబడి యుండు వారియెడల భక్తిని కగిలియుండును.
అనగా, వారికి వ్యతిరేకమగు పనులను ఎంత మాత్రమును చేయగూడదు. వారికి వ్యతి రేకముగ వర్తించునట్టి వారలకును, వారిని గూర్చి అన్యాయముగాను నిర్దయతోను మాట్లాడునట్టి వారలకును నీవు వ్యతి రేకుడవై యుండవలయును. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రలాపములను అపనిందలను కొండెములను చెప్పుటనునీవు అణచి వేయవలయును.
3. భటుడు ఎల్లప్పుడును పరోపకారి.
మిగిలిన వాటికంటే దీనిని నీవు ముందుగ నిర్వర్తింపవలయును. నీ ఆనందమును సౌఖ్యమును నీ క్షేమమునుగూడ లెక్కజేయక ఈ కార్యమునకు గడంగవలయును. ఏదిచేయవలయునో నీకు సందియము తోచినప్పుడు “ఇతరులకు ఏదిఉపకారము?” అని ప్రశ్నించుకొని, దానినే చేయవలయును. ఎవరి ప్రాణమునైన కాపాడుటకుగాని, హానికలిగిన వారికి తోడ్పడుటకుగాని నీ వెల్లప్పుడును సిద్ధపడి యుండవలయును ప్రతిదినమును ఇతరుల కుపయోగకరమగు కార్యమును ఒక్క దానినైన చేయవలయును. అది ఎంత చిన్న కార్యమైనను సరియే ఇతరులకు ఉపకరించునదిగ నుండవలయును. అట్టి ఉపకారము చేసినందులకు నీవు బహుమతిని అంగీకరింపగూడదు.
౪. ఏజాతిమతము వారలయినను ౼ అందరికినిభటుడు స్నేహితుడు; భటవర్గ మాతనికిసోదరులు.
అదివర కెప్పుడును ఎరిగి యుండకపోయిసను నీవు మరియొక భటుని కలిసికొన్నప్పుడు ఆతనికి కావలసిన సహాయమును చేయుటకై నీశక్తిని వినియోగింపవలయును. నీకంటే ఇతరులు బీదవారనిగాని, తక్కువ కులము వారనిగాని తలంచి వారిని నిరసనగా చూడగూడదు. ఇతరులకంటె నీవు భాగ్యవంతుడవని, ఎక్కువ కులము వాడనని విర్రవీగగూడదు. ప్రతివాని యందున్నట్టి మంచినే చూడుము; అంతియ కాని, వానియందున్న చెడుగునుగూర్చి నీవు లక్ష్యము చేయనక్కరలేదు.
౫. భటుడు ఎల్లప్పుడును వినయశీలుడు.
అనగా నీవు అందరియెడలను, అందు ముఖ్యముగా స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, అశక్తులు, వికలాంగుల యెడల వినయమును గలిగియుండవలయును. వారికి సహాయము చేసినందులకుగాని, వినయముగలిగి యున్నందులకు గాని ప్రతిఫలమును దీసికొనగూడదు.
పరాయివారికేగాక, సోదర భటులకును, తలిదండ్రులకును, ఇతర స్నేహితులకునుగూడ వినయము గలిగి యుండవలయును. మోటు మాటలనుగాని అమర్యాదకరమైన మాటలనుగాని ఎన్నడును ఉపయోగింపజనదు. ఎవరైన మోటుమాటల నుపయోగించిన యెడల వారికి మంచిమాటలతోనే ప్రత్యుత్తర